Take a fresh look at your lifestyle.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరైనా… అసలు విజేత రాహుల్‌ ‌గాంధీ

రాహుల్‌ ‌గాంధీ లౌకిక వాదం ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన గుడులు, గోపురాలు సందర్శిస్తారు. కైలాస్‌ ‌మానస సరోవర్‌ ‌యాత్రకు వెళ్తారు. ముమ్మారు తలాక్‌ ‌రద్దుకు ప్రతిన చేస్తారు. అదే సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌పై పరువు నష్టం వ్యాఖ్యలు చేస్తారు. అయోధ్యపై సుప్రీమ్‌కోర్టు తీర్పును మాత్రం స్వాగతించరు. రాహుల్‌ ‌గాంధీ సెక్యులర్‌ ఇమేజ్‌ని ద్బ్బెతీసేందుకు ఎందుకు ప్రయత్నించలేదో చెప్పరు. అందువల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఓటమి పార్టీ మాజీ అధ్యక్షుని విజయంగా పరిగణించవచ్చు.ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌ ‌కుటుంబంలో చీలిక నిజమైనదా కాదా అన్నది అసలు సమస్య కానేకాదు. రాహుల్‌ ‌గాంధీ తనదే విజయమని ఢంకా భజాయించి చెప్పవచ్చు. రాహుల్‌ ‌గాంధీ శనివారం సాయంత్రం పంగ చేసుకోవడానికి కారణం ఉంది, నేషనలిస్టు కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌ అన్న కుమారుడు అజిత్‌ ‌పవార్‌ ‌బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా అనువంశిక రాజకీయాలను కాపాడారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నెహ్రూ- గాంధీ కుటుంబ సభ్యులకు అసలు పాత్ర అంటూ లేనప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం వల్ల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక దూరంగా ఉన్నారు. రాహుల్‌ ‌గాంధీ కూడా ఓ అరడజను సభల్లో ప్రసంగించారేమో అంతే. వంశపారంపర్య రాజకీయాలకు ఇది శరాఘాతం వంటింది. ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలి కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ, పార్టీ శ్రేణులు చెప్పుకోదగిన పోటీ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు రాహుల్‌ ‌గాంధీకి షాక్‌ ఇచ్చాయి. గడిచిన నెల రోజులుగా ఆయన ఎన్నికల ఫలితాలపై ఒక్క మాట కూడా అనలేదు. రాహుల్‌ ‌గాంధీ తనకు అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్‌ను విశ్వసించారు. ఆయన తన నాయకుని మాదిరిగా శివసేనతో పొత్తును వ్యతిరేకించారు. అయితే, పార్టీ నుంచి భారీ ఎత్తున ఫిరాయింపులు జరుగుతాయేమోననీ, బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడం కోసమని సోనియాగాంధీకి నచ్చజెప్పగా, ఆమె శివసేనతో జత కట్టేందుకు సరేనన్నారు. ఫలితం ఎలా ఉన్నప్పటికీ, శరద్‌ ‌పవార్‌ ‌కుటుంబంలో చీలిక నిజమైనా, కాకపోయినా, రాహుల్‌ ‌గాంధీ నైతిక విజయం తనదేనని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడే విజేత. ముఖ్యమంత్రి పదవి బీజేపీకి చెందిన ఫడ్నవీస్‌కి దక్కిందా, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ‌థాకరేకి దక్కిందా అనేది వేరే విషయం.
