Take a fresh look at your lifestyle.

మల్లన్నపై పీడీ యాక్ట్ ‌పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు

మల్లన్న విడుదలకై నేడు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ ‌టేబుల్‌
‌ప్రజల గొంతుక బలంగా ఉందని చాటెందుకు కలిసి రావాలి
మల్లన్న లక్ష వోట్లు తెచ్చుకున్న నాయకుడని ప్రభుత్వం గుర్తించాలి
:తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌

‌ముషీరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 07 (‌ప్రజాతంత్ర విలేఖరి) : తీన్మార్‌ ‌మల్లన్న విడుదలకై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం బుధవారం ఉదయం. 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌-‌హైదరామాద్‌ ‌లో నిర్వహించబోతున్నట్లు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తీన్మార్‌ ‌మల్లన్నను కేసిఆర్‌ ‌ప్రభుత్వం అనేక కేసులు పెట్టి అరెస్టు చేసిందన్నారు. లక్ష్మికాంతశర్మ అనే జ్యోతిష్యుడు మల్లన్న బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడేంత వొత్తిడి తెచ్చారని 306-5/11 ఇంకా వివిధసెక్షన్లతో అరెస్టు చేయడంతో పాటు, హైదరాబాద్‌లో అన్ని పార్టీ రాజకీయంగా వాడుకొని వదిలేసిన, సాదారణ జీవితం గడుపుతున్న అంబర్‌పేట శంకర్‌ ‌కూడా ఇరికించి, చివరకు పిడి యాక్ట్‌కు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తున్నదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేకులకు రాజకీయాల్ని ఎండగట్టి, తెలంగాణ రాష్ట్ర ఆవతరణ తరువాత కేసిఆర్‌ ‌బంగారు తెలంగాణ బాగోతాన్ని బయటపెడుతూ, ఆయన మంత్రివర్గ సభ్యులు, ప్రజాప్రతినిధుల భూ ఖబ్జాలు బయట పెడుతున్నందున కక్షగట్టి లక్ష్మికాంతశర్మను బెదిరించారనే నేపంతో ఉచ్చు బిగిస్తున్నారన్నారు. అక్రమ నిర్భందలో ఒక కుటుంబం ఎంత కష్టాల్లో ఉంటుందో పలు నిర్భందాలు, పిడి యాక్ట్ ‌చవిచూసిన స్వీయానుభవం తనకు ఉందన్నారు. తీన్మార్‌ ‌మల్లన్న వ్యవహార శైలిని ముందుకు తోస్తు కొన్ని పార్టీలు, సంస్థలు, జర్నలిస్టులు మౌనంగా ఉండడం నిరంకుశ పాలకులకు మరింత దన్నును చేకూర్చుతుందన్నారు. బ్లాక్‌ ‌మెయిల్‌  ‌పాల్పడుతున్నారనే ప్రచారం ద్వారా ఖబ్జాలను, బెదిరింపులను మీడియాలో ఎత్తి చూపే అందరు జర్నలిస్టులపై భవిష్యత్తులో ఈ నిర్భందం, కేసులు కొనసాగవచ్చన్నారు. కేసిఆర్‌ను విమర్శిస్తూ మోడీని మల్లన్న వ్యతిరేకించడం లేదన్న సాకు, మరో విధంగా చాలా మందికి వర్తిస్తుందన్నారు. గురిగింజ క్రింద నలుపు తీరు ఎన్నో అవలక్షణాలతో అన్ని వ్యవస్థలు ఉన్నాయన్నారు. మల్లన్న పోయిన ఎంఎల్సి ఎన్నికల్లో కేసిఆర్‌ అభ్యర్ధికి చుక్కలు చూపించి లక్ష ఓట్లు తెచ్చుకున్న నాయకుడన్నది గుర్తించాలన్నారు. పౌర స్వేచ్చ, హక్కులు, భాద్యతలు, పత్రికలు, పాలకుల తీరు తెన్నులపై తీన్మార్‌ ‌మల్లన్న విడుదలను డిమాండ్‌ ‌చేస్తూ, అక్రమ కేసులు ఎత్తి వేయాలని అడుగుతూ ఈ రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో చర్చించవచ్చన్నారు. ప్రజల గొంతుక ఐక్యంగా, బలంగా ఉందని చాటెందుకు అందరూ కలిసి రావాలన్నారు.

Leave a Reply