Take a fresh look at your lifestyle.

మహరాష్ట్రలో మావోయిస్టుల ఘాతుకం 15 మంది జవాన్లు మృతి

బోలోరో వాహనం పేల్చివేత – వాహన డ్రైవర్‌ ‌కూడాదుర్మరణంమే1న మహరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులపై పంజా విసిరారు. మాహరాష్ట్రలో గచ్చిబౌలి పోలీసులు ప్రయాణిస్తున్న బోలోరో వాహనాన్ని ఐఇడి బాంబులతో పేల్చారు. వాహనం ఒక్కసారిగా పేలుడు తాకిడికి వాహనం ఆకాశంలోక ఎగిరి క్షణంలో తునాతునాకలైంది. వాహనం శకలాలను చూస్తే తెలుస్తుంది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. మహరాష్ట్రంలోని గడ్చి రోలి జమూర్‌ఖేడా సమీపంలో బుధవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది కమాండంట్‌లు ప్రయాణిస్తున్నారని సమాచారం. ఘటన స్థలానికి మావోయిస్టులు తిప్పి కొట్టేందుకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. చాలా సేపటి వరకు మందుపాతర పేల్చిన ప్రాంతంలో పోలీసులు నక్సల్స్ ‌మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం. మందు పాతర పేల్చిన ప్రాంతంలో 200 మంది మావోయిస్టులు ఉన్నారని పోలీసు వర్గాలు భావిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని భద్రత దళాలు జల్లెడబడుతున్నారు. మరోవైపు మంగళవారం రాత్రి గడ్చిరోలి లో జిల్లాలోని పురాడాలో రోడ్డు నిర్మాణాలు జరుగుతున్న ప్రతంలో 36 వాహనాలు వీటి విలవ సుమారు 10 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా ఈ వాహనాలు కాంట్రాక్టర్లకు చెందివిగా గుర్తించారు. ఖమ్మంకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌కు చెందిన వాహనాలు ఉన్నట్లు అనుమానిస్న్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు బహిష్కరించాలని కోరుతూ ఇటువంటి సంఘటనలకు పాల్పడినట్లు ఎతెలుస్తుంది. ఎన్నికల నేపధ్యంలో భద్రత బలగాలు ఆ ప్రాంతాన్ని వారి ఆదీనంలో తీసుకున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా మందు పాతర పేల్చి 16 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈప్రాంతానికి మహరాష్ట్ర కమాండంట్‌ ‌కూడిన క్విక్‌ ‌రెస్సాన్స్స్ ‌టీం ప్రైవేటు బొలోరో వాహనంలో ఈ ప్రాంతానికి వెళ్తుండగా మావోలు పక్కా సమాచాంతో ముందస్తు ప్రణాళిక తో పోలీసులు ప్రయాణిస్తున్న బోలోఓ వాహనానిన్న పేల్చివేనసట్లు తెలుస్తుంది. . బుధవారం నాడు మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. గడ్చిరోలిలో భద్రత సిబ్బంది మావోలు పొట్టన బెట్టుకోవడాన్ని ప్రధాని ట్విట్టర్‌ ‌ఖాతాలో మోదీ తీవ్రంగా ఖండించారు. అమరుల త్యాగాలను దేశం మర్చిపోదన్నారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానూబూతి తెలిపారు. ఈ దారునానికి పాల్పిడిన వారిన వదబోమన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy