వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్రమాదం నుండి గడ్కరీకి తప్పిన ముప్పు

August 13, 2019

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. నాగపూర్ నుండి ఢిల్లీ వస్తున్న ఇండిగో కంపెనీకి చెందిన 6ఈ636 అనే మోడల్ కి చెందిన విమానం టేక్ఆఫ్కిముందుగా నే మొరాయించింది. దీంతో అనుమానం వచ్చిన పైలట్ విమానాన్ని వెంటనే సాంకేతిక నిపుణులతో చెక్ చేయించారు. తీవ్రమైన లోపాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణ సమయాన్ని వాయిదావేసి ప్రయాణికులను వెయిటింగ్ లాంజ్ కి పంపించారు. దీనిపై సంబంధిత కంపెనీ నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే భద్రతా అధికారులు మాత్రం సీరియస్ గ తీసుకున్నట్టు సమాచారం.

ఫణిరాజ్కె,
ఢిల్లీ ప్రతినిధి,
ప్రజాతంత్ర