Take a fresh look at your lifestyle.

మండిపోతున్న నిత్యావసరాలు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం

దేశంలో పప్పు దినుసులతోపాటు కూరగాయ ధరలు మండిపోతున్నాయి. రిటైల్‌ ‌ద్రవ్యోల్భణం గత అక్టోబర్‌ ‌నెలలో 4.62 శాతానికి చేరుకొని 16 నెలల్లో గరిష్ట స్థాయి రికార్డును నెలకొల్పింది. మరోపక్క నేరాలు ఘోరంగా పెరుగుతున్నాయి. అయినా దేశంలో విమానాశ్రయాలు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగుందనడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏమి కావాలి?’ మన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అం‌గడీ శుక్రవారం సవాల్‌ ‌చేశారు. రిజర్వ్ ‌బ్యాంక్‌ అం‌చనాల ప్రకారం ద్రవ్యోల్పణం ఎప్పుడూ నాలుగు శాతం లోపలే ఉండాలి. దాన్ని దాటిందంటే దేశంలో ఆర్థిక మాంద్యపు ప్రమాద ఘంటికలు మోగినట్లే. దేశంలో కూరగాయలు ఒక్క నెలలోనే 26.1 శాతం పెరగ్గా, పప్పు దినుసులు 11.72 శాతం పెరిగాయి.
ఈ నెలలో ఢిల్లీలో కిలో ఉల్లి గడ్డలు 80 రూపాయలకు చేరుకోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ సంబంధిత అధికారులను ఆదేశించడం తెల్సిందే. గత నెలలో కిలో 55 రూపాయలుండగా, ఒక్క నెలలోనే పాతిక రూపాయలు పెరిగింది. మరో రెండు, మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ’కేర్‌ ‌రేటింగ్స్’ ‌హెచ్చరించింది. వచ్చే ఏడాది మార్చి తైమ్రాసికానికి రిటేల్‌ ‌ద్రవ్యోల్భణాన్ని నాలుగు శాతం లోపలికి తీసుకరాకపోతే ముప్పని తెలిపింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy