Take a fresh look at your lifestyle.

భిన్నత్వంలో ఏకత్వం ..రైతు ఉద్యమం ..!

“బికెయు (ఉగ్రహాన్‌) ‌నాయకత్వం డిసెంబర్‌ 10‌న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం జైలులో ఉన్న పౌర సమాజ కార్యకర్తలు వరవర రావు,సుధా భరద్వాజ్‌,ఆనంద్‌ ‌తెల్టుంబడే,ఉమర్‌ ‌ఖాలిద్‌ ‌వంటి మేధావులందరినీ విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ తన యూనియన్‌ ‌సభ్యులను ఉద్దేశించి ప్రసంగించింది. తమ మదత్తుదారుల చేతుల్లో ఈ పౌర సమాజ కార్యకర్తల ఫోటోలు ప్రదర్శింప జేసి వీరి విడుదలకి డిమాండ్‌ ‌చేసింది. దీనితో కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్‌ ‌గోయల్‌తో తక్షణం ప్రతిస్పందించి చట్ట వ్యతిరేకులు అయిన వామపక్ష మరియు మావోయిస్టు వాదులు రైతుల ఆందోళనను హైజాక్‌ ‌చేశాయని అన్నారు. ఈ సంఘటన తర్వాత బికెయు (ఉగ్రహాన్‌) ‌యూనియన్‌ ‌ప్రభుత్వ వ్యతిరేకత ను మాత్రమే కాదు.. నిరసనలో ఉన్న ఇతర 31 రైతు సంఘాల నుంచి కూడా వ్యతిరేకతను చవి చూసింది..!”

ఢిల్లీ సింగు బోర్డర్‌, ‌టికిరి బోర్డర్‌ ‌రెండు ఒకటేనా..? ఈ ప్రశ్నకి సమాధానం దొరికితే రైతు ఉద్యమంలో చీలికలు ఉన్నది లేనిది స్పష్టం అవుతుంది. సింగు బోర్డర్‌.. 31 ‌రైతు సంఘాల మద్దత్తు దారులు ఒక్కచోట చేరగా ఏర్పడిన ధర్నా వేదిక. టికిరి బోర్డర్‌ ‌భారతీయ కిషన్‌ ‌యూనియన్‌(ఉ‌గ్రహాన్‌) ‌మద్దతుదారులు ఏర్పరుచుకున్న వేదిక. రెండు యూనియన్లు రైతుల కోసం పనిచేస్తున్నాయి మరి రెండు ఒకటి కాదు ఎందుకు..? చూద్దాం.

31 రైతు సంఘాల తరుపున డాక్టర్‌ ‌దర్శన్‌ ‌పాల్‌ ‌మాట్లాడుతూ చలో ఢిల్లీ కార్యక్రమం కోసం,సంయుక్త  కిసాన్‌ ‌మోర్చా ఏర్పాటు జరిగింది. 31 రైతు యూనియన్లతో  పాటు,అఖిల భారత కిసాన్‌ ‌సంఘర్ష్ ‌సమన్వయ కమిటీ, అనేక ఇతర జాతీయ కిసాన్‌ ‌సంస్థల మద్దతు మాకు వుంది. బికేయు (ఉగ్రహాన్‌) ఈ ఉమ్మడి మోర్చాలో భాగం కాదు, అని  తెలిపారు. సింగు బోర్డర్‌ ‌లో సంయుక్త కిసాన్‌ ‌మోర్చా వేదిక నిరసనకు ప్రధాన కేంద్రంగా ఉండగా అన్ని ప్రసంగాలు, ప్రకటనలు ఇక్కడి నుండి జరుగుతున్నాయి. ఈ వేదికకు కొంచెం దూరంలో భూమిలేని కూలీలు అధిక సభ్యులుగా ఉన్న పంజాబ్‌కు చెందిన మరో రైతు సంస్థ కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌సంఘర్ష్ ‌కమిటీ సొంత వేదిక ఉంది. ఈ కమిటీ 31రైతు సంఘాల యూనియన్ల సమ్మేళనంలో భాగం కాదు అనేది గమనించాల్సిన విషయం. దీఖఖ (రాజేవాల్‌), ‌దీఖఖ (లఖోవాల్‌) ‌వంటి పాతవి, క్రొత్త దీఖఖ(డకూండా) వంటి యూనియన్లు ఇక్కడ ఉన్నాయి.

