Take a fresh look at your lifestyle.

మళ్లీ పెరిగిన గ్యాస్‌ ‌ధరలు

మధ్యతరగతి ప్రజలకు షాక్‌ల ద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు అల్లాడిస్తూ ఉండగా..తాజాగా వంట గ్యాస్‌ ‌ధరలు మరోసారి పెరిగాయి. ఎల్‌పీజీ సిలిండర్‌ ‌కొత్తగా పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. సిలిండర్‌ ‌ధర ఏకంగా రూ.76 మేర పెరిగింది. అక్టోబర్‌ ‌నెలలో ఎల్‌పీజీ సిలిండర్‌ ‌ధరలు రూ.15 మేర పెరిగింది. సెప్టెంబర్‌ ‌నెలలో రూ.15.5 పైకి కదిలింది. ఎల్‌పీజీ గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ప్రతి నెలా ఒకటో తారీఖున పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ ఏడాది సిలిండర్‌ ‌ధరలు పెరగడం ఇది వరుసగా మూడో సారి. గ్యాస్‌ ‌కంపెనీలు ప్రతి నెలా ఎల్‌పీజీ సిలిండర్‌ ‌రేట్లను సక్షిస్తూ ఉంటాయి. సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ రేట్లు, అమెరికా డాలర్‌-ఇం‌డియన్‌ ‌రూపాయి మారకపు విలువ వంటి అంశాలు ప్రాతిపదికన ధరను మారుస్తూ ఉంటాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy