వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

“ఫేక్ ” కథనం ..!

April 1, 2019

‘డీసీ’ క్షమాపణ చెప్పాలి : మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్
భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టు ఒక ఆంగ్ల దిన పత్రికలో వొచ్చిన కథనం పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు . సామాజిక మాధ్యమాల్లో అసత్యపు (ఫేక్ ) వార్తల పై ఒక వైపు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా తన పై తప్పుడు , అసత్యపు కథనాన్ని ప్రచురించిన ఆ పత్రిక క్షమాపణ చెప్పాలని ట్వీట్ చేశారు . తప్పుడు వార్త కు క్షమాపణ చెప్పుతూ ఈ రోజు ఎడిషన్ లో అదే స్థానంలో ప్రచురించాలని డిమాండ్ చేశారు .