ఇక టికిరి సరిహద్దు వద్ద భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌) అనేక కిలోమీటర్ల విస్తీర్ణంలో తమ మద్దత్తుదారులను కూర్చోబెట్టి వేదికను ఏర్పాటు చేసింది. భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌) ‌నాయకుడు మాజీ సైనికుడు 75 ఏళ్ల జోగిందర్‌ ‌సింగ్‌. ఇతను బికేయు (ఉగ్రహాన్‌) ‌గురించి ఇలా చెబుతారు. ‘‘భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌) ‌మందను అనుసరించదు. దీనికంటూ ఎజెండా ఉంది. మా పోరాటం రైతు పోరాటం’’ మాల్వా వ్యవసాయ బెల్ట్ అం‌తటా భారీ మద్దత్తు కలిగి ఉన్న భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌) ‌మద్దత్తు లేకుండా ప్రస్తుత ఉద్యమానికి బలం చేకూరదు. ఎందుకంటే దక్షిణ పంజాబ్‌లోని కనీసం 20 జిల్లాల్లో భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌కి బలమైన పట్టు వుంది.  మరి ఇలాంటి యూనియన్‌ ‌ను 31 రైతు సంఘాలు ఎందుకు దూరం పెట్టాయి చూద్దాం..

బికెయు (ఉగ్రహాన్‌) ‌నాయకత్వం  డిసెంబర్‌ 10‌న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం జైలులో ఉన్న పౌర సమాజ కార్యకర్తలు వరవర రావు,సుధా భరద్వాజ్‌,ఆనంద్‌ ‌తెల్టుంబడే,ఉమర్‌ ‌ఖాలిద్‌ ‌వంటి మేధావులందరినీ విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ తన యూనియన్‌ ‌సభ్యులను ఉద్దేశించి ప్రసంగించింది. తమ మదత్తుదారుల చేతుల్లో ఈ పౌర సమాజ కార్యకర్తల ఫోటోలు ప్రదర్శింప జేసి వీరి విడుదలకి డిమాండ్‌ ‌చేసింది.

దీనితో కేంద్ర రైల్వే శాఖా మంత్రి  పియూష్‌ ‌గోయల్‌తో తక్షణం ప్రతిస్పందించి చట్ట వ్యతిరేకులు అయిన వామపక్ష మరియు మావోయిస్టు వాదులు రైతుల ఆందోళనను హైజాక్‌ ‌చేశాయని అన్నారు. ఈ సంఘటన తర్వాత బికెయు (ఉగ్రహాన్‌) ‌యూనియన్‌  ‌ప్రభుత్వ వ్యతిరేఖను మాత్రమే కాదు.. నిరసనలో ఉన్న ఇతర 31 రైతు సంఘాల నుంచి కూడా వ్యతిరేకతను చవి చూసింది. భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌) ‌వలన ప్రస్తుత రైతు ఉద్యమానికి హాని అని 31 రైతు సంస్థలు ప్రకటించాయి. అయితే  రైతు భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌) ‌మాత్రం తాము చేసింది తప్పు అని భావించ లేదు.’’మేము ఏమి చేసినా రైతులకు అనుకూలంగా ఉండటం మా నిరసనలో ఒక భాగం, లక్షలాది మంది మాకు మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వం లేదా కార్పొరేట్‌ ‌మీడియా మా రైతుల ఆందోళనను అరికట్టలేవు ’’అని బికెయు (ఉగ్రహాన్‌) ‌ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్‌ ‌సింగ్‌ ‌కోక్రీ అన్నారు.

ఢిల్లీకి చేరుకోవడానికి ముందు వ్యవసాయ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రెండు నెలల నిరసన సందర్భంగా, ఉగ్రహాన్‌ ‌తన సొంత అజెండాతో ఆందోళనను నిర్వహించింది. 31 ఇతర రైతు యూనియన్లు నవంబర్‌ 28‌న ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న తరవాత చివరిగా భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌) ‌ఢిల్లీకి చేరింది. ప్రస్తుతం ఈ యూనియన్‌  ‌వేలాది మంది మద్దతు దారులతో టికిరి సరిహద్దులో శిబిరాలు వేసుకుని ధర్నా చేస్తున్నది. ఈ యూనియన్‌ ‌టికిరి బోర్డర్లో ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకుని ధర్నా నిర్వహిస్తోంది.దీనికి 31 రైతు సంఘాలకి మధ్య విభేదాలు చాల మెండుగా వున్నాయి.. సామజిక కార్యకర్తల అరెస్టు ఖండించి.వారి విడుదలను డిమాండ్‌ ‌భారతీయ కిసాన్‌ (ఉ‌గ్రహాన్‌) ‌చేసినందుకు దీన్ని 31 రైతు సంఘాలు వెలివేసాయి.

భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌)‌కి 31 రైతుసంఘాలకి మధ్య అగాధం ఢిల్లీ బోర్డర్లలో ఏర్పడ లేదు. పంజాబ్‌ ‌గడ్డ మీదే వీరికి అభిప్రాయ బేధాలు వున్నాయి. ఈ ఏడాది జూన్‌లో పంజాబ్‌లో మూడు (అప్పటి బిల్లులకు) నేటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైనప్పుడు, భారతీయ కిషన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌) ఏ ఉమ్మడి ఫోరమ్‌లో భాగం కావడానికి లేదా ఇతర యూనియన్లతో జత కుడటానికి నిరాకరించింది. బికెయు (ఉగ్రహాన్‌) ‌తన స్వతంత్ర పోరాటాన్ని నిలుపుకోవటానికి, అలాగే సొంత ఎజండా ,ప్రత్యేక నిరసన కార్యక్రమాలను కలిగి ఉండాలని నిర్ణయించుకుంది. అన్ని నిరసనలలో పాల్గొన్న సంస్థలలో ఒకటైన క్రాంతికారి కిసాన్‌ ‌యూనియన్‌ ‌పంజాబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ‌దర్శన్‌ ‌పాల్‌ ఇలా  తెలిపారు. ‘‘మొదట బారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ఉ‌గ్రహాన్‌ ఎవరితో జతకట్టలేదు. తర్వాత వారు 31 యూనియన్లతో జత కట్టింది.   31 రైతు సంఘ సమ్మేళనాల సమావేశాలకు హాజరు కావాలి అని పంజాబ్‌లో ఆందోళనకి ప్రణాళిక వేసి అమలు చేస్తున్నా బికెయు (ఉగ్రహాన్‌) ఆఫీసు బేరర్లను ఆహ్వానించగా, వారు మా కార్యక్రమాలలో కొన్నిటిని అంగీకరించారు. కొన్నింటితో విభేదించారు. వారి స్వంత ఎజెండా లోంచి  కొన్ని ఉమ్మడి పోరు ఎజండాలో  జోడించారు.

మిగత రైతు సంఘాలకి భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌) ‌కి మధ్య తేడాలు వున్నాయి ఉదాహరణకు సెప్టెంబర్‌ ‌మధ్యలో, మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌నివాసం వెలుపల, పాటియాలాలోని ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ‌నివాసం వెలుపల బికేయు (ఉగ్రహాన్‌) ఆరు రోజుల సిట్‌ ‌నిరసనను ప్రారంభించింది. 31 రైతు సంఘాలు ఈ ఆరు రోజుల ఆందోళన చేసేందుకు ముందుకు రాలేదు. అంతే కాకుండా ఒక్క రోజు ధర్నా చేసి ఆపేయాలని కోరుకున్నాయి.

పంజాబ్‌లోని మాల్స్, ‌పెట్రోల్‌ ‌పంపులు మరియు పెద్ద కార్పొరేట్‌ ‌గ్రూపుల ఆఫీసుల ముందు నిరసనలు ప్రారంభించాలనే ఆలోచన బికేయు (ఉగ్రహాన్‌) ‌చేసింది. దీనిని  31 రైతు సంఘాలు ఒప్పుకుని అమలు చేసాయి. సీనియర్‌ ‌బిజెపి కేంద్ర నాయకుల దిష్టిబొమ్మలను తగలబెట్టడం గురించి బికేయు (ఉగ్రహాన్‌) ఇచ్చిన పిలుపుకి 31 రైతు సమ్మేళనం మొదట ఒప్పుకోలేదు. తరువాత వారు బికేయు (ఉగ్రహాన్‌) ‌తో కలసి పంజాబ్‌ ‌బిజెపి నాయకుల ఇళ్ల ముందు గెరావ్‌ ‌చేయటానికి 31 రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి.

31 రైతు సంఘాలు నవంబర్‌ 26-27 ‌తేదీలలో తన చలో ఢిల్లీ నిరసనను ప్రకటించినప్పుడు, భారతీయ కిసాన్‌ (ఉ‌గ్రహాన్‌) ‌తన ఆఫీసు-బేరర్ల సమావేశాన్ని నిర్వహించి, తాము రోతక్‌ ‌వైపు నుండి ఢిల్లీకి పోదాం అని..31 రైతు సంఘాలు అనుసరిస్తున్న జిటి రోడ్‌ ‌మార్గం ద్వారా వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకుంది. బికేయు(ఉగ్రహాన్‌) ‌మద్దతుదారులు పంజాబ్‌-‌హర్యానా సరిహద్దులోని ఖనౌరి వద్ద ఆగారు. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద 31 రైతు సంఘాలు ఆగిపోయాయి. బికేయు (ఉగ్రహాన్‌) ‌మద్దతుదారులు ఖానౌరి వద్ద ఆగాలి అని  నిర్ణయించుకోగా, 31 రైతు సంఘాలు అన్ని అడ్డంకులను అధిగమించి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఎప్పుడైతే  ఢిల్లీ పోలీసులు రైతుల కోసం కందకాలు..ముళ్ల కంచెలు..బారికేడ్ల అడ్డంకి పెట్టిందో ఈ వార్త బికేయు ఉగ్రహాన్‌ ‌గ్రూప్‌ ‌కు చేరి ఖానౌరి సరిహద్దు వద్ద ఉన్న అడ్డంకులను తొలగించుకుని ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుని టికిరి సరిహద్దుకు చేరుకుంది.

Singu Border‌ ‌ while platform control is being done by 31 farmer associations

సింగు బోర్డర్‌ ‌వేదిక నియంత్రణ 31 రైతు సంఘాలు చేస్తుండగా.. టికిరి బోర్డర్‌ ‌వేదిక నియంత్రణ భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (ఉ‌గ్రహాన్‌) ‌చేస్తున్నది. ఇటు వంటి పరిస్థితిలో భూమిలేని కూలీలు అధిక సభ్యులుగా ఉన్న పంజాబ్‌కు చెందిన మరో రైతు సంస్థ కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌సంఘర్ష్ ‌కమిటీ సొంత వేదిక చర్చ ఎక్కడ జరగటం లేదు. అనే విషయాన్ని మనం గమనించాలి. రైతులలో పలు రకాల రైతులు వున్నారు. అందులో అధికం వ్యవసాయం మాత్రమే తెలిసిన అసంఖ్యాక రైతు కార్మికులు వున్నారు. వీరు రైతులే. వీరి దగ్గర పనిచేయటానికి రెండు చేతులు మాత్రమే వున్నాయి.. అని గుర్తెరిగి వీరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది.

Leave a Reply