Take a fresh look at your lifestyle.

బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పందించాలి

పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి

బిసిలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో బిసి సంఘాలు చేస్తున్న పోరాటాలకు కాంగ్రెస్‌ ‌పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, బిసిలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేయాలని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్‌ ‌చేస్తుందని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే నిబంధనలతో బిసిలకు పంచాయతీ ఎన్నికలలో కేవలం 22 శాతం రిజర్వేషన్లు కేటాయించారని దీని వల్ల రాష్ట్రంలో వేలాది గ్రామాలలో బిసిలకు పంచాయతీలలో రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయని అన్నారు. ఈ విషయమై తాను ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖ రాశానని బిసిలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించే విషయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని జనాభా లెక్కలు నిర్వహించి బిసిల గణన చేశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తాము ఇప్పటికే కోరామని ఆయన అన్నారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy