Take a fresh look at your lifestyle.

బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట

బంగారు తెలంగాణా సాధించటమే లక్ష్యంగా చెప్పుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పెద్దల నుంచి ఇటువంటి స్పందన తెలంగాణా సమాజాన్ని నిస్పృహలోకి నెట్టేస్తుంది. ఇప్పటికైనా సీఎమ్‌ ‌ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలి. మొత్తంగా ఇంటర్మీడియేట్‌ ‌విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్టలాంటి ఇటువంటి ఉదంతాలు పునరావృతం కావనే భరోసా ఇవ్వాలి. నిజాయితీగా చదివిన ఒక్క విద్యార్ధికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలి. కోర్టులు చివాట్లు పెడితే కాని కదలని వైఖరి అనే ముద్ర ప్రభుత్వానికి మంచిది కాదు.ఒకరు కాదు ఇద్దరు కాదు… తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఏ ప్రభుత్వం అయినా, ఏ బోర్డు అయినా అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సిన విధి అది. విద్యార్థుల జీవితానికి ఇంటర్మీడియేట్‌ అం‌టే నాలుగు రోడ్ల కూడలి. వారు ఏం కాదలుచుకున్నారో, ఏ మార్గంలో తమ కలలు పేర్చుకుంటూ వెళ్ళదలుచుకున్నారో తేల్చుకునే సందర్భం అది. అందుకే ఇంటర్మీడియేట్‌ ‌దశ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితంలో కీలకమైంది. కాని ఇంటర్మీడియేట్‌ ‌బోర్డు, అధికారులు, మొత్తంగా తెలంగాణా ప్రభుత్వం ఇంటర్మీడియేట్‌ ‌పరీక్షల నిర్వహణ అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకోవటం అందరిలో నిరాశను, ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కరిమల జూనియర్‌ ‌కళాశాలలో సీఈసీ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన నవ్య అనే విద్యార్ధినికి తెలుగులో సున్నా మార్కులు వచ్చాయి. తాను పరీక్ష బాగా రాసినా, సున్నా మార్కులు రావటమేంటని ఆందోళన చెంది ఈ వార్త సోషల్‌ ‌మీడియాలో విస్త•త ప్రచారం కావడంతో అసలు వ్యవహారం బయటపడింది. ఆమెకు పరీక్షలో 99 మార్కులు వచ్చినా, పేపర్‌ ‌దిద్దిన టీచరమ్మ సున్నాసర్కిల్‌లో బబ్లింగ్‌ ‌చేసింది. పైన ఉండే పర్యవేక్షకుడు కూడా గుడ్డిగా చూడటంతో నవ్య, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనుకావల్సి వచ్చింది. ప్రథమ సంవత్సరంలో టాపర్లుగా నిలిచిన 11 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌ అయ్యారు. కొన్ని చోట్ల విద్యార్థుల మార్కుల స్థానంలో ఇంగ్లీష్‌ అం‌కెలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సాత్విక్‌ అనే విద్యార్థికి ఇంటర్‌ ‌మొదటి సంవత్సరం గణితం 1(ఏ)లో 17 మార్కులు వచ్చాయి. పాస్‌ ‌మార్కులు 27 అయితే 17 మార్కులకే సాత్విక్‌ ‌పాసైనట్టు మార్కుల మెమో చెబుతోంది. అన్ని సబ్జెక్టులు కలిపి 810 మార్కులొచ్చిన ఒక విద్యార్థికి గణితంలో కేవలం 17 మార్కులే వచ్చినట్టు చూపారు. 425 మార్కులు రావాల్సిన ఓ విద్యార్థికి 161 మార్కులే వచ్చాయి. మరో విద్యార్థికి 87 మార్కులు రావాల్సి ఉంటే, 27 మార్కులతో సరిపెట్టారు. కొందరు విద్యార్థులైతే ఏకంగా పరీక్షకు గైర్హాజరైనట్టు అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్లు చూపిస్తున్నాయి. బోర్డు ఇచ్చిన మార్కుల మెమోనే విశ్వసించే తల్లిదండ్రులు తమ పిల్లాడే పరీక్షకు డుమ్మా కొట్టాడేమో అనే అనుమానం వ్యక్తం చేయటంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముంటుంది? దీనితో విద్యార్థులు ఆందోళనకు, ఆవేదనకు గురవుతున్నారు. మెదక్‌ ‌జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌ ‌గ్రామానికి చెందిన చాకలి రాజు అనే 18 ఏళ్ల విద్యార్థి.. అదే గ్రామంలోని పాఠశాలలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ ‌కాలేజీలో సీఈసీ గ్రూప్‌లో ఇంటర్‌ ‌చదివిన రాజు…రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా పరీక్ష ఫలితాలు వచ్చిన వారం, పదిరోజుల్లోనే 18 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. దీనికి బాధ్యత ఎవరిది? పిల్లలే జీవితం అనుకుని, వారి భవిష్యత్తు కోసం అప్పో, సప్పో చేసి చదివిస్తున్న తల్లిదండ్రులకు ఇది జీవిత కాలం శిక్ష కాదా. ఆ కడుపుకోతను ఎవరు తీర్చగలరు?
మూడు లక్షల మంది విద్యార్థులు పరీక్షల్లో తప్పినట్లు చూపిస్తున్న ఈ వివరాలు, అవకతవకలకు కారణం ఏమిటో విచారించే ప్రయత్నం చేస్తే అసలు బాగోతం బయటకు వచ్చింది. ఏమాత్రం అనుభవం లేని గ్లోబరీనా అనే ఓ ప్రైవేటు సంస్థ చేతుల్లో పెట్టారు విద్యార్థుల జీవితాలను. ఈ పరిణామాలతో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యావేత్తలు ఇంటర్మీడియేట్‌ ‌బోర్డు కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగటం, కొంత మంది కోర్టును ఆశ్రయించటం జరిగాయి. ధర్మాసనం కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించింది. వెంటనే రీ వాల్యుయేషన్‌, ‌రీ కౌంటింగ్‌ ‌చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే 8వ తేదీలోగా ఎంత మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారో నివేదిక తన ముందు పెట్టాలని ఆదేశించింది. లక్షలాది మంది విద్యార్ధులకు సంబంధించిన ఈ సంఘటనను అడ్రస్‌ ‌చేయటంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. విద్యాశాఖా మంత్రి అసలు ఈ వ్యవహారం అంతా బోర్డులో అంతర్గత అధికారుల కుమ్ములాట ఫలితంగా పేర్కొనటం ప్రభుత్వ తీరుకు అద్దం పట్టేదే. చిన్న విషయాన్ని తల్లిదండ్రులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొనటం బాధ్యతారాహిత్యం. ఇంత జరుగుతున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను మందలించినట్లు లీక్‌ ‌చేసిన వార్తలు మీడియాలో వచ్చాయి కాని…ఆయన మాత్రం పత్రికా ముఖంగా మీడియా ముందుకు వచ్చి ఈ సమస్యపై స్పందించలేదు. ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి గుర్తించి ఉండాల్సింది. బోర్డు తప్పిదాన్ని హూందాగా అంగీకరించి, చర్యలు చేపడతామని, ఏ విద్యార్థి ప్రాణాలు తీసుకోవద్దని ఓ సందేశం ఇచ్చి ఉంటే …విద్యార్థులకు, తల్లిదండ్రులకు నైతిక ధైర్యం వచ్చి ఉండేది. షాడో సీఎమ్‌గా వ్యవహరించే కేటీఆర్‌ ‌కూడా బోర్డు అవకతవకలపై పెద్దగా స్పందించలేదు. ఆస్క్ ‌కేటీఆర్‌ అం‌టూ సోషల్‌ ‌మీడియా మాధ్యమంగా ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో కూడా ఈ ప్రశ్న ఎదురైతే…ఈ అంశాన్ని వివాదం చేయవద్దు అని సమాధానం ఇచ్చారు కేటీఆర్‌. ‌బంగారు తెలంగాణా సాధించటమే లక్ష్యంగా చెప్పుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పెద్దల నుంచి ఇటువంటి స్పందన తెలంగాణా సమాజాన్ని నిస్పృహలోకి నెట్టేస్తుంది. ఇప్పటికైనా సీఎమ్‌ ‌ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలి. మొత్తంగా ఇంటర్మీడియేట్‌ ‌విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్టలాంటి ఇటువంటి ఉదంతాలు పునరావృతం కావనే భరోసా ఇవ్వాలి. నిజాయితీగా చదివిన ఒక్క విద్యార్ధికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలి. కోర్టులు చివాట్లు పెడితే కాని కదలని వైఖరి అనే ముద్ర ప్రభుత్వానికి మంచిది కాదు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy