Take a fresh look at your lifestyle.

బొమ్మైనా, బొరుసైనా… కెసిఆరే విజేత

జగన్‌ ఎన్నికలు అయ్యే వరకూ ఆంధ్ర వ్యతిరేకుల ను దూరంగా ఉంచి ఉంటే బాగుండేది. కేసీఆర్‌ వెంట్రుకను కొండకేసి లాగుతున్నారన్న సంగతిని జగన్‌ అర్థం చేసుకోవాలి. ఒక వైపు ఆయన మోడీ ఆదేశాలను పాటిస్తున్నారు. ఎలాగంటే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు యత్నాల ద్వారా, ఈ ఎత్తుగడ వ్లల కోల్పోయేదేమీ లేదు. వస్తే కొండ ఊడిపడుతుంది. లేదా వెంట్రుక పోతుంది. ఆయన అటు మోడీనీ, ఇటు జగన్‌, చంద్రబాబునాయుడును వలలో వేశారు.

భారత రాజకీయ రంగస్థలం పై నటులు , వారి పాత్రలు తరచూ మారుతూ ఉంటాయి. సంభాషణలు ఎంత అవకాశవాదమైనవి అయినా, చిక్కుముడులతో కూడినవైనా ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు , శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి అవకాశవాదానికి ఎప్పటికీ మూల సూత్రమే.
తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయదల్చు కున్నప్పుడు తెరాస, దాని నాయకత్వం వైఎస్‌ జగన్‌ను అడ్డుకుంది. ఆయనను తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసి రాళ్ళ వర్షం కురిపించింది.
ఇప్పుడు ఆశ్చర్యం ఏమంటే అదే తెరాస నాయకత్వం జగన్‌ను తెలంగాణ ద్రోహి స్థానంలో నమ్మకమైన మిత్రునిగా పరిగణిస్తోంది. తెరాస కార్యకర్తలు మానుకోట పర్యటన సందర్భంగా తనపై రాళ్ళ వర్షం కురిపించి ఎంతో కాలం కాలేదు. అయినా వారితో దోస్తీకి జగన్‌ అంగీకారం తెలిపారు. ఆయన మూడువెలకు పైగా కిలోమీటర్ల పాదయాత్ర జరిపినప్పుడు పొందిన ప్రజాభిమానం అనే మత్తు నుంచి ఇంకా వైదొగలేదు. ఇలాంటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, సురక్షితమైన అడుగులు వేయని రాజకీయ వేత్తలాగే జగన్‌ ఉన్నట్టు కనిపిస్తోంది.
ఆయన రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు శక్తిమంతమైన ప్రత్యర్థిని ఢీకొన్నారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆయన ఎదుర్కొంటున్న సవాళ్ళలో అప్పటికీ, ఇప్పటికీ పెద్ద తేడా లేదు. అప్పట్లో కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం నుంచి మాత్రమే సవాల్‌ను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎత్తుకు పైఎత్తు వేసే రాజకీయ వేత్తగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నుంచి కూడా గట్టి సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. అప్పటికన్నా ఇప్పుడు ఆయన మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జగన్‌ ఎదుర్కొంటున్న సవాల్‌ ఒకటే అయినా, స్క్రిప్ట్‌లో చాలా తేడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కరడు కట్టిన రాజకీయ వేత్తలనూ, కుతంత్ర రాజకీయాల కు పేరొందిన వారినీ ఎదుర్కొంటున్నారు.
తెలుగు రాష్ట్రాల కుతంత్ర రాజకీయాలు ఇప్పుడు పరిస్థితి జగన్‌కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చంద్రబాబునాయుడు తప్పు మీద తప్పు చేయడం ఆయనకు లాభకరంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఇప్పుడు జగన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో చంద్రబాబునాయుడును ఎదుర్కోవడానికి జగన్‌కు ఏ పార్టీ తోడు అవసరం లేదు. అందునా ఆంధ్ర వ్యతిరేకులుగా ముద్ర పడిన వారి సహాయ, సహకారాలు అసలు అవసరం లేదు. ఒంటరిగా పోరాడగల యోధునిగా జగన్‌ బరిలోకి దిగవచ్చు. అయితే, ఆయన సరైన నిర్ణయాలు తీసుకోని నాయకునిగా వ్యవహరిస్తున్నారు. తెరాస ఇస్తానన్న మద్దతును జగన్‌ అంగీకరించడం బాగా లేదు. ఏ రాజకీయ నాయకుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే తప్పించుకునే వాడు.
చంద్రబాబు నాయుడు రాజకీయాలను ఎదుర్కోవడానికి జగన్‌ చాలా వర్గాల మద్దతును కూడగట్టుకోవల్సి ఉన్న మాట నిజమే. రాజకీయ వ్యూహ, ప్రతి వ్యూహాల విషయంలో బాబుకూ, తనకూ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించుకోవడానికి ఆయన చేయవల్సింది ఇంకా చాలా ఉన్న మాట నిజమే. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తెరవెనుక ఉండి జనాదరణను కూడగట్టుకుంటున్నారు. ఆయన ఎత్తు జిత్తుల చంద్రబాబుని కాకుండా, ప్రభుత్వ పాలన తీరును సవాల్‌ చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన వాగ్ధానాలను అమలు జేయలేదన్న ప్రత్యర్థి విమర్శలను పట్టించుకోకుండా, తన ప్రభుత్వం అప్పుతో విడివడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తోందంటూ ప్రచారం జరుపుకుంటున్నారు. అయితే, ఇది చంద్రబాబు ప్రతిష్ట, పలుకుబడిపై వ్యతిరేక ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. చంద్రబాబు అలా చేయడం జగన్‌కు లాభిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పట్ల వ్యతిరేత జగన్‌కు తోడ్పడుతుంది. అందువ్లల్ల ఆయన బయట నుంచి వచ్చే మద్దతును, ముఖ్యంగా తెరాస వంటి ఆంధ్ర వ్యతిరేక శక్తుల మద్దతును తీసుకోవల్సిన అవసరం లేదు.
మరో వంక చంద్రబాబు ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపి తనను ఓడిరచేందుకు ప్రయత్నించినందుకు కేసీఆర్‌ బాబుకు గట్టి గుణపాఠం చెప్పాలనుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పొత్తు వ్లల్ల ప్రయోజనం జరగకపోయినా, కేసీఆర్‌ మాత్రం మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆయన వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోనీ వైసీపీని మిత్ర పక్షంగా కలపుకోవాలనుకుంటున్నారు. ఇద్దరికీ చంద్రబాబు ఉమ్మడి శత్రువు. అంతకుమించి కేసీఆర్‌కు జగన్‌ను కలపుకుని వెళ్ళడం వల్ల పెద్దగా ఉద్దేశ్యాలేమీ లేవు. జగన్‌ను తెంగాణ ద్రోహిగా ముద్ర వేస్తూ ఆయన చేసిన ప్రసంగాలు ఇంకా జనం స్మ ృతి పథంలోనే ఉన్నాయి. తెరవెనుక ఏదో జరుగుతోంది.
కేసీఆర్‌, చంద్రబాబునాయుడు వైస్రాయ్‌ హొటల్‌ కేంద్రంగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచేందుకు జరిగిన రాజకీయ కుట్రలో భాగస్వామున్న సంగతి సామాన్యునికి సైతం తెలుసు. రిటర్న్‌ గిప్ట్‌కు అప్పుడే బీజం పడిరది. ఆనాటి కుట్రలో భాగస్వాములైన ఈ ఇద్దరూ హరికృష్ణ అంత్యక్రియ సందర్భంగా తెంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు గురించి మాట్లాడుకోవడం ఇందుకు నిదర్శనం.
అయితే, జగన్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా లభించిన అశేష జనాదరణతో జగన్‌ వీరిద్దరూ పాత మిత్రు లేనన్న విషయం మరిచి పోయి కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ వలో పడ్డారు. కేసీఆర్‌ వంటి ఆంధ్ర వ్యతిరేక శక్తుల మద్దతు వైసీపీకీ వస్తే జగన్‌ అవకాశాలు దెబ్బతింటాయి. ఆ విషయం జగన్‌కు తెలు సు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియదని ఎవరూ అనుకోరు. తెలంగాణ ప్రజులు చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో రిటర్న్‌ గిప్ట్‌ ఇచ్చినట్టే ఆంధ్రు ఆత్మగౌరవ నినాదాన్ని బాబు తలకెత్తుకున్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న పరిస్థితిని తిప్పి కొట్టేందుకు బాబు దీనినే రిటర్న్‌ గిఫ్ట్‌గా ప్రయోగించవచ్చు.
ఆంధ్ర వ్యతిరేక శక్తులతో జగన్‌ చెట్టపట్టాలేసుకుంటే ఆంధ్రు ఆత్మగౌరవ నినాదం జగన్‌ అవకాశాల ను దెబ్బతీయవచ్చు. మరో వంక సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ కూడా రంగంలో ఉండటం వ్ల బాబు వ్యతిరేక వోట్లను బాగా చ్చీల్చొ వచ్చు. అది బాబుకు మేులు చేయవచ్చు.
రాజకీయంగా తన కన్నా సీనియర్లు, తలపండిన వారైన ఇద్దరు నాయకులు విసిరన వలో జగన్‌ పడ్డారు. అందుకే ఒకనాటి వైస్రాయ్‌ హొటల్‌ మిత్రుడు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని పదే పదే అంటున్నా చంద్రబాబు ఉలకడం లేదు…బెదరడం లేదు, సరికదా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
ఈ మొత్తం నాటకంలో కేసీఆర్‌ విజేతగా నిలుస్తున్నారు. కేసీఅర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో జగన్‌ చేరాల ని ఆయన కోరుతున్నట్టయితే, ఇప్పటి నుంచే ప్రయత్నం చేయనక్కరలేదు. ఫలితాలు వ్లెల్లడైన తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఉడతా భక్తిగా తాను చేస్తానని అప్పుడు ప్రకటించవచ్చు. బొంతపురుగునైనా ముద్దాడతాను వంటి ప్రకటన చేయవచ్చు.
జగన్‌ ఎన్నికలు అయ్యే వరకూ ఆంధ్రవ్యతిరేకును దూరంగా ఉంచి ఉంటే బాగుండేది. కేసీఆర్‌ వెంట్రుకను కొండకేసి లాగుతున్నారన్న సంగతిని జగన్‌ అర్థం చేసుకోవాలి. ఒక వైపు ఆయన మోడీ ఆదేశాలను పాటిస్తున్నారు. ఎలాగంటే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు యత్నాల ద్వారా, ఈ ఎత్తుగడ వ్లల్ల కోల్పోయేదేమీ లేదు. వస్తే కొండ ఊడిపడుతుంది. లేదా వెంట్రుక పోతుంది. ఆయన అటు మోడీనీ, ఇటు జగన్‌, చంద్రబాబునాయుడును వలలో వేశారు.
రిటర్న్‌ గిఫ్ట్‌ రాజకీయ్లాలో ఆరితేరిన కేసీఆర్‌ పాచిక పారితే తాను తవ్విన గోతు రెండిరటిలో ఒకదానిలో జగన్‌ యత్నాలను సమాధి చేయవచ్చు. లేదా చంద్రబాబునాయుడుకు నిజంగానే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వవచ్చు. అటు అయినా, ఇటు అయినా ప్రతీకారం తీర్చుకోవడమే ఆయన లక్ష్యం.
– ఎండి అయూబ్‌ ఖాన్‌

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy