వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘పోలవరం’కు ఎన్నడు అడ్డుపడలేదు

April 8, 2019

ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు
చంద్రబాబు లాగా కుట్రలు చేయం : వికారాబాద్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌తెలంగాణలో ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికిఆదర్శంగా నిలిచాయని గొప్పగా చెబుతున్నానని సిఎం కెసిఆర్‌ అన్నారు. మనపతకాలను బిజెపి తన మేనిఫెస్టోలోప్రకటించుకోవడం మనకు గర్వ కారణమని అన్నారు. తెలంగాణ పథకాలను పేర్లుమార్చి ప్రచారం చేసుకోవడం లేదా అమలు చేసుకోవడం అన్నది మనకు గర్వకారణమన్నారు. వికారాబాద్‌లో జరిగిన ప్రచార సభలో కెసిఆర్‌ మాట్లాడుతూ దేశానికి దశదిశను చూపే సత్తా మనకే ఉందన్నారు. ఇకపోతే కాంగ్రెస్‌,బిజెపిలకు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. బిజెపికి150, కాంగ్రెస్‌కు వందలోపు కంటే ఎక్కువ సీట్లు రావన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీదే హవా అన్నారు. తెలంగాణలో ఎంఐఎంతో కలసి మనకు 17సీట్లు రాబోతున్నాయని అన్నారు. ఎపిలో జగన్‌కు అధికారంలోకి రాబోతున్నారని, ఆయనకు వచ్చే ఎంపి సీట్లతో 35,36 సీట్లతో మనం ఢల్లీిలో సత్తా చాటుతామని అన్నారు. ఈ మొత్తం ఎంపిలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్‌ పార్టీ సహకరిస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న విమర్శల ను కెసిఆర్‌ ఘాటుగా తిప్పి కొట్టారు. ప్రత్యక హెదాపై గతంలోనే పార్లమెంట్‌ వేదికగా మన ఎంపిలు మద్దతు పలికారని అన్నారు. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేవిూ లేదన్నారు. ఎపికి ప్రత్యేకమోదాకుకట్టుబడి ఉన్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పుడూ అడ్డం పడలేదని కూడా కేసీఆర్‌ స్పష్టం చేశారు.