వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భారత జాతి ఆణిముత్యం జగ్జీవన్‌రామ్‌

April 8, 2019

భారత జాతి ఆణిముత్యం మాజీ ఉప ప్రధాని, భారత దళిత వర్గాల పెన్నిధి, సమతావాది డాక్టర్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ అని ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని జిల్లా కలెక్టర్‌ ‌సిహెచ్‌. ‌శివలింగయ్య పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌ప్లాట్‌ ‌ఫామ్‌ ‌నంబర్‌ ‌వన్‌ ‌సమీపంలో గల డాక్టర్‌ ‌బాబు జీవన్‌రామ్‌ ‌విగ్రహానికి కలెక్టర్‌, ‌జాయింట్‌ ‌కలెక్టర్‌, ‌వివిధ సంఘాల నాయకులు శుక్రవారం పూలమాలలు వేసి డాక్టర్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రా మ్‌ ‌జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్‌లోని స్థానిక ఎస్వీఎన్‌ . ‌ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి రావూరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉత్సవాల సభలో కలెక్టర్‌ ‌ముఖ్య అతిథిగా హాజరయ్యా మాట్లాడుతూ మహానుభావుల చరిత్ర భావి తరాలకు అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాదని ఆన్నారు. సంక్షేమం గురించి ఆలోచించిన వ్యక్తి అయినందున వారిని భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రిగా పని చేశారన్నా రు. దాదాపు 29 సంవత్సరాలు కేంద్రమంత్రిగా, ఉపప్రధా నిగా, సెంట్రల్‌ ‌పార్లమెంట్‌ ‌బోర్డు సభ్యునిగా మహానీయుడని, ఎన్నో సంస్కరణలు చేసిన సిద్ధాంతకర్త డాక్టర్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ అని కొనియాడారు.అడిషనల్‌ ‌యస్‌.‌పి రావుల గిరిధర్‌ ‌మాట్లాడుతూ మహానుభావుల అడుగుజాడల్లో నడిచి దేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత యువతపై ఉందన్నారు.50 ఏళ్ళపా టు పార్లమెంటేరియన్‌గా, ఆయన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎనలేని సేవలు అందించారన్నారు. జ నిర్మాణాని కి పాటుపడాలన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ ‌కమిషనర్‌ ఇం‌ద్రసేనారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శత్రువు నాయక్‌, ‌ముఖ్య ప్రణాళిక అధికారి కొమరయ్య, జిల్లా అధికారులు, దళిత సంఘం నాయకులు సంజీవ రావు, కిషన్నాయక్‌, ‌సుధాకర్‌, ‌బోడ లక్ష్మణ్‌, ‌సమ్మయ్య, రమేష్‌ ‌పిల్లి సుధాకర్‌, ఎన్జీవో డాక్టర్‌ ‌పరికిపండ్ల అశోక్‌, ‌ప్రజలు విద్యార్థిని విద్యార్థులు నేతలు పాల్గొన్నారు.జగ్జీవన్‌రామ్‌ అశయాలకు అనుగుణంగా అభివృద్ది పరుచుకోవాలి : కలెక్టర్‌
డాక్టర్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ అశయాలకు అనుగుణంగా ములుగు జిల్లాను అభివృద్ది పరుచుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్‌ ‌సి.నారా యణరెడ్డి అన్నారు. శుక్రవారం డాక్టర్‌ ‌బాబు జగ్జీవన్‌రామ్‌ 112‌వ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పఠానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోద్ది రోజుల క్రితమే ములుగు జిల్లాగా ఏర్పాటు కావడం వెంటవెంటనే ఎన్నికలు రావడంతో కోడ్‌ ఏర్పడిందని, దీంతో ఎలాంటి అభివృద్ది చేసుకోలేకపోతున్నా మన్నారు. జగ్జీవన్‌రామ్‌ ‌జయంతిని వచ్చే సంవత్సరం ఇం తకన్నా ఎక్కువగా ఘనంగా నిర్వహించుకుందామని అన్నా రు. జిల్లా అభివృద్ది కోసం ప్రజా సంఘాలు, పాత్రికే యులు, ప్రజాప్రతినిదులు, అధికారులు,ప్రజలు సహకరిం చాలని అన్నారు. ఈ సమావేశంలో అర్‌డివో రమాదేవి, జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ ‌సింగ్‌ ‌పాటిల్‌, ‌డాక్టర్‌ అప్పయ్య, డిఅర్‌డివో సంజీవరావు, డిపిఎం సతీష్‌, ఎస్సీ కార్పోరేషన్‌ ఇడి తుల రవి, ఎస్సీ అభివృద్ది శాఖ అధికారి భాగ్య)క్ష్మిరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.