వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మన లక్ష్యం లక్ష మెజారిటీ

April 10, 2019

లోక్‌సభ ఎన్నికలల్లో పోలింగ్‌ ‌శాతం పెంచే దిశగా పనిచేయాలని నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ప్రజాప్రతినిధులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు మంగళవారం ఫోన్‌ ‌ద్వారా దిశానిర్దేశం చేశారు.. లక్ష మెజార్టీ తెచ్చేందుకు, మన లక్ష్యం చేరేందుకు అందరు సైనికుల్లా పని చేయాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే పని చేసి పోలింగ్‌ ‌శాతం పెంచి లక్ష మెజారిటీ దాటించారో అదే స్ఫూర్తితో ఈ రెండు రోజులు కష్టపడి పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. బూత్‌ ‌కమిటీలు, 100 ఓటర్ల ఇంచార్జ్ ‌పోలింగ్‌ ‌మొదలైనప్పటి నుండి చివరి నిమిషం వరకు అక్కడే ఉండి పోలింగ్‌ ‌శాతం పెంచాలని సూచించారు. పట్టణ, మండల సీనియర్‌ ‌నాయకులు. రూట్‌ ఇం‌చార్జ్‌లు చొరవ చూపాలని చెప్పారు. మన లక్ష్యం లక్ష మెజారిటీ..ముమ్మర ప్రచారం చేసి ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డికి మన సిద్దిపేట నుండి లక్ష మెజారిటీ దాటెల పని చేయాలని కోరారు.