Take a fresh look at your lifestyle.

ప్రాంతీయ పార్టీల్లో ఆత్మగౌవరం డొల్లేనా..?

టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఆయన తిరుగులేని శక్తి. చంద్రశేఖర్‌ ‌రావు మాటే శాసనం.ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కేసీఆర్‌ అల్టిమేట్‌.  ‌రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటకు తిరుగులేకుండా పోయింది. ఆయన కూడా ఎవరి మాటలను పట్టించుకోవడం లేదు.ఇలాంటి వాతావరణంలో టీఆర్‌ఎస్‌ ‌నాయకులు కొంత ఉక్కబోతను అనుభవిస్తున్నారు. అందులో ఉండలేక, బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనేక రకాల అసంత్రుప్తులు వారిని వెంటాడుతున్నప్పటికి మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో నియంత్రుత్వ ధోరణులు మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం.పేరు డెమెక్రసీ అయినప్పటికి ప్రాంతీయ పార్టీల వాహ ఫలితంగా రాజకీయ భావన ప్రకటనా స్వేచ్ఛ పెద్దగా కనిపించడం లేదు.  కుటంబ పార్టీలు వేళ్లూనుకుపోయిన తర్వాత వ్యక్తి పూజ పెరిగిపోయి ప్రజాస్వామ్యానికి కొత్త అర్థాలు మొదలయ్యాయి. వ్యక్తి చుట్టు అధికారం, రాజకీయాలు పరిమితం కావడం పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి.కను సైగలతో అధినేతలు పార్టీలను, వ్యవస్థలను నడిపిస్తున్నారు.తమ మాటే శాసనం అన్నట్లుగా ప్రజాస్వామ్యం తయారైంది. వ్యక్తి పూజ ఫలితంగా ఆత్మగౌరవం మాటే కరువైంది. ప్రాంతీయ పార్టీల పోకడలు ప్రమాదకరంగా తయారౌతున్నాయి. జాతీయ భావజాలం, విశాల ద్రుక్పథం  అన్న  మాటలు కనిపించకుండా పోతున్నాయి. సిద్దాంత రాజకీయాలను పక్కన పడేసి వ్యక్తిగత అభిప్రాయాలకు పెద్ద పీఠ వేస్తు అధి నాయకుడు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఫలితంగా బడుగు,బలహీన వర్గాల గొంతులు మూగబోతున్నాయి. ఆత్మగౌరవం అన్న మాటకు విలువే లేకుండా పోతోంది. ప్రాంతీయ పార్టీల్లో ఈ ధోరణి రోజు రోజుకు పెరుగుతోంది. గొంతు వినిపించే నాయకుడు గతంలా మిగిలిపోతున్నారు. తమ హక్కుల గురించి మాట్లాడే వారు రాజకీయంగా హరించుకుపోతున్నారు. ఆధిపత్య ధోరణిని ప్రశ్నించే వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. మనసు విప్పితే ఇక తట్టా బుట్టా సర్ధుకోవాల్సిందే. పార్టీయే సుప్రీం అంటు  అణగదొక్కేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి సంఘటనలు, కను మరుగైన నాయకులను ఎంతో మందిని చూశాం. నోరు విప్పన హేమా హేమీలు, మహమహులు ఆ తర్వాత మూగబోయిన ఘటనలు కుప్పలు తెప్పలు. తమ కుటుంబ ఆస్తిగా పార్టీలను పరిగణించే నాయకత్వం మరో గొంతును వినడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు.
ఇటీవల టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఈ కోవకు చెందినవే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆ లక్ష్యాన్ని సాధించి సంపూర్ణ రాజకీయ పక్షంగా అవతరించింది.  రెండు సార్లు అధికారాన్ని అందుకొని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పుడు బలమైన నాయకుడు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఆయన తిరుగులేని శక్తి. చంద్రశేఖర్‌ ‌రావు మాటే శాసనం.ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కేసీఆర్‌ అల్టిమేట్‌.  ‌రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటకు తిరుగులేకుండా పోయింది. ఆయన కూడా ఎవరి మాటలను పట్టించుకోవడం లేదు.ఇలాంటి వాతావరణంలో టీఆర్‌ఎస్‌ ‌నాయకులు కొంత ఉక్కబోతను అనుభవిస్తున్నారు. అందులో ఉండలేక, బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనేక రకాల అసంత్రుప్తులు వారిని వెంటాడుతున్నప్పటికి మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం తమ బాధను పంటి బిగువన భరిస్తున్నారు.  పార్టీ చూడటానికి బాగానే కనిపిస్తున్నప్పటికి లోలోన మాత్రం కొందరు కుంగిపోతున్నారు. తమకు ఇష్టం లేని వారిని పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తుందనే భావన కనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న మంత్రి ఈటెల రాజేందర్‌ ఉదంతం ఇందులో ఒకటి. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ ‌నాయకుడిగా క్రియాశీలక పాత్ర పోషించారు ఈటెల రాజేందర్‌. ‌ఫలితంగా కేసీఆర్‌ ‌తన మంత్రి వర్గంలో ఆయనకు కీలక శాఖను అప్పగించారు. దీంతో పాటే టీఆర్‌ఎస్‌ ‌లో ముఖ్యనాయకుడిగా కూడా ఈటెల చెలామణి అయ్యారు. అయితే ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడంతో పాటు కేసీఆర్‌ ‌కుటుంబ పాత్ర ఎక్కువ కావడంతో ఆయనకు ప్రాధాన్యత తగ్గింది.  ఉద్యమ నాయకుడిగా చంద్రశేఖర్‌ ‌రావుతో ఉన్న అనుబంధం ముఖ్యమంత్రి అయ్యాక బాగా తగ్గిపోయింది. గత రెండేళ్లుగా  ఈటెల ప్రాధాన్యత మరింత క్షీణించడంతో ఆయన మౌనాన్నే ఆశ్రయించారు.రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత మంత్రి వర్గంలోకి ఈటెలను తీసుకునే విషయంలో కేసీఆర్‌ ఒకటికి రెండు సార్లు ఆలోచించారన్న విషయం బయటకి రావడంతో ఆయన పరపతి తగ్గిపోయింది. రకరకాల కారణాల వల్ల ఈటెల రాజేందర్‌ ‌సి.ఎం కేసీఆర్‌ ‌కు బాగా దూరమయ్యారు. తాజాగా ఆయనను మంత్రి వర్గంలో నుంచి తొలగిస్తారనేంత వరకు పరిస్థితి వచ్చింది. ఈటెల వ్యవహర శైలిపైన రెండు పత్రికల్లో కథనాలు రావడంలో వాటిపైన ఆయన లోలోన రగిలిపోయారు.  తన బాధను ,ఆవేశాన్ని ఎక్కువ రోజులు గుండెల్లో పెట్టుకోలేకపోయిన ఆయన చివరకు వెల్లగక్కారు. అవి సూటిగా కేసీఆర్‌ ‌కు తాకడంతో పరిస్థితి మరింత అదుపుతప్పింది.పదవులు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటు కేటీఆర్‌  ‌కూడా పరోక్షంగా స్పందించడంతో రాజేందర్‌ ‌కు గుడ్డు రోజులు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఆయన టీఆర్‌ఎస్‌ ‌లో ఒంటరిగా మిగిలిపోవడం ఖాయమన్న వాతావరణం కనిపిస్తోంది. నిజానికి ఈటెల సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. మాట్లాడేటప్పుడు కూడా కొంత ఆచితూచి స్పందిస్తారు. కాని కేసీఆర్‌ ‌వ్యవహరశైలి మీద ఆయన గత కొన్నాళ్లుగా సన్నిహితుల వద్ద అసంత్రుప్తి వ్యక్తం చూస్తేనే ఉన్నారు. అది అధినాయకత్వానికి చేరడంతో ఆయన పరిస్థితి ఇరకాటంలో పడింది. ఈటెల రాజేందర్‌ ‌భవిష్యత్తు ఏమిటి అన్న చర్చ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ‌తో పాటు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆయన గులాబీ పార్టీని వదిలిపెట్టడం ఖాయమన్నంత రీతిలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు పరిస్థితి అంతదూరం వెళ్లకపోవచ్చు. ఈటెలను కేసీఆర్‌ ఇలాగే దూరం పెడితే మరికొంత కాలానికి ఆత్మగౌరవ నినాదంతో ఆయన బయటకు వెళ్లాల్సి  వస్తుంది.

ఇలాంటి సంఘటనలు ఒక్క టీఆర్‌ఎస్‌ ‌లో కాదు అనేక ప్రాంతీయ పార్టీలో వందల సార్లు జరిగాయి. సొంత పార్టీలో తన మాటే చెల్లుబాటు కావాలని నాయకత్వం కోరుకోవడం అత్యంత సహజం. తన నీడన బతుకుతు తమనే ఎదిరించే వారిని ఎవరూ సహించరు.  ఏదో రకంగా పొగ పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసి పంపించేస్తారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఆలె నరేంద్ర, విజయశాంతి తో పాటు చాలా మంది ముఖ్యనేతలు కేసీఆర్‌ ‌దగ్గర ఇమడ లేక వెళ్లిపోయారు. తెలుగుదేశంలో కూడా డజన్ల కొంది సీనియర్‌  ‌నేతలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. వైసీపీలో కొంత మంది ముఖ్యనాయకులు జగన్‌ ‌వ్యవహార శైలి జీర్ణించుకోలేక అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. ప్రాంతీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం వర్థిల్లితుందనుకోవడం ఎప్పటికీ పొరపాటే.

ఉన్నం శ్రీనివాసరావు,
సీనియర్‌ ‌జర్నలిస్టు
830989383

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy