వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మజ్లిస్‌ ‌చేతిలో కారు కీస్‌

April 1, 2019

అభివృద్ది పట్ల చిత్తశుద్ది లేని కెసిఆర్‌ – ‌హైదరాబాద్‌ ‌సభలో ప్రధాని మోడీ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కుటుంబ అభివృద్ధి తప్ప రాష్ట్రాభివృద్ధి వారికి పట్టదని.. మూసీకి ఒకవైపు మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని మండిపడ్డారు. కారు తెరాసదే అయినా.. స్టీరింగ్‌ ‌మాత్రం మజ్లిస్‌ ‌చేతుల్లోనే ఉందని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌,ఎంఐం‌లపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో తాము కొత్తగా ఎలాంటి పన్నుల భారం వేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. ప్రజల అభివృద్ధి గురించి మజ్లిస్‌ ‌పట్టించుకోదని, పాతబస్తీలో మెట్రో లైను వేస్తామంటే వారు అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. మజ్లిస్‌తో సావాసం వల్ల తెరాస కూడా పాతబస్తీ ప్రజల్ని పట్టించుకోవడంలేదన్నారు. ఏప్రిల్‌ 11‌న టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇవ్వాలి అని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. తన వెంట నడుస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ’అభివృద్ధిలో బాటలో ఎంఐఎం స్పీడ్‌ ‌బ్రేకర్‌గా మారింది. పాతబస్తీలో మెట్రో వేస్తామంటే మజ్లిస్‌ అడ్డుకుంది. ఎంఐఎంకు అభివృద్ధి అంటేనే నచ్చదు. మజ్లిస్‌కు రాత్రి కూడా మోదీనే గుర్తొస్తారు. ఎంఐఎం లాంటి వాళ్లు ఉండడం వల్ల టీఆర్‌ఎస్‌ ‌కారు.. పనికిరాని కారుగా మారుతుంది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్లు వీళ్లయిపోతారంట. కేసీఆర్‌ ‌కారు స్టీరింగ్‌ ‌మజ్లిస్‌ ‌చేతిలో ఉంది. మజ్లిస్‌తో దోస్తీ టీఆర్‌ఎస్‌ ‌కారును పంక్చర్‌ ‌చేస్తుంది. ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌బిల్లును ధైర్యంగా తీసుకొచ్చాం’ అని మోదీ వ్యాఖ్యానించారు. మా పాలనలో బాంబు పేలుళ్లు జరగడం లేదు.