వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై.. కాశ్మీర్‌ ‌పండిట్‌లు ఏమనుకుంటున్నారు?

August 13, 2019

కాశ్మీర్‌లో ఉగ్రవాదం ప్రారంభమైన తర్వాత మూడు దశాబ్దాల క్రితం వేలాది మంది ప్రాణభయంతో స్వస్థలాలను వీడి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణం రద్దుతో ఉగ్రవాదం అంతమై పోతుందని కేంద్ర హోం మంత్రి అంటున్నారు. ఉగ్రవాదంపోతే కాశ్మీరీ పండిట్‌లు తిరిగి వస్తారా మూడు దశాబ్దాల తర్వాతైనా..!. అషీమా కౌల్‌ 1990‌లో ఉగ్రవాదులు చెలరేగినప్పుడు భయానక పరిస్థితుల గురించి చెబుతూ అప్పటి పరిస్థితి తల్చుకుంటూనే ఒళ్ళు గగుర్పొడుస్తుందని అన్నారు. తమ బంధువులు కాశ్మీర్‌ ‌నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జమ్ముకు వచ్చారని ఆమె అన్నారు. వారిలో తమకు అన్యాయం జరిగిందన్న ఆక్రోశం, ఆగ్రహం ఉందని అన్నారు. ఆమె వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. ఇంతకాలం బిక్కుబిక్కుమంటూ ఉన్న వారిని ఎవరిని అడిగినా ఇప్పుడు తమ అనుభవాలను చెబుతారు.

1880 దశకం చివరలో కాశ్మీర్‌ ‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కాశ్మీర్‌లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. పండిట్లు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారందరూ ఆత్మరక్షణ కోసం ఊరు వదలిపోవాల్సి వచ్చింది. 2010లో ప్రభుత్వం తయారు చేసిన నివేదిక ప్రకారం 1989నుంచి 219 మంది కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు కాల్చి చంపారు. మూడు దశాబ్దాలుగా స్వస్థలాలనూ, స్వంత ఇంటినీ వదిలి వనెళ్ళిన కాశ్మీరీ పండిట్లు ఇప్పుడు భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, కాశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం పట్ల హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఏవిధంగా అమలు అవుతాయో వేచి చూడాలని వారు అంటున్నారు. కౌల్‌ ‌కాశ్మీర్‌లో నివసిస్తున్నారు. వివిధ వర్గాల మధ్య సామరస్యం కోసం కృషి చేసేందుకు ఆమె ఒక సంస్థను స్థాపించారు. అందరినీ కలుపుకుని పోవడానికీ, అందరి మధ్య సామరస్యం పెంచడానికి చేయాల్సింది ఎంతో ఉందని ఆమె అన్నారు. సానుకూల ధృక్పథంతోనే ముందుకు సాగుతున్నట్టు ఆమె చెప్పారు. కాశ్మీరీ పండిట్‌లలో కొందరు స్వస్థలాల్లోనే ఉండిపోగా, మరి కొందరు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళారు. అమల్‌ ‌మ్యాగజైన్‌ ‌ఫరీదాబాద్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా వ్యవహ రిస్తున్నారు. అతడి వయసు 37 సంవత్స రాలు. 1990లో తమ కుటుంబం కాశ్మీర్‌ ‌నుంచి బలవంతంగా ఇతర ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. తమ ఇంటిని ఉగ్రవాదులు తగులబెట్టారని అతడు చెప్పాడు. తన తండ్రి కష్టార్జితాన్ని అంతా కూడబెట్టి ఆ ఇంటిని 1988లో తిరిగి నిర్మించారని అతడు చెప్పాడు, 1991లో ఫరీదాబాద్‌ ‌రావడానికి ముందు తన కుటుంబం ఢిల్లీ, చండీగఢ్‌, ‌పంజాబ్‌లలోని బంధువుల ఇళ్ళలో గడిపినట్టు అతడు చెప్పాడు. గూర్గావ్‌కి చెందిన మీనాక్షీ భాన్‌ ‌వయసు 52 సంవత్సరాలు. ప్రభుత్వ నిర్ణయం తనకు చాలా సంతోషాన్ని కలిగించినట్టు ఆమె చెప్పారు. అయితే, ప్రభుత్వ నిర్ణయం తనకు పెద్దగా మార్పు తీసుకురాదని అన్నారు. ఇది మరో మార్పుకు దోహదం చేస్తుందని ఆమె అన్నారు. స్థానికులు ఇకపై తమపై ఎటువంటి పెత్తనం చేయలేరని అన్నారు. ఆమె జమ్ములో పుట్టి అక్కడే పెరిగారు. కాశ్మీరీ ముస్లింలు ప్రత్యేక ప్రతిపత్తి వల్ల గతంలో తమను ఎవరూ ఏమీ చేయలేరని అనుకునే వారు. ఇప్పుడు మేం అక్కడికి వెళ్తే అటువంటి పరిస్థితి ఉండదు. ధైర్యంగా తలెత్తుకోవచ్చు. భాన్‌ ‌కుటుంబం కూడా 1990లో కాశ్మీర్‌ ‌లోయను విడిచి పెట్టింది. కట్టుబట్టలతో తాము ఒక టాక్సీలో కాశ్మీర్‌ ‌నుంచి బయటికి వచ్చామని ఆమె చెప్పారు. అప్పట్లో తమ ప్రాణాలకు ముప్పు ఉండేదని ఆమె చెప్పారు. కాశ్మీరీ పండిట్‌ల కుటుంబ సభ్యులు అధికారగణంలో ఉన్నత స్థానాల్లో ఉన్నా, వారిలో కొందరు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని తరచూ ఫిర్యాదు చేసేవారు. కాశ్మీరీ ముస్లింలు మొదటి నుంచి తమను చిన్న చూపు చూసేవారని మనోజ్‌ ‌భట్‌ అన్నారు. ఆయన ఇండోనేషియాలో ఉంటున్నారు. హిందువులపై ద్వేషం కరుడుకట్టి ఉండేది. అటువంటి పరిస్థితిని అబ్దుల్లాలు(ఫరూక్‌, ఒమర్‌ అబ్దుల్లాలు) పెరగనిచ్చారు. వృత్తి రీత్యా వ్యాపారి అయిన భట్‌ ‌శ్రీనగర్‌లోనే పుట్టారు. 1985లో ఉన్నత విద్య కోసం సూరత్‌ ‌వెళ్లినట్టు ఆయన చెప్పారు. 1990 తన తల్లితండ్రులను కలుసుకోలేకపోయానని ఆయన అన్నారు. మూడు రోజుల తర్వాత పొరుగువారి ద్వారా నా తల్లితండ్రుల ఆచూకీ తెలిసింది. తన తల్లితండ్రులు అర్ధరాత్రి కట్టుగుడ్డలతో జమ్ము వెళ్ళిపోయినట్టు పొరుగువారు చెప్పారని ఆయన వివరించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులు భయోత్పాతాన్ని సృష్టించడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రాంతాలకు వెళ్ళిన కాశ్మీరీ పండిట్లకు సాయం చేయడానికి ప్రయత్నించాయి. 2008లో యూపీఏ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 7.5 లక్ష పరిహారాన్ని ఉపాధి అవకాశాల కోసం అందించింది. 2014లో బీజేప ప్రభుత్వం ఇదే పద్దు కింద 500 కోట్లు కేటాయించింది. మూడు సంత్సరాల తర్వాత అప్పటి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌కాశ్మీరీ పండిట్ల కోసం 6,000 ట్రాన్సిట్‌ ‌హోమ్స్ ‌నిర్మిస్తామని ప్రకటించారు. 30 ఏళ్ళ పాటు భాన్‌ ‌తన కుటుంబంతో సహా రాష్ట్రాన్ని రెండు సార్లు సందర్శించారు. అయితే, రెండు సార్లూ చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఆమె చెప్పారు. మేం అక్కడికి వెళ్ళగానే మీరు ఇండియా నుంచి వచ్చారా అని స్థానికులు అడిగేవారు. అంటే కాశ్మీర్‌ ఇం‌డియాలో లేదన్నట్టు ఉంది వారి ప్రశ్న. దాంతో మనసు చివుక్కుమంది. ఏమిటా ప్రశ్న అని అనిపించిందన్నారు ఆమె. అంతేకాక, భారతీయులు తక్షణం వెళ్ళిపోవాలన్న రాతలు గోడల మీద కనిపించాయి. కాశ్మీరీ ముస్లింల మనసు కాలుష్యం అయిందనిపించింది. ప్రతి సారి నేను కాశ్మీర్‌లో మా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పర్యాటకుడు వెళ్లినట్టు అనిపించింది. హోటల్‌లో బస చేసి డబ్బులిచ్చి వచ్చేయడమే ప్రతిసారి నేను చేసింది. కాశ్మీరీ పండిట్‌గా ఆయన చెబుతున్నదేమంటే 370వ అధికరణం రద్దు వల్ల పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఇప్పటికే అక్కడ స్థలాలను కొనుగోలు చేయవచ్చు. కాశ్మీర్‌లో సౌకర్యాలు దేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగా ఉన్నాయి. అయితే, 370వ అధికరణం కాశ్మీరీలు ఇతర ప్రాంతాల వారితో కలవడానికి అడ్డంకిగా ఉందని ఆయన అన్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు తగిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి కన్నా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మాజీ ప్రదాని అటల్‌ ‌బహారీ వాజ్‌ ‌పేయి కాశ్మీరియత్‌ ‌జమ్హూరి యత్‌, ఇన్సానియాత్‌ అం‌టే కాశ్మీరీల సంస్కృతి, ప్రజా స్వామ్యం. మాన వతా వాదం పరిరక్షి ంచబడాలని ఆయన అన్నారు. ప్రజల మధ్య సామరస్యం పెరగడానికి సామాజిక బంధం బలపడటానికి ప్రభుత్వం ఇంకా ఎన్నో చర్యలు తీసుకోవాలని ఫరీదా బాద్‌లో స్థిర పడిన వ్యాపారి ఆశీష్‌ ‌ఝుస్తీ అన్నారు. పౌర సమా జానికి ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. 1990 ఏప్రిల్‌లో తన బంధువులందరినీ కోల్పోయానని ఆయన అన్నారు. మార్పు పత్రికల్లోనే కనిపిస్తోందని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో అంత భారీ సంఖ్యలో సైనికులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. సైన్యాన్ని ఉపసంహరిస్తే ఏం జరుగుతుందోనన్న భయం ప్రభుత్వంలోనూ ఉండి ఉంటుందని ఆయన అన్నారు. అలాగే, ఢిల్లీకి చెందిన రాహుల్‌ ‌మహ్‌ ‌నూరి కాశ్మీరీ ప్రజల సంస్కృతి గురించి ఆలోచించాలని అన్నారు. డబ్బు, పెట్టుబడులతోనే అంతా జరగదని అన్నారు. జిహాదీ భావాలను ప్రజల హృదయాలనుంచి తుడిచివేయాలని అన్నారు. ప్రభుత్వం చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని అన్నారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించాలి. కాశ్మీరీ ముస్లింలలో కూడా మంచివారు, మానవతావాదులు ఉన్నారని అన్నారు.

– ‘స్క్రోల్‌.ఇన్‌’ ‌సౌజన్యంతో..