Take a fresh look at your lifestyle.

భద్రాద్రికి రామయ్య పెళ్ళి కళ

వైభవంగా సాగుతున్న బ్రహోత్సవాలు-తరలివస్తున్న భక్తులు

పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో 14వతేదీ న శ్రీ సీతారామకల్యాణం,15వతేదీన మహాపట్టాభిషేకం అత్యంత వైభవంగా జరగనుంది. శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా దీవిస్తారు. నిజమైన దాంపత్యానికి నిదర్శనమైన శ్రీ సీతారాముల పెళ్లి వేడుక భద్రాచలంలో కన్నులపండువగా ప్రతీ ఏటా పునర్వసు నక్షత్రంలో అభిజిత్‌లగ్నమందు చైత్రశుద్ద నవమి నాడు జరుగుతోంది. నయనానందంగా సాగే జగధభిరాముని కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ,ఆంధ్రా రాష్ట్రాల నుండే కాకుండా సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘడ్‌,ఒరిస్సా,మహారాష్ట్ర రాస్ట్రాలనుండి లక్షలాధిగా భక్తులు భద్రాచలం చేరుకుంటారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy