- బిజెపి ఇందిరాపార్క్ ధర్నాపై మండిపడ్డ
- కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంఎల్‌సి జీవన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : ఫోన్ ట్యాపింగ్ అంశంపై జరుగుతున్న దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు బీజేపీ యత్నిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌ను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందన్నారు. కెసిఆర్‌ను రక్షించడమే బిజెపి లక్ష్యంగా ఉందని శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో అన్నారు. బిజెపి ఇందిరాపార్క్ ధర్నాపై మండిపడ్డ జీవన్ రెడ్డిఈ కేసులో విచారణ జరుగుతున్న క్రమంలో కావాలనే బిజెపి ధర్నాకు దిగిందని కాంగ్రెస్ నేత కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాకుండా ఉన్నంత వరకు బీజేపీ ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించిందని తెలిపారు.
ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుందని, మరిన్ని కీలక విషయాలు త్వరలో వెలుగులోకి వొస్తాయని చెబుతున్నట్లు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ సహకరించిందన్న జీవన్ రెడ్డి.. అందుకు ప్రతిఫలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కేసీఆర్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అందుకే ఈ అంశంపై నిరసనలు చేపట్టారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారన్నారు.
హాస్పిటళ్లను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్