Take a fresh look at your lifestyle.

ఐసెట్‌-19 ‌షెడ్యూల్‌ ‌విడుదల

కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంబిఎ, ఎంసిఎ కళాశాలల్లోని సీట్ల భర్తీకి గాను నిర్వహించే తెలంగాణ స్టేట్‌ ఐసెట్‌-19 ‌షెడ్యూల్‌ను శుక్రవారం విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాశాఖ చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌టి.పాపిరెడ్డి విడుదల చేశారు. మధ్యాహ్నం క్యాంపస్‌లోని ఐసెట్‌ ‌కామర్స్ ‌సెమినార్‌హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐసెట్‌-19 ‌చైర్మన్‌, ‌కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌ ‌చాన్స్‌లర్‌ ‌ప్రొఫెసర్‌ ఆర్‌.‌సాయన్న, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ ‌శ్రీనివాస్‌రావు, ఐసెట్‌-19 ‌కన్వీనర్‌ ‌ప్రొఫెసర్‌ ‌రాజేశం, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ‌ప్రొఫెసర్‌ ‌కె.పురుషోత్తంతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 21న ఐసెట్‌-19‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసి మార్చి 7వ తేదీనుండి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. 650 రూపాయలను ఫీజుగా నిర్ణయించామని, ఎస్సీ, ఎస్టీలకు రూ.450 ఫీజు ఉంటుందని ఆయన తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో మే 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, రూ. 2వేల అపరాధ రుసుంతో మే 11వ తేదీవరకు, రూ. 5వేల అపరాధ రుసుంతో మే 15 వరకు, రూ. 10వేల అపరాధ రుసుంతో మే 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడుతాయని ఆయన తెలిపారు. మే 9న విద్యార్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ ‌చేసుకోవచ్చని ప్రొఫెసర్‌ ‌టి.పాపిరెడ్డి వివరించారు. ఐసెట్‌ ‌ప్రవేశ పరీక్షను విద్యార్థుల సంఖ్యను బట్టి 23, 24 తేదీల్లో 3 లేదా 4 సెషన్లలో ఉదయం 10గంటల నుండి 12.30 వరకు, మధ్యాహ్నం 2గంటల నుండి 4గంటల వరకు ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కీని మే 29న విడుదల చేసి దానికి సంబంధించిన అభ్యంతరాలను జూన్‌ 1‌వ తేదీ వరకు స్వీకరిస్తారని తుది ఫలితాన్ని జూన్‌ 13‌న విడుదల చేస్తున్నట్లు ప్రొఫెసర్‌ ‌పాపిరెడ్డి వివరించారు. ఐసెట్‌-19 ‌చైర్మన్‌, ‌కెయు విసి ప్రొఫెసర్‌ ‌సాయన్న మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఐసెట్‌ను ఇప్పటికే ఏడు దఫాలుగా విజయవంతంగా నిర్వహించామని ఇది 8వసారన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా పకడ్బందీగా ఈసారి కూడా ఐసెట్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 14 రీజనల్‌ ‌సెంటర్స్‌ను, 67 టెస్ట్ ‌సెంటర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలుపుతూ విద్యార్థుల డిమాండ్‌ ‌మేరకు పరీక్షా పేపర్‌ ‌తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ ‌భాషలలో ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రంలో సీట్ల సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సీట్ల సంఖ్య ఉంటుందని చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌సాయన్న తెలిపారు. ఐసెట్‌-19 ‌కన్వీనర్‌ ‌ప్రొఫెసర్‌ ‌రాజేశం మాట్లాడుతూ ఐసెట్‌ ‌టెస్ట్ ‌కమిటి మీటింగ్‌ ‌సమావేశం ఉదయం నిర్వహించి పరీక్ష నిర్వహణపై సంబంధిత కళాశాలల నిర్వాహకులకు అన్ని సూచనలు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!