వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్రభుత్వ భూమి ఆక్రమణ…?

May 9, 2019

కబ్జాకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులు
నోరుమెదపని అధికారులుకబ్జాలను అడ్డుకోవలసిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అధికార పార్టీ నాయకులే కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రైవేటు స్థలం ముసుగులో, ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేస్తున్నారు. నగరం నడిబొడ్డున కూకట్‌ ‌పల్లి మండలం ఆల్విన్‌ ‌కాలనీ డివిజన్‌ ‌పరిధిలోని 57 సర్వే నంబరును మింగేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులే భూ బకాసురులుగా మారడంతో అధికారులు నోరు మెదపడం లేదు. రెవెన్యూ, జిహెచ్‌ఎం‌సి అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. తత్ఫలితంగా కబ్జాదారుల ఆగడాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతున్నాయి. ఇక్కడ సర్వే నంబర్‌ 46‌కు సంబంధించిన స్థలం తమదంటూ అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు వ్యవసాయ పొలాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి విక్రయించారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కాగా ఇది తమకు చెందిన స్థలం అంటూ మరో ప్రైవేటు వ్యక్తి కోర్టుకు వెళ్లగా, ఈ నిర్మాణాలను కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కళ్ళు తెరిచిన మున్సిపల్‌ అధికారులు ఆగమేఘాలపై కూల్చివేతలకు వెళ్ళినా రాజ్యాధికారం ముందు మోకరిల్లారు. తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి వెనుదిరిగారు. అధికారం మత్తు తలకెక్కింది కబ్జాదారులు హైకోర్టు ఉత్తర్వులను కూడా లెక్కచేయకుండా తిరిగి అదే స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఈ స్థలంపై వివాదానికి దిగిన ఇరు వర్గాలు చెబుతున్న విస్తీర్ణం కంటే ఎక్కువ స్థలంలోనే ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ మిగతా స్థలమంతా 57 సర్వే నంబర్‌ ‌ప్రభుత్వ భూమిగా స్థానికులు, అధికారులు చెబుతున్నారు. కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్న తర్వాత ఈ వివాదం ముగిసిన తర్వాతనే నిర్మాణాలు చేయాల్సి ఉన్నప్పటికీ, రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారు.