Take a fresh look at your lifestyle.

ఫెమినిస్ట్ ‌పిశాచినీ ముక్తి పూజ..!

భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తి స్త్రీవాదం. ఆ దుష్టశక్తిని తరిమేయమని ‘‘ఫెమినిజం పిశాచిని ముక్తి పూజ’’ నిర్వహించి పిండప్రదానం చేశాయి. ఇదేదో సరదాగా ఆషామాషీగా చేసింది కాదు. చాలా సీరియస్‌గా జరిగిన వ్యవహారమే. హిందూ మత సంప్రదాయాల్లో చనిపోయిన వారికి పిండం పెట్టడం మనకు తెలిసిందే. పిండం ఎందుకు పెడతారు..? మరణించిన దేహంలోని ఆత్మకు తృప్తి కలిగించడం కోసం పునర్జన్మ లేకుండా ఉండడం కోసం ఆ విధంగా చేస్తారని మనకు తెలుసు. ఇప్పుడు జరిగిన పూజ ఫెమినిజం అంటే స్త్రీవాదానికి పిండం పెట్టారు. మళ్ళీ అది పుట్టకూడదని దానికి పిండం పెట్టారు.‘‘ఫెమినిస్ట్ ‌పిశాచినీ ముక్తి పూజ’’ గురించి మీరెప్పుడైనా విన్నారా ..?
నేనయితే గతంలో ఎప్పుడూ వినలేదు. కానీ ఇప్పుడిదో కొత్త పూజ. ఈ పూజ గురించి రెండురోజుల క్రితం విన్నాను. ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తలు చూశాను. ఆశ్చర్యంతో పాటు భయాందోళనలకు గురయ్యాను. అందుకే ఆ విషయం మీ అందరితో ముచ్చటిద్దామని మీ ముందుకొచ్చాను.
అసలు విషయానికొస్తే, ‘‘సేవ్‌ ఇం‌డియన్‌ ‌ఫామిలీ’’ అనే సంస్థ ఒకటి ఉంది. లింగ సమానత్వం, కుటుంబ సామరస్యం పెంపొందించడానికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న స్వచ్ఛంద సంస్థ ఇది. ఈ సంస్థకు మరో 40 సంస్థలు తోడయ్యాయి. సేవ్‌ ఇం‌డియన్‌ ‌ఫామిలీ మూవ్మెంట్‌ ‌మొదలుపెట్టాయి. అంత వరకూ అయితే బాగానే ఉండేది. కానీ అవేం చేశాయో తెలుసా…
సెప్టెంబర్‌ 22 ‌వతేది మధ్యాహ్నం 12.30 నిముషాలకు బెంగుళూర్‌లో ఒక పూజ నిర్వహించాయి. సరిగ్గా అదే సమయంలో దేశంలోని 50 ప్రాంతాల్లో అదే పూజ నిర్వహించాయి. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తి స్త్రీవాదం. ఆ దుష్టశక్తిని తరిమేయమని ‘‘ఫెమినిజం పిశాచిని ముక్తి పూజ’’ నిర్వహించి పిండ ప్రదానం చేశాయి. ఇదేదో సరదాగా ఆషామాషీగా చేసింది కాదు. చాలా సీరి యస్‌గా జరిగిన వ్యవహారమే. హిందూ మత సంప్రదా యాల్లో చనిపోయిన వారికి పిండం పెట్టడం మనకు తెలిసిందే. పిండం ఎందుకు పెడతారు..? మరణించిన దేహంలోని ఆత్మకు తృప్తి కలిగించడం కోసం పునర్జన్మ లేకుండా ఉండడం కోసం ఆ విధంగా చేస్తారని మనకు తెలుసు. ఇప్పుడు జరిగిన పూజ ఫెమినిజం అంటే స్త్రీవాదానికి పిండం పెట్టారు. మళ్ళీ అది పుట్టకూడదని దానికి పిండం పెట్టారు.
భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్న స్త్రీవాదం పూర్తిగా అంతం అయ్యేవరకూ ఈ పూజలు నిర్వహిస్తామని సేవ్‌ ఇం‌డియన్‌ ‌ఫామిలీ కర్ణాటక ప్రతినిధి అంటున్నారు. కాన్సర్‌ ‌కంటే భయంకరమైన వ్యాధి ఫెమినిజం పిశాచి. సమాజంనుండి సమూలంగా పోవాల్సిన అవసరం ఉంది. దుష్టశక్తి నుండి రక్షించేందుకు గత ఏడాది కూడా ఈ పూజ నిర్వహించాం. భవిష్యత్తులోనూ నిర్వహిస్తాం అంటున్నాడతను. భారతదేశంలో కుటుంబాలు విచ్చిన్నం కావడానికి, దంపతులు విడిపోవడానికి కారణం స్త్రీవాదం. కుటుంబ బంధాలను నాశనం చేసే ఫెమినిజాన్ని తరిమి కొట్టాల్సిందే. తీవ్ర వేధింపులకు, హింసకు గురయ్యే భారతీయ పురుషులు అన్ని రకాల దుష్టశక్తుల్ని పారదోలేందుకుకు కలసికట్టుగా నిర్వహించుకున్న పూజ పిశాచినీ విముక్తి పూజగా చెప్పుకొచ్చారు.
