వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బీజేపీ లో చేరిన రేవురి

September 4, 2019

తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి చెందిన పాత వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కు చెందిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్  రెడ్డి భారతీయ జనతా పార్టి లో చేరారు. బుధవారం డిల్లీలో బిజెపి కార్యాలయంలో ఆ పార్టి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డ సమక్షంలో రాష్ట్రం లొ రాజకీయ పునరేకికరణ లో భాగంగా బిజెపి లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ రేవూరి..”…తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లో తన పాత్ర ఉన్నందుకు గర్విస్తున్నా….పార్టీలకు,వర్గాలకు సంబంధం లేకుండా అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు….ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిందో,టీఆరెస్ పాలనలో ఆ లక్ష్యాలు నెరవేరలేదు….6 ఏళ్ళు గడుస్తున్నా ఫలితాలు ప్రజల ముందు ఉంచడంలో కేసీఆర్ విఫలం అయ్యాడు….విభజించు పాలించు తరహా పాలన చేస్తూ కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుతింటున్నారు…కేసీఆర్ తన వాక్ చాతుర్యం తో టీడీపీ ని ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేయగలిగారు….కాంగ్రెస్ రోజురోజుకు దిగజారుతుంది…నాయకత్వలేమి కాంగ్రెస్ ని వెంటడుతోంద…..తెలంగాణ లో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది….టీడీపీ ,చంద్రబాబు ల పై నాకెలాంటి వ్యతిరేకత లేదు….బంగారు తెలంగాణ అనే నినాదం మాటలకే పరిమితం అయింది…తెలంగాణ కు అన్ని విధాలా న్యాయం చేసిన పార్టీ టీడీపీ…తెలంగాణ ప్రజలకు టీడీపీ ని కేసీఆర్ దూరం చేయగలిగారు…రాజకీయ పునరేకీకరణ కోసమే బీజేపీ లో అంతర్భాగం అయ్యా….చంద్రబాబే బీజేపీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం అవాస్తవం…” అన్నారు.