Take a fresh look at your lifestyle.

భగ్గుమంటున్న ఎండలు

ఉత్తర తెలంగాణలో అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
కాలు బయటపెట్టలేని పరిస్థితి..
రాత్రి వేళల్లోనూ వేడి గాలులు

రాష్ట్రం ఎండలతో మండిపోతున్నది. జనం ఎండ వేడిమికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊరూవాడా తేడాలేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రాబోయే నాలుగైదు రోజుల్లో మరింత తీవ్రత పెరిగే వీలుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లాలో ఆందోళన కనిపిస్తోంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలమినా కొడుతాయి లేక రోళ్లు నిండే వానలైనా పడుతాయి అని పెద్దలు చెప్పుతుంటారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే రోళ్లు పగిలే ఎండలే కొట్టేటటున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మరీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. గరిష్ఠంగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో 48 డిగ్రీలకు చేరువగా ఊష్ణోగ్రత చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ జిల్లాల పరిధిలోనే నమోదవుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. రోహిణికార్తె కావడంతో భానుడి ప్రతాపం క్రమంగా పెరుగుతుండటంతో పగలు, రాత్రి వేళల్లో ఉష్ణోగత్రలు బెబెలెత్తిస్తున్నాయి. చొప్పదండి మండలంలో సోమవారం రాత్రి 7 గంటలకు 42 డిగ్రీల సెల్సియస్‌ ఎం‌డ తీవ్రత నెలకొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోడ్డుపై నడవడం, ఎండలో నిలబడటం ప్రజలకు భయాన్ని కలిగిస్తున్నది. పెరుగుతున్న తీవ్రత వల్ల పలు ప్రాంతాల్ని హెచ్చరిక ప్రదేశాలుగా వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఇలాంటి ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తోంది. నాలుగు జిల్లాల పరిధిలోని 22 మండలాల్లో ఎన్నడు లేనివిధంగా ప్రభావం జనాల్ని అల్లాడిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండతీవ్రతతో జనాలు జంకుతున్నారు. మిట్టమధ్యాహ్నం వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఏడుగురు, సోమవారం 15 మొత్తం 22 మంది వడ దెబ్బకు మృత్యువాత పడ్డారు. గతంలో ఎన్నడు లేని విధంగా భానుడి సెగ నెత్తిని తాకుతుండటంతో పలుచోట్ల జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కార్యాలయాల్లో విధులు నిర్వహించేవారితో పాటు వ్యవసాయ పనులు ఇతరత్రా కార్మికులు అస్వస్థతలకు గురౌతున్నారు. ఉపాధి హా కూలీలపై సూరీడి తాకిడి అధికంగానే ఉంటోంది. ప్రయాణాలు సాగించే వారికి సెగ తప్పడంలేదు. పగటి వేళల్లో అత్యవసరమైతే తప్ప రోడ్లపై ప్రజల జాడ కనిపించడంలేదు.

Leave a Reply

error: Content is protected !!