మనదేశంలో స్త్రీవాదం లింగ సమానత్వం కోసం కాక, మహిళల ఆధిపత్యం కోసం పురుషులను అణచివేయడం కోసం మాత్రమే ఉందన్నారు. కుటుంబంలో ఎటువంటి బాధ్యతలు తీసుకోకుండా హక్కుల కోసం మాత్రమే ఫెమినిస్టులు శ్రద్ధ తీసుకుంటున్నారని అతని ఆరోపణ. లింగ సమానత్వానికి ఏమాత్రం దోహదం చేయకపోగా ఎంతో హాని చేస్తున్న రాక్షసి మీ టూ మూవ్‌ ‌మెంట్‌ అం‌టూ సేవ్‌ ఇం‌డియన్‌ ‌ఫామిలీ కర్ణాటక ప్రతినిధి ఓ ఆంగ్ల వెబ్‌ ‌సైట్‌కు తెలిపారు. ఫెమినిజం బారిన పడిన బాధితుల కోసం ఒక హెల్ప్ ‌లైన్‌ ‌నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పూజ కంటే ముందే ఒక పోస్టర్‌ ‌విడుదల చేసింది సేవ్‌ ఇం‌డియన్‌ ‌ఫామిలీ సంస్థ. మీ టూ పేరుతొ అమాయక మగవాళ్ళని కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారని, డిజిటల్‌ ‌మూక దాడిలో బాధితులుగా మారుతున్నారని పోస్టర్లో రాశారు. కాల గమనం ఎటు .. ముందుకా.. వెనక్కా .. ముందుకే కదా ..! నీటి ప్రవాహం ఎటు పరుగుతీస్తుంది .. ? ముందుకా .. వెనక్కా .. ముందుకే కదా ..! మరి మనిషి ప్రయాణ దిశ ఎటు వైపు ముందుకా..వెనక్కా .. ముందుకే నడవాలి. అది సహజం కదా .. !
కానీ మనిషి కాలగమనంలో దాటి వచ్చిన దిశకు మరలాలని ఎందుక నుకుంటు న్నాడు? ఎన్నెన్నో సం• •హాలు తొలు స్తూ ఉంటే ఇలా మీ ముందుకు వచ్చాను. ఈ పోస్టుకు కారణం రెండురోజుల క్రితం ఓ మిత్రుని నుండి అందుకున్న ఒకా నొక పోస్ట్. అది నన్ను షాక్‌కి గురి చేసింది. తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఆషామాషీగా తీసుకో కుండా అప్రమత్తం అవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. సమాన గౌరవం కోసం, సమాన వేతనం కోసం, లింగ సమానత్వం కోసం, ఆర్థికంగా, సామాజికంగా, భావో ద్వేగ పరంగానే కాదు అభివృద్ధిలో సమానత్వం, సమభాగ స్వామ్యం కావాలని సమాన హక్కులు కావాలని ప్రపంచ వ్యాప్తంగా పోరాడుతున్నది మహిళాలోకం. అదే విధంగా ఇంటాబయటా లైంగిక వేధింపులు, హింస, అత్యాచారాలు లేని సమాజాన్ని ఆకాక్షింస్తూ అందుకోసం కృషి చేస్తున్నది ప్రపంచ మహిళ. మనదేశంలోనూ మహిళలు తమ పోరాటాల ద్వారానే , ఉద్యమాల ద్వారానే కొన్ని హక్కులైనా సాధించు కోగలిగారు. చట్టాలు తెచ్చుకోగలి గారు.
అయినప్పటికీ ఇప్పటికీ దేశంలో ఏ మూలకెళ్లినా అర్ధరా త్రికాదు పట్టపగలైనా ఒంటరి మహిళ కనిపిస్తే ఆమె క్షేమముగా ఇంటికి చేరుతుందన్న నమ్మకం లేదు. వారిని చెరబట్టే కీచకులకు కొదువలేదు. అత్యాచారాలు ఆగడంలేదు. భ్రూణ హత్యలు ఆగలేదు, వరకట్న హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి, సమాన పనికి సమాన వేతనం అందడం లేదు , ఉపాధి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, నిర్ణయాధికారం, నిర్వహణాధి కారం, రాజకీయ అధికారం ఇలా ఎందులో చూసినా మహిళలు సమాన స్థాయికి ఆమడ దూరంలోనే ఉన్నారు. వారి రక్షణ అందని ద్రాక్షపండు చందంలా ఉంది.
చేసుకున్న చట్టాల అమలులో అనేకానేక అవరోధాలు. ఇబ్బందులు. చట్టంలో ఉన్న లొసుగులతో దోషులు కాలరెగరేసుకుని తిరగుతూనే ఉన్న వ్యవస్థలో ఉన్నాం మనం. ఇక భవిష్యత్‌ ఎలా ఉంటుందో..
చెదపురుగులాగా విస్తరిస్తున్న స్త్రీవాద వ్యతిరేకులు మహిళల స్థితిగతుల్ని ఏ విపత్కర స్థితిలోకి నెట్టేస్తారో.. దుష్టశక్తుల ఏరివేత పేరుతో ఎంత విషం కక్కుతారో.. జనాలకు ఎంత విషం ఎక్కిస్తారో..
ఏదేమైనా స్త్రీ పురుష సమానత్వం ఆశించే ప్రతి ఒక్కరూ జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్త గమనిస్తూ రాబోయే పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి.
– వి. శాంతి ప్రబోధ

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy