వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భద్రాద్రిలో ముక్కోటి ఉత్సవాలు సమర్ధవంతంగా నిర్వహించాలి

December 4, 2019

జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్‌ ‌రజత్‌కుమార్‌ ‌శైనీముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించేకుని భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకోవడానికి విచ్చేయు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌రజత్‌కుమార్‌ ‌శైనీ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ ‌సమావేశపు హాలులో ముక్కోటి ఏర్పాట్లపై సమన్వయ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విచ్చేయు భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై శాఖల వారీగా విధులు కేటాయించామని చెప్పారు. కేటాయించిన విధుల ప్రకారం కార్యచరణ ప్రణాళికలు తయారు చేసి 20 రోజులుల్లోగా నివేధికలు అందచేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భద్రాచలం సబ్‌కలెక్టర్‌ ‌కార్యాలయంలో కంట్రోలు రూము ఏర్పాటు చేయాలని చెప్పారు. దేవాలయ రెవెన్యూ , పోలీసు అధికారులతో కోఆర్టినేటర్‌ ‌టీములను ఏర్పాటు చేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఉత్సవాలను వీక్షించడానికి విచ్చేయు ప్రముఖులకు వసతీ ఏర్పాటు చేయుటకు అందుబాటులో ఉన్న విశ్రాంతి భవనాలను సిద్దంగా ఉండచాలని సబ్‌కల్టెర్‌కు సూచించారు. జనవరి 5,6 తేదీలలో భద్రాచలంలో పాటు దుమ్ముగూడెంలో మాంసపు దుకణాలు మూసివేయాలని సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయాలని చెప్పారు. అలాగే మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వాహనాల రాకపోకలు క్రమబద్దీకరించాలని చార్జీల వివరాలు తెలియచేయుటకు టాక్సీ, ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించి చార్జీలను నిర్ణయించి బోర్డులు ఏర్పాటు చేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. తెప్పోత్సవం ఉత్తర ద్వారదర్శనం వీక్షించేందుక భక్తులు కుర్చోవడానికి వీలుగా ప్రణాళిక తయారు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. కార్యక్రమాలను భక్తులు వీక్షించేందుకు గాను దేవాలయం పరిసర ప్రాంతాల్లో సిసిటివిలు ఏర్పాటు చేయలని చెప్పారు. ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రతీ సెక్టారు ఒక జిల్లా అధికారిని బాధ్యులుగా నియమిస్తున్నట్లు చెప్పారు. భక్తులు గోదావరిలోకి దిగకుండా బార్‌కేడింగ్‌ ఏర్పాటు చేయాలని గోదావరిలోకి వెళ్ళకుండా ప్రమాదాలను తెలియచేయు బోర్డులను ఏర్పాటు చేయించటంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. మన జిల్లా నుండే కాక ఇతర జిల్లాల నుండి కూడ భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్‌ ‌ప్రాంతాన్ని కేటాయించాలని చెప్పారు. వాహనాలు పార్కింగ్‌ ‌చేయు స్థలాల వివరాల సమాచారాన్ని భక్తులు తెలుసుకునే విధ•ంగా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. సురక్షిత మంచినీరు అందచేయుటకు తాత్కాలికంగా మంచినీటి కుళాయిలు ఏర్పాటు తో పాటు ప్రధాన కూడళ్ళతో మంచినీటి డ్రమ్ములు , తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని గ్రామీణ నీటి సరఫర విభాగం అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్లాస్టిక్‌ ‌మంచి నీటి ప్యాకెట్ల ద్వారా మంచినీరును పంపి•ణీ చేయవద్దని పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి వ్యర్ధాలను తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. పట్టణంలోని రహదారులను పరిశీలించి అవసరమైన చోట మరమత్తులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హంస వాహణంతో పాటు దేవాలయం పరిసర ప్రాంతాలలో చేసిన విద్యుత్‌ ఏర్పాట్లును పర్యవేక్షణ చేసి దృవీకరణ పత్రం తీసుకోవడంతో పాటు విద్యుత్‌ ‌సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా అగ్నిమాపక వాహనాలను సిద్దంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనవరి 4 నుండి 6వరకు అత్యవరప చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయటంతో పాటు 24 గంటలు పనిచేయు విధంగా సిబ్బందికి విధులు కేటాయించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఆహార పదార్ధాలను తనిఖీ చేయాలని చెప్పారు. భక్తులను రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా హోటల్‌ , ‌లాడ్జీలను తనిఖీ చేయటంతో పాటు ఆహార పదార్ధాల నాణ్యతను పాటించటంతో పాటు ధరలను నిర్ణయించేందుకు వ్యాపారుల సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే భద్రాచలం పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో , పర్యాటన ప్రాంతాల వివరాలను తెలియచేయుటకు వీలుగా కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ ‌కిన్నెరసాని సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్వోను ఆదేశించారు. భక్తులు గోదావరిలోని దిగకుండా బోటు ద్వారా కూడ పర్యవేక్షణ చేయుటకు ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. జిల్లాలోని ప్రధాన రహదారులను పర్యవేక్షణ చేసి అవసరమైన మరమత్తులు చేయలని ఆర్‌• ‌బి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ సునీల్‌ ‌దత్‌, ఐటిడిఏ పిఓ విపి గౌతమ్‌, ‌సంయుక్త కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు, సబ్‌కలెక్టర్‌ ‌భవేశ్‌ ‌మిశ్రా, జిల్లా ప్రత్యేక అధికారి ఐలా త్రిపాఠి, దేవస్థానం కార్యనిర్వహక అధికారి నరసింహులు, ఉపకార్యనిర్వహణ అధికారి రవీంధర్‌, ‌భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర, అన్నీ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.