Take a fresh look at your lifestyle.

మళ్లీ టిఆర్ఎస్ ను ఆశీర్వదించండి రోడ్ షోలలో ఎంపీ కవిత

టిఆర్ఎఎస్ పార్టీని మళ్లీ ఆశీర్వదించండి ..కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి అని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మనం కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని అన్నారు. బుధవారం బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో కవిత పాల్గొన్నారు. ఈ బోధన్ నియోజకవర్గం తేడా పల్లి మండలం జానకంపేట్ రెంజల్ మండలం దూపల్లి, రెంజల్, నీల, బోర్గాం , బోధన్ మండలం పంటాఖుర్దు లలో, ఆర్మూర్ నియోజకవర్గం లో మాక్లూర్, ఆంధ్ర నగర్, నందిపేట్ లలో జరిగిన రోడ్ షోలలో ఎంపీ కవిత పాల్గొని ప్రసంగించారు. పనిచేసే పార్టీకి ఓటేయాలని కోరారు. 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం సమర్థతకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ టీడీపీలు చేయలేని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారన్నారు. టిఆర్ఎస్ రైతుల పక్షపాతి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వంటి పథకాలు ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేసిన విషయం మీకు తెలుసు అన్నారు. కెసిఆర్ కిట్టు ద్వారా గర్భిణీలకు ప్రసవం అయ్యేంత వరకు ప్రభుత్వమే బాబు చూసుకుంటుందని అమ్మాయి పుడితే 13000 అబ్బాయి కొడితే 12000 ప్రభుత్వం వాహనంలో ఇంటి దగ్గర దింపుతున్నారని గత ప్రభుత్వాలు ఈనాడు ఈ ఆలోచన చేయలేదన్నారు ఎంపీ కవిత. సెక్యులర్ వ్యక్తి కి పాలనా బాధ్యతలు ఇస్తే సమాజం ఏ విధంగా బాగుపడుతుంది మీకు అందరికీ తెలుసునన్నారు.ప్రజా కూటమి పేరు తో మీ ముందుకు వచ్చే నాయకులు మన వాళ్లే కానీ నడిపే వాడు మాత్రం చంద్రబాబు అని అన్నారు.ఆంధ్రా కోసం ప్రాజెక్టులను ఆపే చంద్రబాబు అవసరం తెలంగాణకు ఉందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఎంపీ కవిత కోరారు. రోడ్ షో ప్రారంభానికి ముందు ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం దయ చూపాలని లక్ష్మీ నరసింహ స్వామిని మొక్కుకుని రూపాయి నాణాన్ని నిలబెట్టారు. జానకంపేట లో రోడ్ షో లో ప్రజలకు ఈ విషయాన్ని చెబుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్రం సిద్ధించాలని మొక్కుకొని రూపాయి నాణాన్ని నిలబెట్టానని చెప్పారు. సెటిలర్ అనే పదాన్ని వాడవద్దని ప్రజలను కోరారు.ఎక్కడి నుంచి వచ్చిన వారంతా మనతో కలిసి జీవనం సాగిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. రోడ్ షోలలో బోధన్ టిఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ఆమిర్, ఆర్మూరు అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి, రెండు నియోజక వర్గాల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy