పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 24: పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మాజీ సర్పంచ్ దర్శన్ గౌడ్ పెద్ద కుమారుడు, కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ అన్న కాటా రాజేష్ గౌడ్ తన కుటుంబంతో కలిసి పటాన్ చెరుఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాజేష్ గౌడ్ బిఆర్ఎస్ లో చేరడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరింత సమచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, తదితరులు, పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాట శ్రీనివాస్ గౌడ్ సోదరుడు కాట రాజేష్ గౌడ్
