వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బీడీలు చుట్టే మహిళా కార్మికులకు మాస్కులు

August 26, 2019

ఫోటో: టీఎస్‌ ‌బీడీ వర్కర్స్ ‌యూనియన్‌ ‌జిల్లా సదస్సు మహాసభలో  మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు
ఫోటో: టీఎస్‌ ‌బీడీ వర్కర్స్ ‌యూనియన్‌ ‌జిల్లా సదస్సు మహాసభలో మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు

అక్కా, చెల్లెల ఆరోగ్యానికి హరీష్‌ ‌రావు అండబీడీలు చుడితేనే మీ బతుకు బండి సాగుతున్నది.! మీరు ఆరోగ్యాలను కాపాడటం ముఖ్యం. మీ ఆరోగ్య రక్షణకు అండగా నేనుంటా.! సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలో బీడీలు చుట్టే ప్రతి ఒక్క అక్కా, చెల్లెలికి, త్వరలోనే మాస్కులు అందిస్తానని మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండ భూదేవి గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ‌యూనియన్‌ ‌జిల్లా సదస్సు మహాసభకు జెడ్పీ ఛైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాల హాయాంలో ఏళ్లకు ఏళ్లు కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వలేని దైన్య పరిస్థితి ఉండేదన్నారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీడీ కార్మికులకు జీవనభృతి అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మహిళలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ నట్లు తెలిపారు.• సిఎం కేసీఆర్‌ అమలు చేసిన పథకాలు మహిళలకు వరంగా మారాయన్నారు, గత పాలకులెవరూ పట్టించుకొని మహిళాలోకాన్ని టీఆర్‌ఎస్‌ ‌సర్కారు మానవీయ కోణంలో పథకాలు అమలు చేసి అక్కున చేర్చుకున్నదన్నారు. త్వరలోనే సిద్ధిపేటకు అంబికాఅగర్‌ ‌బత్తి ఇండస్ట్రీ తీసుకొచ్చే యోచనలో ఉన్నానని వెల్లడించారు. మీరు చుట్టే బీడీలతో మీకు తెలియకుండానే రోగాలకు గురవుతున్నారన్నారు. బీడీలు చుట్టడం పని పూర్తయిన వెంటనే, బీడీలు చేసిన తర్వాత సబ్బుతో మీ చేతులు కడుక్కోవాలన్నారు. ఆరోగ్యాలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని.. మీ ఆరోగ్యాన్ని కాపాడేందు కోసం తన స్వంత డబ్బులతో బీడీలు చుట్టే ప్రతీ ఒక్క అక్కా, చెల్లెలికి మాస్కులను త్వరలోనే అందజేస్తానన్నారు. మాస్కులు ధరించి బీడీలు చుట్టడం ద్వారా 75 నుంచి 80 శాతం వ్యాధుల బారిన పడకుండా ఉంటామన్నారు. మాస్కులు లేకుండా బీడీలు చుడితే వచ్చే అనారోగ్య సమస్యల గురించి సవివరంగా వివరింవారు. ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు, బీడీలు చుట్టడం అయిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం చేస్తామని మాట ఇవ్వాలని కోరగా.. మహిళలంతా చేస్తామని ప్రతినబూని చెప్పారు. తల్లి చేసిన మేలు వేప చెట్టు కూడా చేస్తదట అంటూ.. ప్రతి ఇంటి ముందు వేప చెట్టు అవశ్యకతను గురించి తెలిపారు. అన్నీ గ్రామాలకు ఇంటికో వేప చెట్టు పంపిస్తానని తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా.. దవాఖానకు పోకుండా ఉండాలని.. అప్పుడే తాను అనుకున్న ఆరోగ్య సిద్ధిపేట అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌రాజనర్సు, తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి రూప్‌ ‌సింగ్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌బీడీ వర్కర్స్ ‌యూనియన్‌ అధ్యక్షుడు రాష్ట్ర మంచే నర్సింలు, మున్సిపల్‌ ‌కౌన్సిలర్‌ ‌నర్సింలు, టిఆర్‌ఎస్‌ ‌కేవీ నాయకులు అరవింద్‌, ‌శోభన్‌, ‌నాగరాజు, మధు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.