వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘బాబు’ వొస్తారా..?

April 1, 2019

‘ఎన్నికల రాజకీయాల్లో ఆయన తొలి సారిగా అత్యంత కఠినమైన సవాల్‌ ‌ను ఎదుర్కొంటున్నారు. తాను ఏదైనా చేయగలనని ఇంతవరకూ అనుకుంటూ వచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తోంది. తాను అమలు చేసిన కార్యక్రమాలకు తప్పుడు అడ్వర్‌ ‌టైజ్‌ ‌మెంట్లతో ప్రజలను నమ్మించవచ్చని భ్రమ పడుతున్నారని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు., పవన్‌ ‌కల్యాణ్‌ ఆం‌ధ్ర రాజకీయాల్లో అంతు పట్టలేని అంశంగా తయారయ్యారు. ఆయన చంద్రబాబు నాయుడుకు తోడ్పడే రీతిలో ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబునాయుడు సృష్టించిన భయోత్పాతాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రులకు హైదరాబాద్‌ ‌లో రక్షణ లేదనీ, వారిపై దాడులు జరుగుతున్నాయని పవన్‌ ‌కల్యాణ్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఈ కోవకు చెందినవే.‘నినాదాలు ఇవ్వడం సులభం, వాక్‌ ‌చాతుర్యంతో ప్రజలను ఆకర్షించడంమూ అంతే, అయితే, నినాదాల్లో అసంబద్ధత బహిర్గతం అవుతుంది. వాగ్దానాలను నిలబెట్టు కోలేకపోవడమే ఇందుకు కారణం.
ఈ నేపధ్యంలో రాజకీయ విశ్లేషకులు తమ భావనా లనూ,అంచనాలను,వాదాలనూ వెల్లడించే అవకాశం లేదు ఒక వేళ వాళ్ళు అలా చేస్తే, మే 23వ తేదీన ఎవరు అధికారంలోకి వస్తారో తెలుసుకోవడం సులభం. అలాగే., ఏ పార్టీకి ఎన్నెన్ని స్థానాలు వస్తాయో చెప్పడం కూడా సులభమే.
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి వోటర్లు మరింత వాస్తవిక దృక్పథంతో తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. తమకు నచ్చిన అభ్యర్ధులను ఎన్నుకోవడానికి ఈవీఎం బటన్‌ ‌లు నొక్కేందుకు సిద్ధమవుతున్నారు.
ఈసారి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ ఆర్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌ ‌సునాయాసంగా విజయం సాధిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. మరికొందరు చంద్రబాబు ఎలాగైనా తన అధి కారాన్ని నిలబెట్టుకుంటారని అంటున్నారు. అలాగే, 2009లో ప్రజారాజ్యం మాదిరిగా మెగా స్టార్‌ ‌చిరంజీవి తమ్ముడు పవన్‌ ‌కల్యాణ్‌ ‌నెలకొల్పిన జనసేన పార్టీ ఎన్ని వోట్లు చీలుస్తుందోనన్న దానిపై కొందరు అంచనాలు వేస్తున్నారు. మరి కొందరైతే పందాలు కాస్తున్నారు. అందరిలోనూ ఒక ప్రశ్న వినిపిస్తోంది. చంద్ర బాబునాయుడు అధికారాన్ని నిలబెట్టుకుంటారా అన్నదే ఆ ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం వెదకాలంటే, చంద్రబాబు నాయుడు ప్రచారం గురించి విశ్లేషణ చేయాల్సి ఉంటుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం నాడు కర్నూలులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మీద తీవ్రమైన విమర్శలు చేశారు. పూర్వపు తమ మిత్రుడైన చంద్రబాబు నాయుడిని యూ టర్న్ ‌బాబు అని అని అభివర్ణించారు. చంద్రబాబు లక్ష్యం రాష్ట్రాభివృద్ధి కాదని అన్నారు. గురువింద గింజ సామెత వంటివి ఉదహరించి ఉండవచ్చు. కానీ, చంద్రబాబు నాయుడు ఏదైనా సమస్యతో సతమతం అవుతున్నప్పుడు భయంతో వణుకుతారు., రాజకీయ సంప్రదాయాలనూ, ఓరిమిని, విలువలు నైతిక ప్రమాణాలను అన్నింటినీ పక్కన పెట్టేసి మాట్లాడతారు. చంద్రబాబునాయుడుకు యూ- టర్న్‌లు తీసుకోవడం అలవాటు తానే నీతిమంతుడనని చెప్పుకోవడం కూడా అలవాటే.
వాణిజ్య ప్రకటనల్లో పోలికలు ఉంటాయి. నకిలీ అడ్వర్‌ ‌టైజ్‌ ‌మెంట్లు ప్రజలను తప్పుదారి పట్టిస్తాయి. తమ ఉత్పత్తులను ప్రజలు కొనేట్టు వారిని బుట్టలో వేసేందుకు వీలుగా ఉంటాయి అవి. తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆంధ్ర వ్యతిరేకిగా ముద్రపడ్డారు. తాను ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని చేసిన ప్రకటన తప్పుడు అడ్వర్‌టైజ్‌ ‌మెంట్‌లకు ఊపిరి పోసింది. చంద్రబాబు ఓటమి ఖాయమనీ, జగన్‌ ‌ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్‌ ‌ప్రకటించిన దానిని చంద్రబాబు నాయుడు క్యాష్‌ ‌చేసుకోవడం మొదలు పెట్టారు.
ఆంధ్ర పౌరుషం నినాదాన్ని చంద్రబాబు నాయుడు లేవనెత్తారు. చంద్రబాబు నాయుడు ప్రజలను ఆకట్టుకోవడానికి వాక్‌ ‌చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.ఇది చేస్తాను,అది చేస్తానంటూ వాగ్దానాలు చేస్తున్నారు ఈ ఎన్నికలు ఆంధ్రుల పౌరుషం వర్సెస్‌ ఆం‌ధ్రుల వ్యతిరేకత అనే పిలుపు ఇచ్చారు. కేసీఆర్‌ 2014‌లో అధికారంలోకి రావడానికి 2018లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగించిన అస్త్రాన్నే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రయోగిస్తున్నారు. మోడీ- జగన్‌- ‌కేసీఆర్‌ ‌లు ఏకమై ఆంధ్రుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్ర ప్రజల్లో తెలంగాణ వ్యతిరేకతను రెచ్చగొట్టి దానిని వోట్ల రూపంలో మార్చుకోవాలనుకుంటున్నారు. అయితే, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ ‌లో స్థిరపడిన ఆంధ్రులు కేసీఆర్‌ ‌నే తమ నాయకునిగా పరిగణిస్తున్నారు.
అందువల్ల చంద్రబాబు నాయుడు తెలుసుకోవల్సింది ఏమంటే పౌరుషం కాదు, ఆశ .. తమ భవిష్యత్‌ ‌పట్ల ఆశ కలి గించిన వారినే ప్రజలు సమర్ధిస్తారు. రాష్ట్ర స్థాయిలో కెసీఆర్‌, ‌జాతీయ స్థాయిలో మోడీ తమ ఆశలను ఈడేర్ఛ గలరని వారు విశ్వసిస్తున్నారు. కేసీఆర్‌ ‌తెలంగాణకు రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. మోడీ కూడా తిరిగి ప్రధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుల్వామా దాడి తర్వాత సైనికులు జరిపిన మెరుపుదాడిని తన ఖాతాలో వేసుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు.
మరో వంక గతంలో చిరంజీవి ప్రజారాజ్యం వోట్లు చీల్చినట్టే, ఇప్పుడు పవన్‌ ‌కల్యాణ్‌ ‌జనసేన వోట్లు చీల్చగలదని చంద్రబాబునాయుడు తప్పుడు ఎత్తుగడపై ఆధార పడుతున్నారు. జనసేన రంగంలో ఉండటం వల్ల తాను పదవిని నిలబెట్టుకోవడం సులభమని ఆయన అంచనా వేస్తున్నారు.
ఎన్నికల రాజకీయాల్లో ఆయన తొలి సారిగా అత్యంత కఠినమైన సవాల్‌ ‌ను ఎదుర్కొంటున్నారు. తాను ఏదైనా చేయగలనని ఇంతవరకూ అనుకుంటూ వచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తోంది. తాను అమలు చేసిన కార్యక్రమాలకు తప్పుడు అడ్వర్‌ ‌టైజ్‌ ‌మెంట్లతో ప్రజలను నమ్మించవచ్చని భ్రమ పడుతున్నారని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు., పవన్‌ ‌కల్యాణ్‌ ఆం‌ధ్ర రాజకీయాల్లో అంతు పట్టలేని అంశంగా తయారయ్యారు. ఆయన చంద్రబాబు నాయుడుకు తోడ్పడే రీతిలో ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు సృష్టించిన భయోత్పాతాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రులకు హైదరాబాద్‌ ‌లో రక్షణ లేదనీ, వారిపై దాడులు జరుగుతున్నాయని పవన్‌ ‌కల్యాణ్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఈ కోవకు చెందినవే. ఇలాంటి వ్యాఖ్యలు ప్రచారం వల్ల తమకు ప్రయో జనం కలుగుతుందని చంద్రబాబునాయుడు ఆశపడుతున్నారు. కానీ, ఆంధ్ర పౌరుషం అడ్వర్‌ ‌టైజ్‌ ‌మెంట్లకు ప్రజలు ప్రభావితమయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. వైఎస్‌ ‌జగన్‌ ‌మోడీతోనూ, కేసీఆర్‌తోనూ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారంటూ చంద్రబాబునాయుడు అరిగిపోయిన రికార్డులా అదే పనిగా ఆరోపిస్తున్నారు. అన్ని రుగ్మతల నుంచి రక్షణకు తాను ఉన్నానని ఆయన చెబుతున్నారు. తాను ఏర్పాటు చేసుకున్న సాలెగూడులో ఆయన పడుతున్నారు. గత ఏడాది ఆయనకు పాలనా రంగంలో అనుభవం ఉందని ఆయనపై ప్రజలు ఉంచిన విశ్వాసం గడిచిన ఐదేళ్ళ పాలనలో ఫలితాలు ఆశించిన మేరకు లేకపోవ డంతో నీరుగారి పోతోంది. ప్రస్తుతానికి ఆయన తప్పుడు అడ్వర్‌ ‌టైజ్‌ ‌మెంట్లతో సంతృప్తి చెందుతూ ఉండవచ్చు. అయితే, ఈసారి వోటర్లు మాత్రం చాలా దృఢనిర్ణయంతోనే ఉన్నారు. తప్పుడు ప్రచారంతో నమ్మిద్దామని చూస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.

– ఎం శ్రీనివాస్‌ ‌రావు