Take a fresh look at your lifestyle.

భూమికోసం

భూమ్మీద మనిషిని జూత్తే గుబులైతాంది. కడుపుకింత బువ్వ తింటానవా! భూమి తింటానవా! అంటె భూమి తినెటోళ్ళే మనిషి తీరిగ బతుకవట్టె! రోజుకింత బలువబట్టె బువ్వతినెటోళ్ళే బుక్కాఫకీరోళ్ళయి బతుకెళ్ళదీసుకునుడే తిప్పలు కాబట్టె! తాతల కాలం సంది కౌలు జేసుకునే భూమి నిన్నటి దాంక మనదైనా సూత తెల్లారి ఇంకోళ్ళ పాలయితది. కోర్టుల బోతేమున్నది? నడిమంత్రం పుట్టిన కాయితాల మాట్లాడబట్టె! పాణమున్న మనుషుల మాట కన్న కాయితాల లెక్కలే జెల్లబట్టె! పట్టాదారు పాసుబుక్కులు, రిజిష్టర్‌ ‌కాయితాలు పంచాయితీ ఆఫీసు రికార్డులు, తాసీలాఫీసు రికార్డులు ఉన్నాసూత పలానా భూమికి కొత్త కాయితం పుట్టుకత్తది.లోకం తీరుబట్టి యేదైనా మారాలె. ఎన్నేండ్ల సంది చెప్పిందే షెప్పుడు? భూమి దాని సుట్టది తిరుగుతాందంటరు. సరే. సూరుని సుట్టు సూత తిరుగుతాందనంటరు. గివన్ని ఎరికున్న ముచ్చట్లేనాయె! అయ్యా! జర్రంత నమ్ముండ్రి! మనిషి భూమి సూట్టూరంగ తిరుగతాండు.గిదిచ్చంత్రం కాదు సుమా! జరనమ్ముండ్లి, అంటెవలు నమ్మెటట్టే లేదు. మనిషి కడుపు కింత బువ్వ తినుడుకన్నా ఎకురం భూమి తింటె బాగుండనుకుంటాండు. శాతగానోళ్ళు బువ్వ తినిబతుకో తీర్న ఎల్లతీత్తాండ్లు. శాతనైనోళ్ళు తీరొక్క భూమి తిని బతుకుడుకు అలవాటయిండ్లు. శాతనైనంత భూమి తినెటోళ్ళే ఇయ్యాల్రేపు మనిషోలిగె కనబడవట్టిండ్లు. భూమి రుచెట్లుంటది? పుంటికూరలేషిన బోటితీరుగుంటదా? అనడుగితె ‘‘గీ ధిమాక్‌ ‌లేని సవాళ్ళడుగుడు బంద్‌ ‌వెట్టి ఎవలికి శాతనైతె వాళ్ళోపాలి తినిజూడాలె! తినేటోళ్ళకు తిన్నన్ని రుచులు తెలుత్తయి. చెరువు శిఖాలు, సీలింగ్‌ ‌భూములు, సర్కార్‌ ‌భూములు వక్ఫ్ ‌భూములు, అసైండ్‌ ‌భూములు తీరొక్క రుచి తోని కమ్మగుంటయి. గివీటిని తినుడంటె వుట్టి ముచ్చటనా! ఒక్కపాలి రుచి దొరికిందంటె ఇడిషిపెట్టుడుండదు. ‘‘ఆలుబిడ్డలు మాయ! అన్నదమ్ములుమాయ’’ అని వేమన్న బరివాత జెప్పిందే నిజమనిపియ్యబట్టె! సుట్టాలు పక్కాలని సూసుకుంటె ఆకలి తీరేదెట్ల? అసలీ ‘‘మానవీయ సంబంధాలనేటియి’’ కాన్సర్‌ ‌బీమారో సొంటియి. వాటి జోలద్దు, సోపతద్దు.చిన్నోనివా! పెద్దోనివా! వూర్లున్నవా! పట్నంలున్నవా! గివన్ని జూసుకోవద్దు. జేబుల రూపాయి బిళ్ళ లేకున్నామాయె! కంట్లె బడ్డ భూమిని ఎట్లనన్న జేషి తలెలేసుకోని. తినుడంతమజా ఇంకోటిలేదు.’’ అని జెప్తాంటె ఏం కాలమిది? అనిపిచ్చె!
భూమ్మీద మనిషిని జూత్తే గుబులైతాంది. కడుపుకింత బువ్వ తింటానవా! భూమి తింటానవా! అంటె భూమి తినెటోళ్ళే మనిషి తీరిగ బతుకవట్టె! రోజుకింత బలువబట్టె బువ్వతినెటోళ్ళే బుక్కాఫకీరోళ్ళయి బతుకెళ్ళదీసుకునుడే తిప్పలు కాబట్టె! తాతల కాలం సంది కౌలు జేసుకునే భూమి నిన్నటి దాంక మనదైనా సూత తెల్లారి ఇంకోళ్ళ పాలయితది. కోర్టుల బోతేమున్నది? నడిమంత్రం పుట్టిన కాయితాల మాట్లాడబట్టె! పాణమున్న మనుషుల మాట కన్న కాయితాల లెక్కలే జెల్లబట్టె! పట్టాదారు పాసుబుక్కులు, రిజిష్టర్‌ ‌కాయితాలు పంచాయితీ ఆఫీసు రికార్డులు, తాసీలాఫీసు రికార్డులు ఉన్నాసూత పలానా భూమికి కొత్త కాయితం పుట్టుకత్తది. కొత్తయాజమాని సూత బుట్టి బారసాలయితది.
ఖాళీ జాగలు, యవుసం భూములు పారడైజ్‌ ‌బిరియాన్లెక్క ఘుమఘుమలాడుతాయి. మాంచి భూములను జూడంగనె ‘‘బోంబే టు గోవా’’ సిన్మాల అంగేసుకోని లబ్బపోరన్లెక్క ‘‘అబ్బా! పకోడా!’’అని మీద పడి దున్కబుద్దయితది.అవుటర్రింగుల భూముల కతయితె చెప్పెటట్టున్నదా! పాణం పొయి
నాసరె! భూమిడిషిపెట్టె ముచ్చటేలేదు! అనేకాడున్నది. అవుటర్రింగ్‌ ‌పుట్టిన కాన్నించి దాని సుట్టుపక్కల యవుసం భూములెంత పిరమైనయో! వాటి సంగతర్సుకునేటందుకు చోటామోటాలీడర్ల నుంచి పెద్ద పెద్దోళ్ళ దాంక ఎవలుబడితె వాళ్ళు దున్కబట్టె! పాతసందుగల కాయితాల మీద కొత్తచ్చరాలు పుట్టిచ్చుకచ్చిన యవారాలు ఎంతమంది పాణంమీదికి తెచ్చిందో లెక్కేలేదు.
కౌలుదారి చట్టం పోడుచట్టం, ఆ చట్టం, ఈ చట్టం అని గిన్ని చట్టాలున్నయంటరు. దొర మాటే ఇప్పుడు చట్టమై మున్పటి చట్టాలన్ని సట్టుబండలయినయి. భూముల లెక్కలు యెందుగ్గిట్ల తిర్లమర్లయితానట్టు? మునుపు వేల కొద్ది ఎకురాల భూముల్ని దోసుకున్న దొరలంత వూర్లిడిషి పాణాలు బట్టుకోని దేశాలు బోయెటట్టు తెలంగాణ పల్లెపల్లెన మర్లవడ్డ బుడ్డగోషి బక్క రైతన్నల త్యాగం ఏమైనట్టు? ‘‘ఊర్లె తాతల కాలంనుంచి దున్నుకుంటున్న అస్సైన్డ్ ‌భూములలొల్లి మొదలయింది. ఏడినుంచి వచ్చిండ్లో గని ఎవలో దొర వూర్లె భూముల లెక్క పత్రాలన్ని మారినయని జెప్పి కొత్త పాస్‌ ‌బుక్‌ ‌తెచ్చుకున్నడంట! కాస్త పహానీ కాయితం తోని సాచ్చం కూడ మాగనే వున్నదనబట్టె! రొండు మూడు సర్వే నెంబర్లల్ల నలభైయాభై మంది రైతుల భూములాగమాయె! ఇదేందుల్లా! సాదాబైనామాలప్పుడే మస్తుమంది రైతులను ఆగం జేషిండ్లు. గా లోల్లే ఇంకా కోర్టులున్నది. మళ్ళాగీ కొత్త ఆగమేంది? మేం జేసుకునే భూములు మాయి గాకుంట ఎట్ల బోతయి? అని అడుగుతె కార్యదర్శి నుంచి తాసిల్దార్‌ ‌దాంక నోరిప్పరాయె! వకీల్‌ ‌కాడికి బోతె వట్టిముచ్చటేనాయె! ‘‘పాసుబుక్కుండె!పహానీ కాయితముండె! రైతుబంధు పైసలు సూత వచ్చి బ్యాంకుల పడ్డంక కోర్టు ఆ భూమికి యజమాని ఎవలని జెపుతది’’? అని వకీల్‌ ‌సాబే వుల్టా అడుగబట్టె’’! వూరి పెద్ద సాయన్న గోస గిట్లుండె!
మియాపూర్‌ ‌భూములు ఆగం జేషినప్పుడు రిజిష్టర్‌ ఆఫీసుల అధికార్ల పనితీరు సరింగ లేదని, వీళ్ళ కన్న తహసిల్దార్లు బాగ నీయత్‌ ‌గుంటరని, మెచ్చుకున్నది సర్కారేనాయె! కొత్తగ భూముల చట్టం మార్చి అనుభవదారులకు, కౌలుదారుల సంగతి లేకుంట జేషి లచ్చల ఎకురాలు పాత దొరల పాలు జేషింది సర్కారేనాయె! ఓ సర్కారే తన సర్కార్ల రెవెన్యూ శాఖ మొత్తం అవినీతి పాలయిందనె! విఆర్వోల నుంచి తాసిల్దార్లు పైనున్న.అధికార్లంత అవినీతి పెర్గిందని సర్కారే నాయె! తన కింద పన్జేషే అధికారులూ, ఓ శాఖ మొత్తమే అవినీతిదైతె సర్కార్‌ ‌బాధ్యత వహించదా! భూ యాజమాన్యం హక్కుల ప్రక్షాలన పేరుమీద చేషిన చట్టం అసలు గుట్టేందో రేపోమాపో జనానికి తెల్వకుంట వుంటదా! దీని లోపాలు.లోతుపాతులు తెలిషిన రెవెన్యూ శాఖ మీద సర్కారే దుమ్మూ మన్నూ పోషి, తిట్టి, సాపిచ్చినంక జనం ఇంక యేమేం పోయాలె?
కొత్త చట్టం కాయితాలల్లుండె! అర్జీలెన్నత్తె మాత్రం అధికారులు జేషేదేమున్నది! జనాన్ని అధికారుల మీదికి ఎగేషే సర్కార్‌ ‌చట్టం ఫలితాలెంత తీవ్రంగ వుంటాయనేది జెప్పాలంటె తహసిల్దార్‌ ‌విజయమ్మ దారుణ హత్యనే జూపాలె! జనం ఆలోచనల మీద సర్కార్‌ ‌ప్రభావం యెంతున్నదంటె తాసిల్దార్‌ ‌విజయమ్మ హత్య పైన జనం ‘‘మంచిగైంది’’ గిట్నే కావాలె! అని అనుకుంటాండ్లంటె మనిషి, మనిషి పుట్క నుంచి దూరమైపోతాండని పిత్తాంది. రైతు నుంచి భూమిని వేరు జేత్తె, పురిట్లనే తల్లినుంచి పిల్లను వేరు జేషినట్టుంటది.
సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్
‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా! తాసిల్దార్‌ ‌విజయమ్మ హత్యకు కారణం ఎవలనుకుంటానవు? జనం భూమి సుట్టు తిరుగుడెనుక కత యేంది కావచ్చు’’? ‘‘ఈ ప్రశ్నలకు జవాబులు జెప్పకుంటె నీ తలకాయ వేయి వక్కలైతది’’ అని చందమామ కతోలిగె అడిగిన భేతాళుడి ప్రశ్నలెనుక అంతరంగం అర్ధమై ఇక్రమార్కుడు జవాబులు గిట్ల జెప్పబట్టిండు. ‘‘చాట్ల తవుడు వోషి కుక్కల కొట్లాట పెట్టిచ్చిండ్లని’’ అంటరు గద గట్లనే సర్కార్‌ ‌చేషిన భూరికార్డుల ప్రక్షాలన ఫలితమే తాసిల్దార్‌ ‌విజయమ్మ హత్య అనుకోకతప్పదు. సర్కార్‌ ‌చేతిల రిమోటు భూముల ధరను ఏమైన జేత్తది. భూమి ధర పెంచుడు, దించుడే కాదు.
భూమిని ఉన్న పళంగ మాయంజేత్తది సూత! గీ మోసం తెల్వక జనం భూమి సుట్టు తిరుగబట్టిండ్లు.’’ అని మనుసులనుకుంట ఆలోచించుకుంట భేతాళుని శవాన్ని భుజానేసుకోని ఇక్రమార్కుడు ఎప్పటిలాగనే…నడ్వబట్టిండు….నడ్వబట్టిండు.
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!