వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఫామ్‌ ‌హౌస్‌కే కేసీఆర్‌ ‌పరిమితం.

August 29, 2019

  • తెలంగాణలో బీజేపీ పాలన ఖాయం
  • బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ 

రాబోయేరోజుల్లో తెలంగాణలో బీజేపీ అధి కారంలోకి వస్తుం దని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగు తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన బీజేపీ సభలో పాల్గొనిప ప్రసంగించారు. దేశానికి నరేంద్రమోడీ నాయకత్వం అవసరం ఉందనే నేడు బీజేపీలోకి నాయకులు వస్తున్నారని లక్ష్మణ్‌ అన్నారు. కల్వకుంట్ల కుటుంబ సేవలోనే నాయకులు గడుపుతున్నారని, తెలంగాణలో తప్పక బీజేపి అధికారం లోకి వస్తదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా కమల వికాసమేని అన్నారు. ఫామ్‌ ‌హౌస్‌ ‌కే పరిమితమైన కేసిఆర్‌ ‌బంగారు తెలంగాణ ఎలా నిర్మాణం చేస్తారని లక్ష్మణ్‌ ‌ప్రశ్నించారు. ఎందరో అమరుల బలిదానాలుపై ఏర్పడిన తెలంగాణ ను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అధికారంలో ఉన్నామని విర్రవీగితే, దేశంలో 18 రాష్టాల్ల్రో మేమూ అధికారంలో ఉన్నామని కేసీఆర్‌ ‌గుర్తుంచుకోవాలని లక్ష్మణ్‌ ‌సూచించారు.  ఇప్పుడు జరిగేదంతా సినిమా విడుదలకు ముందు ట్రైలెర్‌ ‌మాత్రమేనని, అసలు సినిమా ముందుంది లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని బట్టబయలు చేసి ప్రజలముందు ఉంచుతామని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలేదంటూ లక్ష్మణ్‌ అ‌గ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ ‌నిజాం నవాబ్‌లా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం భాజపాకే సాధ్యమన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చిన కేసీఆర్‌ అధికారం చేపట్టిన తర్వాత ఎందుకు విస్మరించారని లక్ష్మణ్‌ ‌ప్రశ్నించారు. తెలంగాణ సాధనలో భాజపా కీలకపాత్ర పోషించిందని లక్ష్మణ్‌ అన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటే తప్పకుండా నిర్వహిస్తామని కేంద్ర •ంశాఖ మంత్రి అమిత్‌ ‌షా తెలిపినట్లు లక్ష్మణ్‌ ‌చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.