Take a fresh look at your lifestyle.

ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయం

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

‌తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ ‌నరసింహన్‌ ‌ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకూ అందేలా చూడాలని సూచించారు. ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకు కొలమానమని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిబద్ధత, పారదర్శకంగా అందేలా చూడాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రభుత్వానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని అభిలషించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy