వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భారత్‌,‌రష్యాలది ధృడమైన బంధం

September 4, 2019

  • రష్యా పర్యటనలో ప్రధాని మోడీ
  • పలు ఒప్పందాలపై సంతకాలు

భారత్‌-‌రష్యాలది దృడమైన బంధమని ప్రధాని మోడీ అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన..ఇరు దేశాల మధ్య  స్నేహబంధం   తన పర్యటనతో మరింత బలోపేతం కానుందని అన్నారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారం తనకు ప్రకటించడంపై మోడీ సంతోషం వ్యక్తం చేశారు. పుతిన్‌కు కృతజ్ఞతలు చెప్పిన ఆయన ఈ గౌరవం 130 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమైని అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ఎత్తులకు తీసుకెళ్లాలన్నారు మోడీ. అంతకుముందు వ్లాదివోస్టోక్‌లో పుతిన్‌తో కలిసి  జ్వెజ్డా షిప్‌ ‌బిల్డింగ్‌ ‌కాంప్లెక్స్‌కు ప్రధాని మోడీ  వెళ్లారు. స్పెషల్‌ ‌క్రూయిజ్‌లో షిప్‌ ‌బిల్డింగ్‌ ‌కాంప్లెక్స్‌ను సందర్శించారు. లోపల నౌకల తయారీని పరిశీలించారు. నౌకల నమూనాలను చూశారు. ప్రతీ స్పెసిమన్‌ ‌గురించి మోడీకి పుతిన్‌ ‌వివరించారు. అలాగే  వ్లాదివొస్టోక్‌లో వ్లాదిమిర్‌ ‌పుతిన్‌తో భేటీ  సందర్భంగా  రెండు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తనకు ఆహ్వానం పంపినందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు మోదీ అన్నారు. 2001లో జరిగిన వార్షిక సమావేశాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. అప్పటి ప్రధాని అటల్‌జీ బృందంలో గుజరాత్‌ ‌సీఎంగా తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. రష్యా, భారత్‌ ‌మధ్య స్నేహబంధం రోజు రోజుకూ బలపడుతోందని మోదీ అన్నారు. చెన్నై నుంచి వ్లాదివొస్టోక్‌ ‌మధ్య పూర్తి స్థాయి సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు మోదీ అన్నారు. అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల ప్రమేయాన్ని ఇరు దేశాలు వ్యతిరేకిస్తున్నట్లు మోదీ తెలిపారు. అంతకముందు జ్వెజ్‌దా షిప్‌యార్డును మోదీ సందర్శించారు. ఈ షిప్‌యార్డుతో ఆర్కిటిక్‌ ‌షిప్పింగ్‌ అభివృద్ధి చెందుతుందని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నౌకాశ్రయంలో ఉన్న అద్భుత టెక్నాలజీని పుతిన్‌ ‌తనకు చూపించినట్లు ఆయన చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా వెళ్లిన ఆయనకు.. వ్లాడివొస్టోక్‌లో అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ నగరంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డులకెక్కారు. పర్యటనలో ఈస్టర్న్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌లో మోదీ పాల్గొననున్నారు. దీంతో పాటు భారత-రష్యా 20వ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు.