వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పోలీసుల వ్యవహారశైలి మారాలి

August 26, 2019

‘‘ఒక రాజు బలవంతుడుగా ఉండాలంటే అతని సైన్యం బలిష్టంగా ఉండాలి. ఇది చాణక్యనీతి. ఈ నీతిని మన పాలకులు తూ..చ తప్పకుండా అమలు పరుస్తున్నారనటంలో సందేహం లేదు. ఇది క్షేత్రస్థాయిలోనూ బలంగానే అమలవు తుంది. మనం మండల స్థాయిల్లో పరిశీలించినా కూడా ఇట్టి విషయం బోధపడు తుంటుది’’,ఎందుకంటే ప్రజలను ఎప్పటికప్పుడు తమ ఆజమాయిషీలో ఉంచుకునేందుకు పాలకులు వివిధ సాధనాలను ఉపయోగిస్తుంటారు. ప్రజలను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు పాలకవర్గాలు ఉపయోగించే బలమైన సాధనాల్లో ఒకటి మన పోలీస్‌ ‌వ్యవస్థ అనేది ఎవరూ కాదనలేని సత్యంగా మారిపోయింది. చట్టం ఎవరికీ చుట్టం కాకుండా నిష్పక్షపాతంగా అమలు చేసే విధంగా గుణాత్మకమైన మార్పులు పోలీస్‌ ‌వ్యవస్థలో తీసుకువస్తున్నామని గొప్పగానే చెప్తున్నారు అస్తమానం చెప్తుంటారు పాలకులు. ప్రజలకు చేరువై, ప్రజలతో మమేకమై నేర ప్రవృతిని తగ్గించేందుకు చేపట్టే ఎలాంటి చర్యలనైనా ఆవ్వానించాల్సిందే. అందులో భాగంగా ‘ప్రెండ్లీ పోలీసింగ్‌’ ‌తీసుకొచ్చామని అటు పోలీస్‌ ఉన్నతాధికారులు, ఇటు ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పటం మనం వింటూనే ఉన్నాం. అయితే క్షేత్ర స్థాయిలో ఇది ఎంతమేరకు, ఎంత మంది పోలీసులు అనుసరిస్తున్నారు..? అమలు చేస్తున్నారు..? ప్రజలతో మమేకమువుతున్నారు..? పలు కేసుల్లో పోలీస్‌ ‌స్టేషన్‌కు వచ్చిన వారి పట్ల ఏంతమేరకు సత్పవర్తనతో మెదులుతున్నారనేది ప్రశ్నించు కోవాల్సిన, పరిశీలిచు• •వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులే కాదు, ఒక ప్రాంతంలో ప్రభావిత శక్తులుగా ఉండే వారిని, పాలకవర్గ పార్టీల అనుయాయులను, వారు కూడా పాలకుల విధానాలను అమలు చేసేవారిగానే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రభావిత వ్యక్తులుగా, శక్తులుగా ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగానే పోలీసులు కూడా వ్యవహరించటం పరిపాటిగా మారింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రభావిత శక్తులు సపోర్టుచేసే వారికి అనుకూలంగా పోలీసులు వ్యవమరించటం అనివార్యంగా మారుతుందనటంలో సందేహం లేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే దీంతో న్యాయాన్యాయాలను పరిశీలించి చట్టాలను అనుసరించి వ్యవహరించే స్ప•హను పోలీసులు కోల్పొతున్నారు. పోలీస్‌ ‌స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల వ్యవహరించే పద్ధతి కూడా అనివార్యంగా మారుతుందంటే అతియోశక్తి కాదు. ఫిర్యాదు చేయటానికి వచ్చిన వారిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ తిట్లపురాణం చేయటం అతి సాధారణ అంశంగా పోలీస్‌ ‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓలుగా వారు భావింస్తున్నారనేది గమనార్హం. నేరం జరిగిందా…లేదా అసలు సంఘటన స్థలంలో ఏం జరిగిందనే పరిశీలన గానీ, విచారణ గానీ ఏమీ చేయకుండానే ఫిర్యాదు చేయటానికి వచ్చిన వారిని నేరస్థులుగానే చిత్రించటం పోలీసులకు అనవాయితిగా మారిందనటంలో సందేహం లేదు. ఏమాత్రం పరిశీలించినా ఇందుకు ఉదాహరణలు కోకొళ్లలుగా వెలుగుచూస్తాయి. వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా శాయంపేట మండలంలో కొన్ని కేసులను పరిశీలిస్తే పోలీసుల్లో చైతన్యం స్థాయి ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది. దీనికి తోడు రాజ్యంలో భాగమైన పోలీస్‌ అహంకారాన్ని సైతం ఏ మాత్రం తగ్గకుండా ప్రదర్శించటం శాయంపేట మండల పోలీసులకు వెన్నతోపెట్టిన విద్యగా మారిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ముందే చెప్పినట్లుగా ప్రెండ్లీ పోలీసింగ్‌ అనేది ఇక్కడ ఏ మాత్రం వీరికి అబ్బటం లేదనేది గమనించాల్సిన అవసరం ఉంది. ఫిర్యాదు పట్టుకొని పోలీస్‌ ‌స్టేషన్‌ ‌వచ్చిన ఫిర్యాదు దారున్ని ఇష్టం వచ్చినట్లుగా దుర్భాష లాడటం సర్వసాధరణ అంశంగా మారుతుందనటంలో సందేహంలేదు. ఫిర్యాదు దారుడు చదువుకున్నవాడేనా..? అతని మానసిక స్థితి ఏమిటి..? దుర్బాషలాడితే మానసికంగా ఎలాంటి స్థితికి వెళ్లిపోతాడనే కనీస అవగాహన కూడా లేకుండా పోలీసు కానిస్టేబుల్‌ ‌వ్యవహరించటం, ఆ విషయాన్ని ఎస్సై దృష్టికి తీసుకెళ్లినా కూడా అదేదో వారి పేటెంట్‌ ‌హక్కు అన్నట్లుగా పోలీస్‌లు, ఎస్సై వ్యవహరించటం, ఇదేమి పెద్ద అంశం కాదనట్లుగా పట్టించు కోకపోవటం శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో సర్వసాదరణంగా మారిందనేది కొన్ని కేసులను ‘కేస్‌ ‌స్టడీ’ గా పరిశీలించేవారికి ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అంతటితోనే ఆగుతున్నారా అంటే కొన్ని కొన్ని చోట్ల పోలీసులు ఫిర్యాదు చేయటానికి వచ్చిన ఫిర్యాదుదారున్ని బుకాయించి తమకు అనుకూలంగా ఫిర్యాదును బలవంతంగా రాయించుకోవటం కూడా జరుగుతుందంటే పోలీసుల వ్యవహారం ఎలా ఉందో గమనించాలి. చట్టాని రక్షించాల్సిన వారే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఇక సామాన్యుడు చేసేదేమి ఉంటుంది..? పోలీసు స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, ప్రెండ్లీ వాతావరణాన్ని పెంచి నేరప్రవృత్తిని తగ్గించే విధంగా పోలీసులు ఉండాలని ఉన్నతాధికారులు చెప్పే నీతి సూత్రాలు ఏ మేరకు, ఎంత మంది పోలీసులు, ఎన్ని స్టేషన్లలో పాటిస్తున్నారో పరిశీలించుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంది. పోలీసుల వ్యవహారశైలిని పరిశీలించి ప్రశ్నించాల్సిన అవసరం పౌరసమాజానికి ఉందనేది గుర్తించాలి. పోలీసు శాఖ కూడా పాలకుల ప్రయోజనాలనే కాదు, ప్రజలకు చట్టాలను, న్యాయాన్ని సక్రమంగా అందేవిధంగా చూడాల్సిన కర్తవ్యం వారికేందని గుర్తించాలి. అలాంటప్పుడే పోలీసులకు ప్రజలకు మధ్య సరైన బంధం ఏర్పడి న్యాయ వ్యవస్థపై పోలీసులపై, చట్టాలపై పౌరసమాజానికి నమ్మకం ఏర్పడుతుంది. ఈ దిశగా పోలీసు వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సరి చేసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా శాయంపేట మండలం లాంటి చోట పోలీసుల వ్యవహారం ఎలా ఉదో పరిశీలించి తగు చర్యలు చేపట్టి ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంచాలి. ముఖ్యంగా పోలీసులకు మానసిక చైతన్యం, విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచెందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

రాజేందర్‌ ‌దామెర
జర్నలిస్ట్, ‌వరంగల్‌
‌సెల్‌ :8096202751