ఫడ్నవీస్‌ అసెంబ్లీలో తన మెజారిటీని రుజువు చేసుకుంటే కాంగ్రెస్‌ ‌సీనియర్లు రాహుల్‌ ‌గాంధీ సహాయకుల నుంచి తీవ్ర స్థాయిలో దాడులకు గురవుతారు. శివసేనతో జతకట్టేందుకు అంగీకరించి మన లౌకక వాదాన్ని ఏ విధంగా దెబ్బతీద్దామనుకున్నారని రాహుల్‌ ‌మనుషులు దాడి చేసే అవకాశం ఉంది. రాహుల్‌ ‌గాంధీ లౌకిక వాదం ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన గుడులు, గోపురాలు సందర్శిస్తారు. కైలాస్‌ ‌మానస సరోవర్‌ ‌యాత్రకు వెళ్తారు. ముమ్మారు తలాక్‌ ‌రద్దుకు ప్రతిన చేస్తారు. అదే సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌పై పరువు నష్టం వ్యాఖ్యలు చేస్తారు. అయోధ్యపై సుప్రీమ్‌కోర్టు తీర్పును మాత్రం స్వాగతించరు. రాహుల్‌ ‌గాంధీ సెక్యులర్‌ ఇమేజ్‌ని ద్బ్బెతీసేందుకు ఎందుకు ప్రయత్నించలేదో చెప్పరు. అందువల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఓటమి పార్టీ మాజీ అధ్యక్షుని విజయంగా పరిగణించవచ్చు. 2019 లోక్‌ ‌సభ ఎన్నికల్లో ఈ సీనియర్లే పార్టీ ఓటమికి కారణమని ఆయన అంటారు. మహారాష్ట్రలో శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్‌ ‌కూటమి ప్రభుత్వం ఏర్పాటు యత్నాలను బీజేపీ భగ్నం చేసిన తర్వాత ఏమంటారంటే ఏమైంది ఇప్పుడు..రాహుల్‌ ‌గాంధీ గెలిచారు కదా అని. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు ఆయన విధానాలకు మచ్చుతునక అని అంటారు. ఈ పరిణామాలు చూస్తుంటే బ్రిటిష్‌ ‌రచయిత శామ్యూల్‌ ‌జాన్సన్‌ ‌కవిత గుర్తుకు వస్తోంది. ఈ వైవిధ్యభరితమైన ఆలోచనలు హింసతో కలిసి ప్రకృతి కళ పోలికలతో, ఊహలతో దెబ్బతింటాయని ఆయన అంటారు.
గాంధీ విజయానికి బిజెపి ఎందుకు అసూయ పడటం లేదు!
వోటరు 18వ శతాబ్దం నాటి రచయిత, విమర్శకుడు జాన్సన్‌ ‌సిద్ధాంతం మాదిరిగా సంతోష పడకపోవచ్చు కానీ, ప్రతిపక్ష శిబిరంలో ఎక్కువ మందిని బిజేపీ ఆకట్టుకోగలిగింది. క్రీయా శీల రాజకీయవేత్తగా రాహుల్‌ అప్పుడప్పుడు అతిథిగా మాత్రమే తెరమీద కనిపిస్తుంటారని ఇప్పటికే రుజువైంది. సిద్ధాంత పరంగా ఆయన గందరగోళ స్థితిలో ఉన్నారు. అయోధ్యపై సుప్రీమ్‌కోర్టు ఇచ్చిన తీర్పునకు బీజేపీ శ్రేణులు పండుగ చేసుకున్నాయి. సమాజ్‌ ‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌కోర్టు నిర్ణయాలు దూరాలు తగ్గిస్తే మనుషులకు మేలు చేస్తాయంటూ వ్యాఖ్యానించారు. పరోక్షంగా తీర్పును అంగీకరించమని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రీయ జనతాదళ్‌ ‌పార్టీ నాయకుడు తేజస్వి యాదవన్‌ ‌సుప్రీమ్‌కోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్నారు. దేశంలో ప్రతి గుడి, మసీదు, చర్చి మనవే అని ఆయన అన్నారు. రాహుల్‌ ‌గాంధీ మాదిరిగా యాదవ్‌లు ఇద్దరు ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌లలో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారని చాలా మంది అనుకున్నారు. ఈరోజుల్లో రాజకీయవేత్తల్లో చాలా మంది ట్విట్టర్‌ ‌ద్వారా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మాయావతి, సీతారామ్‌ ‌యేచూరి, హేమంత్‌ ‌సొరేన్‌ ‌మొదలైనవారంతా. బీజేపీ దేశ మంతటా ప్రాబల్యం కలిగి ఉన్నా పశ్చిమ బెంగాల్‌ ‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా వీధి పోరాటాలు జరుపుతోంది. ప్రతిపక్ష నాయకుల్లో మమతా బెనర్జీ బీజేపీకి చమటలు పట్టిస్తోంది. అయోధ్యపై ఆమె మౌనం, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీపై మాటల దాడి చూస్తుంటే హిందువులు ఆగ్రహించకుండా ముస్లిం వోటు బ్యాంకు కాపాడుకోవాలన్నది ఆమె అభిమతంగా కనిపిస్తోంది. అయోధ్య, 370 అధికరణం రద్దు, నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజెన్స్ ‌మొదలైన అంశాల్లో ప్రతిపక్షాలు బీజేపీని విమర్శిస్తున్నట్టు కనిపిస్తున్నాయన్నట్టు విమర్శిస్తున్నాయి. మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కనీసం స్పందించనైనా లేదు. బీజేపీ నాయకులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. వారు జార్ఖండ్‌ ఎన్నికలపై దృష్టి సారించారు.

– ‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy