వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

April 3, 2019

2కెరన్‌ను జెండాఊపి ప్రారంభించిన కలెక్టర్‌
‌మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళా సాధికారితను సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ ‌శ్వేతామహంతి ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు. మంగళవారం నాడు ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాల ఆవరణలో ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అందులో భాగంగా మహిళలను చైతన్యవంతులుగా చేయడానికి ఏర్పాటు చేసిన 2కె రన్‌ ‌కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ‌శ్వేతామహంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా వున్నారని నాగర్‌కర్నూల్‌ ‌పార్లమెంటు నియోజకవర్గంలో మహిళలు అధిక సంఖ్యలో ఓటర్లు ఉండడంతో ఎన్నికల్లో నిర్ణేత శక్తి గా ఎదిగే అవకాశం వుందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉందని వారిని గౌరవించవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన వుందన్నారు. విద్యార్థినిలు యువతులు మహిళలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి మనోదౌర్యం ఇచ్చేందుకు జిల్లా పోలీసు ఆధ్వర్యంలో షీ టీమ్‌ ‌బృందాలను ఏర్పాటు చేయడం అభినందించవల్సిన విషయం అన్నారు. మహిళలు ప్రతి శాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు నిజాయితి స్వభావం కలిగి వుంటారని చదువులో రాణించి సమాజంలో గుర్తింపు పొందాలని ఆత్మహత్యలకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతు జిల్లాలో మహిళలకు అత్యంత భద్రత కల్పిస్తున్నామని షీ టీమ్‌ ‌బృందాలు నిరంతరం మహిళల రక్షణలో విధులు నిర్వహిస్తు వుంటాయని మహిళలకోసం ప్రతి పోలీస్‌ ‌స్టేషన్‌లో మహిళా పోలీసులతో ప్రత్యేక రిసెప్షన్‌ ‌కౌంటర్లుఏర్పాటు చేసినట్లు సూచించారు.