Take a fresh look at your lifestyle.

ప్రజలకు అనుగుణంగా రవాణా సౌకర్యం

ప్రజల అవసరాలకు అనుగుణంగా రవాణా సౌకర్యం కల్పించాలనే సంక్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని అందుకు అనుగుణంగా, రోడ్డు,రేలు రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. జిల్లా ప్రజల చిరకాల వాంచ ఎట్టకేలకు నేటితో తీరిందని శాతవాహనఎక్స్‌ప్రెస్‌ ట్రెన్ గురువారం జనగామ రైల్వేస్టేషన్‌లో ఆగడం ఎంతో సంతోషకరమన్నారు. సౌత్‌ సెంట్రట్‌ ఏడీఆర్‌ఎం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ జనగామ స్టేషనలో శాతవాహన రైలు హోల్టింగ్‌ను ప్రారంభించారు. అనంతరం రైల్వేస్టేషన్‌ ఆవరణలో జరిగిన సమావేశంలో ఎంపీ బూరనర్సయ్య గౌడ్‌ మాట్లాడుతూ జనగామ ప్రజల చిరకాల వాంఛ తోపాటు వీవర్స్‌ కాల నీ పుట్‌ ఓవర్‌ బ్రిడ్జీ నిర్మాణం, శాతవాహన రైలు ఆపుకోవడం జరిగిందన్నారు. జనగామ నుండి కేవలం గంట సమయంలో సికింద్రాబాద్‌ చేరుకోవచ్చన్నారు. విజయవాడ`కాజీపేట మీదుగా జనగామ రైల్వేస్టేషన్‌కు ఉదయం 10.15, సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 5.15గంటకు బయు దేరుతుంద న్నారు. జనగామ స్టేషన్‌ను పూర్తిగా ట్రాన్స్‌పోర్ట్‌హబ్‌గా మార్చేస్తామని అనడంతో ప్రజల నుండి, ప్రజాప్రతినిధుల నుండి హర్ష ద్వానాలు వ్యక్తం చేశారు. రాబోయే రోజలు తెంగాణ రాష్ట్రానికి అనుకూలిస్తాయని, కేంద్రంలో కీల కపాత్ర పోషించేది తెంగాణ ఎంపీలు మాత్రమేనని విషయాన్ని ప్రజలు గమనించి అత్యధిక మెజార్టీతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాని పిలు పునిచ్చారు.
దిగుబడి పెరిగింది…ఎగుమతి ఊపందుకుంది : ముత్తిరెడ్డి
జనగామ ఒకప్పుడు కరువు కాటకాతో కొట్టుమిట్టాడేదని, బ్రతుకు దెరువు లేక వసకు పోయి పల్లెల్లో యువకు కనబడే వారు కారని తెంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత జనగామను సస్యశ్యామంగా తీర్చిదిద్దడంతో పంట దిగుబడి పెరిగి ఎగుమతి ఊపందుకుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. 

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy