వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భూమిపుత్రికలకు అమెరికా వీసా..!

September 16, 2019

 

డెక్కన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సొసైటీ, జహీరాబాద్‌కు చెందిన భూమి పుత్రికలు అమెరికా వెళ్లేందుకు వీసా సాధించడంలో విజయం సాధించారు.
వారిని పాస్‌పోర్టు సబ్మిట్‌  ‌చేయమని అమెరికన్‌ ‌కాన్సలేట్‌ ‌శుక్రవారం సాయంత్రం కోరింది.  సోమవారం వారికి పది సంవత్సరాల వీసా మంజూరు చేసింది. ‘భూమి పుత్రికలకు వీసా ‘గ్రహణం’ శీర్షికన ‘ప్రజాతంత్ర’ సెప్టెంబర్‌ 13‌న వార్త ప్రచురితమైంది. మీడియాలో వచ్చిన వార్తాకథనాలే వారికి వీసా రావడానికి దోహదం చేశాయని డెక్కన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సోసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.  అంతర్జాతీయ వేదికపై తమ గళం విప్పడానికి దక్కన్‌ ‌డెవలప్‌మెంటు సొసైటీ మహిళ రైతులు సన్నద్దమై వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు.