Take a fresh look at your lifestyle.

బాగోతమాడెటోళ్ళు…

గిసోంటి బాగోతమే హుజూర్‌నగర్ల షురువయింది. ఎలచ్చన్లయి ఆర్నెల్లయింది. రాజ్జెం యెట్లున్నదో గట్లే వున్నది. రాజ్జంల అందరిసూపు మాత్రం హుజుర్‌నగర్‌ ‌మీదున్నది. ఏ ఎలచ్చన్లచ్చినా గల్లీలల్ల చోటామోటా లీడర్లే తిరిగెటోళ్ళు. ఈసారేందోగని ఏకంగ మంత్రులే మోపయి గల్లీ, గల్లీ పంచుకోని తిరుగబట్టిండ్లు. పేర్లెనుకా ముందు తోకలు యెట్లున్న మాయెగని పాత కొత్త దొరలందరు కల్షిపొయిండ్లు. ఐతే గియితె దొరతనపోడే కుర్సెక్కాలె గని ఇంకొల్లనెట్ల గెలువనిత్తమని దొరలంత ఐకమత్తెంతోని వున్నరు. పొద్దంత ఎవలి రాస్తాలు వాల్లయె గని, జర్రంత చీకటిపడ్డంక మాత్రం మందుల కలిషే సోడా తీరిగె పక్కా ‘దోస్తానే’ నడుత్తాందని అందరన బట్టిండ్లు.మునుపు ఊర్లల్ల యవుసం పనుల్లేని కాలంల బాగోతమాడెటోళ్ళు. వారం, పదిరోజులు తీరొక్కబాగోతమాడుతాంటె మస్తుండేది. దిగూట్ల దీపాలెలిగచ్చి, బుక్కడంత తిని పోయి కూసుంటె తెల్లరిగట్లేప్పుడో కత షెప్పుడొడిషేది. తీరొక్క దేవతలు, కొర్విదయ్యాలు, భూతాలు, రాచ్చసులు, కిరీటాలు,. కత్తులు, గదలూ, మస్తు మజాగుండేది. కత్తితోని మీసాల రాచ్చసుని మెడకాయ్‌ ‌మీది నరకంగనె తలకాయ్‌ ‌తెగి గంత దూరం పడేది. అది గిట్ల చూషిన భయానికి ఈడ గద్దెల మీద కూసున్న పోరగాండ్ల లాగులు తడిషేయి. జడుపు జరాలచ్చేది. రాత్రంత కనేల్‌ ‌కనేల్‌ ‌మని కత్తులు తిప్పి పొడుసుకున్నోళ్ళు తెల్లారంగ ఒకలికొకలు భుజాలమీద చెయ్యేసుకోని ఇకిలిచ్చుకుంట, ఒకలినోట్లె బీడీ ఇంకోలు గుంజుకోని తాగుకుంట సంచులు సర్దు కొని బండ్లెక్కి పోయెటోళ్ళు. వాళ్ళంజూషి ‘‘అరె! రాత్రంత గంతగనం కత్తులతోని పొడుసుకుంటిరి గదా’’! అనుకునెటోళ్ళం.
గిసోంటి బాగోతమే హుజూర్‌నగర్ల షురువయింది. ఎలచ్చన్లయి ఆర్నెల్లయింది. రాజ్జెం యెట్లున్నదో గట్లే వున్నది. రాజ్జంల అందరిసూపు మాత్రం హుజుర్‌నగర్‌ ‌మీదున్నది. ఏ ఎలచ్చన్లచ్చినా గల్లీలల్ల చోటామోటా లీడర్లే తిరిగెటోళ్ళు. ఈసారేందోగని ఏకంగ మంత్రులే మోపయి గల్లీ, గల్లీ పంచుకోని తిరుగబట్టిండ్లు. పేర్లెనుకా ముందు తోకలు యెట్లున్న మాయెగని పాత కొత్త దొరలందరు కల్షిపొయిండ్లు. ఐతే గియితె దొరతనపోడే కుర్సెక్కాలె గని ఇంకొల్లనెట్ల గెలువనిత్తమని దొరలంత ఐకమత్తెంతోని వున్నరు. పొద్దంత ఎవలి రాస్తాలు వాల్లయె గని, జర్రంత చీకటిపడ్డంక మాత్రం మందుల కలిషే సోడా తీరిగె పక్కా ‘దోస్తానే’ నడుత్తాందని అందరన బట్టిండ్లు. ‘‘ఇది చేయి గుర్తోళ్ళ ఇలాకా! అని మాజీ క్యాప్టన్‌ ‌సార్‌ ‌గట్టిగనే జెప్పబట్టిండు. అయినా, వూకుంటమా! అని కార్‌ ‌గుర్తోల్లచ్చి పార్కింగ్‌ ‌జాగ కోసం దేవులాడబట్టిండ్లు. గిన్నేండ్ల తర్వాత బతికచ్చిన సైకోల్‌ను జనం ఇచ్చంతరంగ సూడబట్టిండ్లు.
మునుపు ‘‘దొరా ఏందిరో! దొరతనామేందిరో’’ అని దొరతనం మీద కొడవలి తిప్పిన ఓ ఎర్రన్న రంగెలిషిపోయి ‘‘దొర గడీకాడ కావలి మేమే కాత్తం, మాకన్న మంచిగ కావలి కాషెటోళ్ళెవరున్నరుల్ల’’! అని ముందుకచ్చిండ్లు’’ మర్లబడేటి కంకి కొడ్వలి దొర కాళ్ళకాడ బోర్ల పడేటాలకు సాటుంగ గిట్ల ఏదన్న అలాయిబలాయి కతలు రేవయినయి కావచ్చని జనం అనుకోబట్టె. సుత్తి కొడ్వలి ఎర్రన్నేమో తొడ బరాబరే కొట్టిండు గని కావాల్ననే సప్పుడినిపియ్య కుండ కొట్టిండు. గీ లెక్కన సందుబుట్టె సరికి సుత్తె బట్టిన ఎర్రన్నకు తొడ కొట్టుడే రాదని పంచాయితీల కేలి బయిటికి నూకిండ్లు. ‘‘ఆమ్‌ ఆద్మి టోపోల్లం మేం సూత మాగనే ఊడ్సుడుగిట్ల చేత్త’’ మంటే చీపురు గుంజి బయిటికి ఇషిరిండ్లు. నిజామాబాద్‌ల ‘‘గెలిషిన’’ పసుపు రైతు లిచ్చిన జోష్‌ ‌తోని హుజుర్ననగర్‌ ఎలచ్చన్ల సంగతేందో అర్సుకుందామనుకోని దొర కతలకు మర్లబడ్డ సర్పంచుల సంఘం బయలెల్లింది. గీ ముచ్చట ఎరుకై చమటలు బట్టి, దొరోళ్ళందరు ఏకమై హుజురునగర్ల కాలుబెట్టకముందే వాళ్ళ సంఘం పెద్దనాయకున్ని పొలిమేరన్లే అన్గబట్టి లోపల్కి నూకిండ్లు.ఇందేదుల్ల! గిదెక్కడి అన్నాలెం? అనెవరన్న అడిగిండ్లా?
కార్‌ను గెలిపిత్తె జనం గెలిషినట్టేనట! పుసుక్కున చేయిగెలిత్తె, క్యాప్టన్‌ ‌సారు కుటుంబం గెలిషిట్టేనట గింత సక్కటి సత్తెం జెప్పబట్టె లోకల్‌ ‌గడ్డం మంత్రి సారు. రాజ్జెంల కారును గెలిపిత్తె జనం గెలిషిండ్లా! దొర కుటుంబం గెలిషిందా! గిప్పుడు రాజ్జెంల దొర కుటుంబం తప్ప ఇంకోలెవరన్న కనిపిత్తాండ్లా! దొర కుటుంబానికి ఓట్లేషిన బక్కజనం యాదికున్నరా! రాజ్జెమంత రోగాలు రొష్టులతోని అరిగోసపడ్తాంటె జనాన్ని అర్సుకోవల్షిన మంత్రులందరు హుజురునగర్ల బాగోతమాడ పోతె రాజ్జెమేంగావాలె! దొర రాజ్జాన్ని బొందబెట్టేందుకే జెండా యెత్తినని జెప్పి, పెద్ద సదువులెన్నున్నా పేరుపక్క తోక ఎట్లూపుతె గట్లూగిన పెద్దపంతులే ఆఖరికి చేతుల చెయ్యేషి నడుద్దామని చెప్పె.పెద్దపెద్ద సదువుల సారమెటుబోయెనో యేమో!
‘‘ఎలచ్చన్లంటె దొరలే నిలబడాల్నా! మిగిలినోల్లు జెండాలు మోయాల్నా! ఇంకెంతకాలం గిట్ల రాజ్జెం దొరలే యేలాలె! బహుజనులు గిట్ల బాంచెననాలె’’! అనుకుంట ఏపార్టీ ఎంబటి లేకుంటనే తీన్మార్‌ ‌వార్తలు జెప్పిన విలేకరి సతంత్ర అభ్యర్థిగ హుజుర్నగర్‌ ఎలచ్చన్ల దిగిండు. సబ్బండవర్ణాల అండదండ లుంటయని అడుగైతె యేశిండు. వోటేసుడే కాదు, చాయితాగే పైసలు సూత ఇచ్చి, గెలిపియ్యాలె! అనడగబట్టె! గీ ఆలోచన పెద్దగనే వున్నది గని, అనుభవం కానత్తలేదని జనం అనుకోబట్టె.
‘‘ఎలచ్చన్లేవైనా గెలిషేది మేమే’’! అని ఇనేటోళ్ళకు తుపాకి రామునికతలు జప్పే దొర జరింత దైర్నం తెచ్చుకోని హుజుర్నగర్ల బతుకమ్మను నిలబడ్తె, గెలిషేదుండె! ఇంట్ల ఇంకో మంత్రి కొలువచ్చేదుండె! ఓడుతమన్న భయమే లేకపోతె ఎర్రన్నల కాళ్ళెందుకు బట్టుకున్నరో తెల్వాలె గద! గెలిషినొక్కన్ని గుంజుక పోయిండ్లన్న ఇచారం లేకుంట కంకికొడ్వలోల్లు ‘‘చారిత్రక తప్పిదాలు’’ చేసుడింక మర్వకపాయె! చేతి గుర్తోళ్ళకు జైకొట్టిండ్లు. పేరెనుకున్న తోకనుబట్టే నడిషి పెద్ద పంతులు తెలంగాణ చరిత్రల అసలు రంగు బయటేసుకున్నట్టేనాయె! ఉత్తరదేశం పూలు దచ్చినాన పూసుడు మొదలయిందని జరంత ఆశపెంచుకోని హుజుర్నగర్ల అదృష్టం సూసుకుంటె ఓపాలి యేమయితది గని! అనుకుంట ఒల్లెక్కాలకు దిగితె వద్దనేదెవరు!
ఎవరు గెలిషినా, ఎవరు ఓడినా గరీబోళ్ళభూములు ఆగమవుడు ఎవరాపినా ఆగేదికాదని, అందరికందరు ఎకురాల కొద్ది భూముల మీద దస్తీ యేషి నిలవడ్డరు. ఇప్పుడక్కడ గెలుసుడు అందరికి అవసరం. పెద్దోల్లంత జెండాలు, ఎజెండాలు పక్కకు బెట్టి ఐకమత్తెంతోని పంచుకునుడే మిగిలిందని జనం జెప్పే గోస ఎవరినాలె! పంపకాల పంచాతులు మొగ్గలేషినయని తెలిషే కతలు కానత్తనే వుండె. లోకల్‌ ‌మంత్రి ఏరియాలకు మండలి అధ్యక్షుడు వచ్చి పాత దోస్తుల తోని కలిషిండని పెద్ద లొల్లోటి అయింది. గీ పంచాతి గవర్నరమ్మ దాంక పొయింది. ఒక్క పార్టోల్లే పంచాయితీలకు దిగుతాంటె జనం గోసకు బలం పెరుగదా యేంది!
మాయబజార్‌ ‌సిన్మాల సత్తెపీటం తీరిగె హుజుర్‌నగర్‌ ఎలచ్చన్లు అన్ని జెండాల అసలు రంగేందో భూతద్దంల పెట్టి జూపుతాంది. దేనికి లేని బలం అగ్గికుంటది. గింతంత అగ్గిపుల్ల సాలు, అంటుకుంటె ఎంత పెద్ద అడివైనా సరె ఊరెనుకూరు కాలి బూడిదయితయి. గీ హుజుర్‌ ‌నగర్‌ అం‌దరికి అగ్గిపరీక్ష తీరిగె మోపయిందని జనం అనుకోబట్టె!
సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్
‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా! ఎలక్షన్లు ఏవైనా గెలుపు గుర్రం మాదే అనుకునే దొర ఎందుకు ఎర్రన్నల గల్మ తొక్కిండు? ఇదివరకు పెనివిటి గెలిషిన కాడ ఇప్పుడు ఇంటామె గెలుసుడున్నదా! లేదా? పేరెనుక తోక ఎట్లాడిపిత్తె అట్లాడిన ప్రొఫెసర్‌ ‌సారు రేపు జనం మద్దెల ఎట్ల తిరుగుతడు? గీ పశ్నలకు జవాబులు చెప్పకుంటె డెంగీ జరమచ్చి పిడాతసత్తవు! తర్వాత నీయిష్టం’’ అన్న భేతాళ్‌ ‌బెదిరింపుని ‘‘అపరిచితుడి తీరిగె దొర లోపల ఇద్దరుంటరు. రొండు మాటలుంటయి. రాత్రిపూట చెప్పింది పొద్దున జెప్పడు. పొద్దున జెప్పింది రాత్రిపూట జెప్పడు. రొండు మాటలేకమై ఒకటే మాట జెప్పినంక గెలుపు మీద భయముండదా! అందుకే తొక్కరాని గల్మ తొక్కక తప్పలేదు. రొండోది.రహస్య స్నేహాలతోని లాభాలు ఎక్కువుంటె గెలుసుడు తోని లెక్కలెందుకు! ఆఖరుది.మాటలల్లనే అభ్యుదయం, చేతలల్ల డొల్లతనం మీద నిలదీసెటోళ్ళు సార్‌ ‌కోసం ఎదురుసూత్తాండ్లు! అని మనుసులనుకుంట ఆలోచించుకుంట.. భేతాళుని శవాన్ని భుజాన ఏసుకోని నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు.

– ఎలమంద, తెలంగాణ

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy