వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బహిరంగకు భద్రత ఏర్పాట్లు పూర్తి

April 2, 2019

పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నగరంలోని మిల్స్‌కాలనీ మైదానంలో జరుగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభ, హెలిప్యాడ్‌ ‌ప్రాంతంలో భద్రత ఏర్పాట్లపై సోమవారం రాత్రి వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌రవీందర్‌ ‌పోలీస్‌ అధికారులతో పర్యవేక్షించారు. అనంతరం బందోబస్తు విధులు నిర్వహించే పోలీస్‌ అధికారులు, సిబ్బందితో పోలీస్‌ ‌కమిషనర్‌ ‌ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పోలీస్‌ ‌కమిషనర్‌ ‌మాట్లాడుతూ ముఖ్యమంత్రి హెలీప్యాడ్‌ ‌నుండి బహిరంగ సభ వరకు ప్రయాణించే సమయంలో రోడ్డు మార్గంలో ఎలాంటి వాహనాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను సూచించిన విధంగా సెక్టార్‌ ‌వారీగా పార్కింగ్‌ ‌చేయించాల్సిన బాధ్యత సంబంధిత పోలీస్‌ అధికారిపై ఉందన్నారు. వీరిని పార్కింగ్‌ ‌ప్రాంతాల్లో దిగి నేరుగా సభ ప్రాంతానికి వెళ్ళేవిధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ‌సూచించారు.