వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బీజేపీ ఇచ్చిన హాలను నెరవేరుస్తుంది

April 3, 2019

మమత బెనర్జీ ఓ స్పీడ్‌ ‌బ్రేకర్‌
ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీకాంగ్రెస్‌ ‌ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని, కేవలం ఓటు బ్యాంకు కోసమే ఆ పార్టీ పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో బుధవారం జరిగిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధిని ఆమె అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆమెను ‘స్పీడ్‌ ‌బ్రేకర్‌ ‌దీదీ‘గా అభివర్ణించారు. దారిలో ఆ అడ్డంకిని తొలగించాలని ప్రజలను కోరారు. ఇతర రాష్ట్రాల్లో తాను సాధించినంత అభివృద్ధిని పశ్చిమ బెంగాల్‌లో సాధించలేకపోతున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రానికి ఓ స్పీడ్‌ ‌బ్రేకర్‌ ఉం‌దని, ఆ స్పీడ్‌ ‌బ్రేకర్‌ ‌పేరు దీదీ అని వివరించారు. దీదీ పేదలను పట్టించుకోరని ఆవదన వ్యక్తం చేశారు. పేదరికం అంతమైతే, ఆమె రాజకీయాలు ముగిసిపోతాయన్నారు. సీపీఎం కూడా ఇదే వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ ‌భారత్‌ ఇన్సూరెన్స్ ‌ప్రాజెక్టును దీదీ అడ్డుకున్నారన్నారు. పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజనను కూడా ఆమె అమలు చేయడం లేదని చెప్పారు. మధ్య తరగతి వర్గాలు ఎంతో శ్రమించి, దాచుకున్న డబ్బును రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతారని, వారి సొమ్ముకు రక్షణ, భద్రత కల్పించేందుకు తన ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ ‌రెగ్యులేషన్స్ ‌యాక్ట్‌ను ఆమోదించి, అమలు చేస్తోందని, దీనిని దీదీ పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయడం లేదని చెప్పారు. టీఎంసీ నేతలు పోంజీ స్కామ్స్‌లో కూరుకుపోయారన్నారు. ప్రజలు ఈ స్కీముల్లో దాచుకున్న డబ్బుతో టీఎంసీ నేతలు పారిపోయారన్నారు.
అది మేనిఫెస్టో కాదు.. అబద్ధాల పుట్ట..
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ‌పార్టీ మేనిఫెస్టోపై మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులను మోసం చేసి ఓట్లు అడిగే పార్టీ తమది కాదని అన్నారు. వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామన్నారు. ఈ ఎన్నికలు నమ్మకానికి, అవినీతికి.. నిబద్ధతకు, కుట్రకు మధ్య జరుగుతున్న పోరు అని మోడీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీది అబద్ధాల, కపటపూరిత మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ‌ప్రతిసారి అబద్ధపు హాలే ఇస్తుందని విమర్శించారు. 2009 నాటికి ప్రతి ఇంటికి విద్యుత్‌ ‌సదుపాయం కల్పిస్తామని 2004లో హా ఇచ్చిందని, కానీ 2014 వరకు 18000 గ్రామాల్లో విద్యుత్‌ ‌సదుపాయం లేదని తెలిపారు. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి హాలే ఇస్తోందని అన్నారు. ప్రజలను తెలివితక్కువ వారిని చేసేందుకు అబద్ధాలతో మేనిఫెస్టో తయారుచేసిందని ఆరోపించారు. అది మేనిఫెస్టో కాదు… అబద్ధాల పుట్ట అని ఎద్దేవా చేశారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే ఆ పార్టీ పనిచేస్తుందని అన్నారు. బీజేపీ ఇచ్చిన హాలను నెరవేరుస్తుందని తెలిపారు. ఈశాన్య రాష్టాల్ర అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అరుణాచల్‌‌ప్రదేశ్‌ను తూర్పు ఆసియాకు గేట్‌వేగా మారుస్తామని హా ఇచ్చారు. మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తామని మోడీ తెలిపారు.