వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ ‌పరిచయం..

August 29, 2019

జడ్చర్లలో బాలిక దారుణ హత్య
హంతకుడు నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

ఫేస్‌బుక్‌ ‌పరిచయం ఓ మైనర్‌ ‌బాలిక  హత్యకు దారి తీసింది. జడ్చర్ల మండలం శంకరాయపల్లి వద్ద పదో తరగతి విద్యార్థినిపై ఓ దుండగుడు బండరాయితో మోది హత్యచేశాడు. ఫేస్‌బుక్‌ ‌పరిచయమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ధృవీకరించారు. జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రవిశంకర్‌ అనే ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె హర్షిణి (15) టెన్త్ ‌క్లాస్‌ ‌చదువుతోంది. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా జడ్చర్ల హౌసింగ్‌బోర్డులో నివాసముంటున్నారు. ఆమెకు రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామానికి చెందిన నవీన్‌రెడ్డితో మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నవీన్‌రెడ్డి కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి ఇద్దరు ఫోన్‌ ‌నెంబర్లు మార్చుకొని తరచూ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న నవీన్‌ ‌రెడ్డి జడ్చర్లకు వచ్చాడు. హర్షిణికి ఫోన్‌ ‌చేసి, బయటకి వెళ్దామని పిలిచాడు. అనంతరం ఆమెను కారులో శంకరాయపల్లిలోని నిర్మానుష్మ ప్రాంతానికి తీసుకెళ్లి, మాయమాటలు చెప్పి, లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. హర్షిణి తీవ్రంగా ప్రతిఘటించడంతో బండ రాయితో మోది దారుణంగా హత్యచేశాడు. అదేరోజు సాయంత్రం వరకు హర్షిణి ఇంటికి రాకపోవటంతో కంగారుపడిన తల్లిదండ్రులు తమ కూతురు అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బంధువులు, స్నేహితుల ఇండ్లలో ఆరా తీశారు. అయినా హర్షిణి ఆచూకి తెలియకపోవటంతో పోలీసులు హర్షిణి నివాసం సపంలోని సీసీ కెమెరాల్లో నమోదైన రికార్డులను పరిశీలించారు. ఈ సీసీ పుటేజుల్లో హర్షిణీని నవీన్‌ ‌రెడ్డి తీసుకెళ్లినట్లు తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గురువారం ఉదయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హర్షిణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హర్షిణి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, నిందితుణ్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హా ఇచ్చారు.