Take a fresh look at your lifestyle.

భదాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి

మూడు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. సోమవారం ఉదయం 22 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 28 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరుగుతూ మంగళవారం సాయంత్రానికి 36 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటం వలన గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌ఘఢ్‌ ‌ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో చర్ల వద్ద మధ్యతరహా తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది.

దీనితో అధికారులు మూడు గేట్లను మూడు అడుగుల మేర నీటిని దిగువ ప్రాంతానికి దిగుమతి చేసారు. 52.706 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసారు. తాలిపేరు ప్రాజెక్టు పరవళ్ళు తొక్కడంతో తేగడ వద్ద ఉన్న లోలెవెల్‌ ‌వంతెన పూర్తిగా మునిగిపోయింది. గోదావరి క్రమక్రమంగా పెరగటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. వరద ప్రభావాన్ని బట్టి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు సిద్ధం చేసారు.

Leave a Reply