- వెంటనే పట్టాలను అందించాలి
- సిఎం కెసిఆర్‌కు సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క లేఖ
మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3 : పోడు భూముల పట్టాలు, అర్హుల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. వెంటనే పోడుపట్టాలు అందించాలన్నారు. దీనికి సంబంధించి లబ్దిదారుల జాబితా విడుదల చేయాలని సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. మంచిర్యాల జిల్లాలో భట్టి హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతుంది. ఆదివారం మండలంలోని దాంపూర్ నుంచి బూరుగుపల్లి, పోతనపల్లి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. సోమవారం మందమర్రి టౌన్‌లో యాత్ర కొనసాగించారు. యాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భట్టి విక్రమార్క సోమవారం బహిరంగ లేఖ రాశారు. లేఖలో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
18 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాను పాదయాత్ర చేస్తున్నానని, ఏ ఊరికి వెళ్లినా పోడు రైతులు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పత్రాలు తప్ప మళ్ళీ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని లేఖలో తెలిపారు. పోడు రైతులందరికి వెంటనే పట్టాలు ఇవ్వాలని, వారిపై ఉన్న కేసులను ఎత్తేయాలని భట్టి విక్రమార్క లేఖలో పేర్కొన్నారు. కొన్నేళ్లుగా అదివాసులు, గిరిజనులు పోడు భూముల సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పోడు భూములకు సంబంధించిన అనేక సమస్యలను భట్టి తన లేఖలో ప్రస్తావించారు. అదివాసులు, గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన హావి•లు, ప్రకటనలు నీటి వి•ద రాతలు లాగా మిగిలిపోయాయని అన్నారు భట్టి. పోడు భూములపై పరిష్కారం చూపకపోతే తాము పోరాటాలు చేస్తామని చెప్పారు. అదివాసులు, గిరిజనులు రోడ్ల వి•దికి రాకముందే సమస్యను పరిష్కారించాలని కోరారు. ఇక యాత్రలో పాల్గొనేందుకు మందమర్రి కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు.