వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భద్రాద్రి అధికారికంగా ప్లాస్టిక్‌ ‌నిషేధం

September 6, 2019

విక్రయిస్తే 5వేలు జరిమాన, షాపు లైసెన్సు రద్దుభద్రాద్రి పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్‌ ‌నేషేందించేందుకు ఇకకేవలం 24 గంటలు గడువు మాత్రమే మిగిలి ఉన్నది. శనివారం నుండి భద్రాచలంలో అధికారికంగా ప్లాస్టిక్‌ ‌నిషేదం అమల్లోకి రానుంది. 50 మైక్రాన్ల లోపు సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ను నిషేదిస్తునట్లు భద్రాచలం సబ్‌కలెక్టర్‌ ‌భవేశ్‌ ‌మిశ్రా గతనెల 17న చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. స్థానిక వ్యాపారుల కోరిక మేరకు 20 రోజులు గడువు ఇవ్వగా శుక్రవారంతో ముగిసింది. దీనితో పర్యావరణ ప్రేమికులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చినట్లుగానే భావింవచ్చని నిర్ధేశించిన గడువు ముగియడంతో శనివారం నుండి ఎవరైన ప్లాస్టిక్‌ను విక్రయిస్తే వారికి 5వేలు జరిమాన విధిస్తామని ఇప్పటికే సబ్‌కలెక్టర్‌ ‌స్పష్టం చేసారు. అలాగే రెండవ సారి కూడ ఇదే క్రమంలో కూడ ఈ రీతిలో విక్రయిస్తే వారికి లైసెన్సు రద్దు చేస్తామని ప్రకటించారు. దీనితో భద్రాచలం క్షేత్రాన్ని ప్లాస్టిక్‌ ‌రహితంగా చేసేందుకు మార్గం సుగమం అయింది. జేడి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏడాది క్రితం చేపట్టిన ప్లాస్టిక్‌ ‌రహిత భద్రాద్రి కార్యక్రమంలో భాగంగా గత ఏడాది కాలంగా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాదు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షన ఇచ్చి జేడి ఫౌండేషన్‌ ‌జిల్లా కన్వీనర్‌ ‌మురళీమోహన్‌ ‌వారి సహకారం కోరారు. ఇదిలా ఉండగా ప్లాస్టిక్‌ను వీడాలంటూ జేడి ఫౌండేషన్‌ ‌చేపట్టిన కార్యక్రమంకు చాంబర్‌ఆఫ్‌ ‌కామర్స్ ‌సైతం తన సంపూర్ణ సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌పరిధిలో దాదాపుగా అన్నీ సంఘాలు స్వఛ్చందంగా తాము ప్లాస్టిక్‌ను విసర్జించి ప్లాస్టిక్‌ ‌రహిత భద్రాద్రికి కృషి చేస్తామని ప్రకటించటం మంచి పరిణామం అన్నారు. భద్రాచలంలో వినియోగించిన ప్లాస్టిక్‌ ‌బాటిల్స్ ‌క్రష్‌ ‌చేసేందుకు మిషన్‌ను అందుబాటులో వచ్చిందని గత 24న జేడి ఫౌండేషన్‌ ‌వ్యవస్థాపకులు , సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ, భద్రాచలం ఏఎస్పీ రజేష్‌ ‌చంద్ర, ప్లాస్టిక్‌ ‌బాటిల్స్‌ను లాంఛనంగా ప్రార•ంభమైంది. అలాగే ఇందకోసం పట్టణంలో గల పంచాయితీ కాంప్లెక్స్ ‌దుకాణ సముదాయంతో గదిని కేటాయించాలని జేడి ఫౌండేషన్‌ ‌జిల్లా కన్వీనర్‌ ‌పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసరావును కోరగా గదిని కేటాయించారు. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో 5 ఎకరాల డంపింగ్‌ ‌యార్డు తయారు చేస్తుండగా ఇందుకు సంబంధించిన పనులు వేగవంతం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం తడి , పొడి చ్తెతలను సేకరిస్తామని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ ‌నిషేదం ద్యేయంగా గత ఏడాది సెప్టెంబర్‌ 10‌వ తేదీన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో భద్రాచలంలో ప్లాస్టిక్‌ ‌రహిత భద్రాద్రి కోసం కార్యక్రమం ప్రారంభమైంది. జేడి ఫౌండేషన్‌ ‌తరుపున మురళీమోహన్‌ ‌కుమార్‌ ‌ప్రజల్లో మార్పు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో సబ్‌కలెక్టర్‌ ‌భవేశ్‌ ‌మిశ్రా ఇప్పటికే శనివారం నుండి భద్రాచలం ప్లాస్టిక్‌ ‌ను నిషేదించారు. కాగా శనివారం నాడు ప్రభుత్వ అధికారులు , చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ , ‌స్వఛ్చంద సంస్థల వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్దులతో పాటు ఇతర సంఘాలకు చెందిన వారితో భారీ ర్యాలీని నిర్వహించేందుకు సన్నాహాలు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌రజత్‌కుమార్‌ ‌శైనీ, ఐటిడిఏ పిఓ విపి గౌతమ్‌ , ‌సబ్‌కలెక్టర్‌ ‌భవేశ్‌ ‌మిశ్రా, స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పుర•ప్రముఖులు పాల్గొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.