Take a fresh look at your lifestyle.

మంజీరా డ్యామ్‌ ‌పర్యటనకు వెళ్తే…

మంజీరా డ్యామ్‌ ‌పర్యటనకు వెళ్తే ప్రభుత్వ వైఫల్యాలు, అన్యాయాలు ప్రజలకు తెలుస్తాయన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ ‌నేతలను ఎక్కడికక్కడ గృహానిర్బంధాలు చేసినట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ మెదక్‌ ‌పార్లమెంటు ఇంఛార్జి గాలి అనిల్‌ ‌కుమార్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా మంజీర డ్యామ్‌ ‌సందర్శించడానికి వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ ‌పార్టీ మెదక్‌ ‌పార్లమెంట్‌ ఇం‌చార్జి గాలి అనిల్‌ ‌కుమార్‌ను ముందస్తుగా అమీన్‌పూర్‌ ‌పోలీసులు ముందస్తుగా హౌస్‌ అరెస్ట్ ‌చేశారు.

దీంతో గాలి అనిల్‌ ‌కుమార్‌ ఇం‌టిదగ్గర ఉద్రిక్త వాతవరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఈ అక్రమ గృహానిర్బంధాలు, అరెస్టులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నియంత పాలనలకు నిదర్శనం అని తెలిపారు. ఉన్న ప్రాజెక్టులు ఎండబెట్టి కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు చేసి అప్పుల తెలంగాణగా చేస్తున్నారని ఆరోపించారు. సీఎం ఇలానే చేస్తే మరోసారి ఉద్యమం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మన్నే రవీందర్‌, ‌గాలి వెంకట రాజు, లోక్‌, ‌మల్లేష్‌, ‌వెంకటేష్‌, ‌సాయి, నవీన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply