వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్రధాన మంత్రి కావాలన్న కోరిక లేదు

April 2, 2019

వరంగల్ సభ లో ముఖ్య మంత్రి కె . చంద్ర శేఖర్ రావు
24 ‌గంటల కరెంట్‌ ‌సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, విద్యుత్‌ ‌సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్‌ ‌వన్‌ ‌స్థానంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం వరంగల్‌ ఆజంజాహి మిల్లు మైదానంలో నిర్వహించిన వరంగల్‌ ‌పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ ‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభనుద్దేశించి సిఎం కెసిఆర్‌ ‌ప్రసంగిస్తూ వరంగల్‌ ఎం‌తో చైతన్యవంతమైన జిల్లా అని, సమర్థవంతమైన నాయకుణ్ణి ఎన్నుకుంటారని ఆశిస్తున్నాని అన్నారు. వరంగల్‌ ఉద్యమాల గడ్డ. ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి ఆచార్య జయశంకర్‌ ‌సారథ్యంలో ప్రధాన పాత్ర పోషించిన జిల్లా వరంగల్‌ అం‌టే తనకు ఎనలేని ప్రేమ అన్నారు. ఐదేళ్ల కింద తెలంగాణ ఎలా ఉండేది? నేడు ఎలా ఉంది? నేడు అభివృద్ధిలో ఎలా ఉందనే విషయాన్ని బేరీజు వేసుకోవాలన్నారు. ఇంకా నాలుగున్నరేళ్ల పాలన సాగించాలి… మిషన్‌ ‌భగీరథ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గత ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. 75 నుండి 100 టిఎంసిల నీటిని ఒక్క దేవాదుల ప్రాజెక్ట్ ‌ద్వారా వరంగల్‌కు పంపిస్తామని సిఎం పేర్కొన్నారు. భూముల విషయంలో దేశంలో ఎవరూ చేయలేని సాహసం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిందన్నారు. పోడు భూములకు పట్టాలు, పాసు బుక్‌లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని, ఎవరికీ ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈ సంవత్సరం వర్షాకాలం తరువాత కాకతీయ కాలువకు నీళ్లు లేకపోవడమనేది ఉండదన్నారు. 73 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు చేసిందేమి లేదన్నారు. దేశంలో ఉన్న సహజ సంపదను వాడే తెలివి జాతీయ నాయకులకు లేదని, కాంగ్రెస్‌, ‌బిజెపి ఎంపిలలో ఎవరు గెలిచినా ఢిల్లీలో గులాం కావాల్సిందేనన్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్య పోవాలన్నా, రైతులకు గిట్టుబాటు ధరలు రావాలన్నా, పేదరికం తరిమి కొట్టాలన్నా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ దేశంలో కీలకం కావాలని సిఎం అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా దేశంలో ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ అధికారంలోకి రావాలి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్పంచ్‌ ‌స్థాయి కంటే దిగజారి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. దేశానికి సంపద తీసుకొని వచ్చే రాష్టాల్లో తెలంగాణ టాప్‌-5‌లో ఉందని ఆయన వెల్లడించారు. రాహుల్‌, ‌మోడీ రోజు ఒకరికపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. ప్రధానమంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని.. ఎన్నికలు వస్తే ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజల కోరిక గెలవాలని రాష్ట్రాల హక్కులు, అధికారాలు కేంద్రం లాగేస్తోందని కెసిఆర్‌ ఆరోపించారు.