వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మద్యం అమ్మకాలను తగ్గించాలి

December 7, 2019

మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి – పోలీసులను ప్రజల భద్రతకోసం వినియోగించాలి
గవర్నర్‌ ‌తమిళసైని కలిసిన కాంగ్రెస్‌ ‌ముఖ్యనేతలు – తెరాస ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, మద్యాన్ని ప్రభుత్వం ఏరులై పారిస్తుందని, ఫలితంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు శనివారం ఉదయం గవర్నర్‌ ‌తమిళసైని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు.. ఎక్కడ చూసినా హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దాడులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలు, గ్రామాల్లో బెల్టు షాపులు తొలగించాలని కోరుతూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేరాలు, మహిళలపై దాడులకు నియంత్రించాలని డిమాండ్‌ ‌చేశారు. మద్యం అమ్మకాలను తగ్గించాలని, పోలీసులను ప్రజల భద్రత కోసం వినియోగించాలి. కానీ, పోలీస్‌ ‌యంత్రాంగాన్ని తెరాస నేతల కోసమే వినియోగిస్తున్నారని భట్టి విమర్శించారు. దిశ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భట్టి విక్రమార్క అన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్‌ ‌నేతలు శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డి, సీతక్క,జగ్గారెడ్డి, షబ్బీర్‌ అలీ, నేరెళ్ల శారద, ఇందిరా శోభన్‌ ‌తదితరులు ఉన్నారు.కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతల అలక..
కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య అలకబూనారు. శనివారం రాజ్‌భవన్‌కు వచ్చారు. కాంగ్రెస్‌ ఇచ్చిన జాబితాలో తమ పేర్లు లేవని ఇద్దరు నేతలు రాజ్‌భవన్‌ ‌నుంచి వెళ్లిపోయారు. బీసీలకు కాంగ్రెస్‌లో అవమానం జరుగుతోందని వీహెచ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఇది తమకు అవమానమని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్‌ ‌చేస్తేనే వచ్చామని.. కానీ జాబితాలో తమ పేరు లేదని వీహెచ్‌ అన్నారు. బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని, పార్టీలో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తే పార్టీ ఇక ఎప్పటికి బాగుపడే పరిస్థి ఉండదన్నారు. అన్ని వర్గాల నేతలను కలుపుకొని పోవాలని ఈ సందర్భంగా వారు నేతలకు సూచించారు.