వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బీబీనగర్‌ ఎయిమ్స్ ‌మెడికల్‌ ‌కాలేజీ ప్రారంభం

August 27, 2019

విద్యార్థుల రాకతో కళకళలాడిన క్యాంపస్‌
‌పరిహారం కోసం భూములిచ్చిన రైతుల ఆందోళన
బీబీనగర్‌ ఎయిమ్స్ ‌మెడికల్‌ ‌కాలేజీ ప్రారంభం సందర్భంగా.. ఎయిమ్స్‌కు భూములిచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఇంత వరకు రూపాయి కూడా పరిహారంగా చెల్లించలేదని మండి పడుతున్నారు. రంగాపురానికి చెందిన వేల ఎకరాల భూములు తీసుకుని.. తమని ఉపాధి హా పనులకు కూడా రానివ్వడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక వైద్యసంస్థ ఎయిమ్స్ ‌కు దేశవ్యాప్తంగా గొప్ప పేరుంది. కార్పొరేట్‌ ‌స్థాయి వైద్యంతో పాటు వివిధ రోగాలకు ఓ రీసెర్చ్ ‌సెంటర్‌ ‌గాను ఎయిమ్స్ ‌పనిచేస్తుంది. విభజన చట్టంలో తెలంగాణకు ఈ వైద్యసంస్థను కేటాయించారు. అయితే అది వాస్తవరూపం దాల్చడానికి చాలా సమయం పట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్ ‌కోసం చాలా కృషి చేసింది. టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు కేంద్రమంత్రులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. సీఎం కేసీఆర్‌•ట్టుదలతో ఎట్టకేలకు మోడీ సర్కార్‌ ఎయిమ్స్‌ను మంజూరు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌ ‌నిమ్జ్ ‌ప్రాంగణంలో ఈ వైద్యసంస్థ పురుడు పోసుకుంది. కేసీఆర్‌ ‌ప్రభుత్వం అధునాతమైన బిల్డింగులు, మెరుగైన సౌకర్యాలను కల్పించింది. సువిశాలమైన క్యాంపస్‌ ‌ను సిద్ధం చేసింది. ఇప్పుడు ఏకంగా మొదటి ఏడాది తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.
నిజానికి ఎయిమ్స్ ‌కు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇస్తూ జీవో వచ్చిన తర్వాత క్లాసులు ప్రారంభం కావడానికి కనీసం మూడేళ్లయినా పడుతుంది. కానీ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ చొరవతో ఏడాదిలోపే తొలి ఏడాది ఎంబీబీఎస్‌ ‌తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్లు, సరిపడా స్టాఫ్‌తో ఈ వైద్యసంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎంబీబీఎస్‌ ‌ఫస్ట్ ‌బ్యాచ్‌ ‌లో 50 మంది విద్యార్థులు అడ్మిషన్‌ ‌తీసుకున్నారు. దీంతో ఎయిమ్స్ ‌క్యాంపస్‌ ‌లో పండుగ వాతావరణం నెలకొంది. వివిధ రాష్ట్రల నుంచి వచ్చిన స్టూడెంట్స్, ‌వాళ్ల తల్లిదండ్రులు ఇక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎయిమ్స్ ‌కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్‌ ‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. బీబీ నగర్‌ ‌లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ‌భవిష్యత్తులో తెలంగాణకే తలమానికంగా ఎదిగే అవకాశాలున్నాయి. సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యసేవలతో పాటు వెయ్యిపడకల ఆస్పతిగా ఇది సేవలు అందించనుంది. అలాగే ఈ వైద్యసంస్థను ఐసీఎంఆర్‌, ‌సీసీఎంబీకి అనుసంధానం చేయనున్నారు. వివిధ రోగాలపై పరిశోధనలు కూడా జరగనున్నాయి. అందుకే ఎయిమ్స్ ‌రాకపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైద్యసంస్థతో యాదాద్రి భువనగిరి జిల్లా ముఖచిత్రమే మారిపోతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎయిమ్స్ ‌లాంటి ప్రతిష్టాత్మక వైద్యసంస్థ తెలంగాణలో ప్రారంభం కావడం నిజంగా గొప్ప విషయం అని మాజ ఎంపి బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. నిరుపేద రోగులందరికీ ఇది వరం లాంటిదన్నారు. భవిష్యత్తులో ఈ ఎయిమ్స్ ‌కూడా అద్భుతమైన వైద్యసేవలతో, ఢిల్లీ ఎయిమ్స్‌ను మించిన ఖ్యాతిని ఆర్జించాలని కోరుకుంటున్నామని అన్నారు.