వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పోడు భూముల సమస్య పరిష్కారిస్తాం, రాష్ట్రాల మాట చెల్లుబాటు కావాలె

April 4, 2019

మానుకోట బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌…

‌మహబుబాబాద్‌ ‌టౌన్‌ : ‌రాష్ట్రాల మాట చెల్లుబాటు అయితేనే దేశం ఫెడరల్‌ ‌స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుందని స్వాతంత్రం వచ్చిన నుంచి మొదలు కొని ఇప్పటి వరకు నాటి ప్రధాని నెహ్రూ మొదలు నేటి రాహుల్‌ ‌వరకు పేదలను ఉద్ధరిస్తామనే ప్రకటనలు తప్ప ఇప్పటి వరకు దేశానికి, పేదలకు చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్‌ ‌రావు అన్నారు. గురువారం మానుకోట పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, ‌బిజెపి రెండు చోర్‌ ‌పార్టీలేనని, ఒకరి కంటే ఒకరు ఘనులని ఎద్దేవాచేశారు. రాష్ట్రం ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పడిందని, ఇటువంటి తరుణంలో ప్రతి శాఖను ప్రక్షాళన చేయాలనీ, అందులో ముఖ్యంగా రెవిన్యూ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని, బ్రిటిష్‌ ‌కాలంలో రెవిన్యూ వసూలు కోసం మాత్రమే ఈ విభాగం పనిచేసేదని, ప్రస్తుతం రెవిన్యూ వసూలు చేయడం లేదని, ప్రభుత్వమే రైతులకు పంట సహాయం చేస్తుందని, ఇటువంటి తరణంలో ఆ శాఖను ప్రక్షాళన చేయబోతున్నానని అన్నారు. సమైక్య పాలనలో నీటి తీరువా పన్ను విధించే వారని, దానిని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. రాష్ట్రాలను గోల్‌ ‌మాల్‌ ‌చేయడంలో కాంగ్రెస్‌, ‌బిజెపి రెండు పోటీ పడుతున్నాయని, 16 కు 16 సీట్లు గెలిస్తేనే దేశంలో తెలంగాణ చక్రం తిప్పుతుందన్నారు. ముఖ్యంగా విభజన చట్టంలో అనేక హామీలు నేవేర్చడంలో కేంద్రంలో బిజెపి వెనుకకు పోయిందని అవి నేరవేరాలన్నా, తెలంగాణ దేశంలో ఎలుగెత్తి నిలవాలన్నా కారు 16 గెలవాలన్నారు. నూతన జిల్లాల ఏర్పాటును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని కొత్త జిల్లాలు అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు మానుకోట పూర్తిగా వెనుకబడిన గిరిజన జిల్లా అని, ఈ జిల్లాలో అనేక సదుపాయాలు రావాల్సి ఉందని, బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, అదే విధంగా 7 గిరిజన నియోజకవర్గాలలో ఉన్న పోదు రైతుల సమస్యను ఎన్నికల అనంతరం తీరుస్తామని హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలో అభ్యర్థి మాలోత్‌ ‌కవితను గెలిపించి మరోసారి తెలంగాణ గ•వన్నీ ఢిల్లీకి వినిపించాలని అన్నారు. నూతన మండలాల ఏర్పాటుపై హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు, మానుకోట, డోర్నకల్‌, ‌పినపాక, ఇల్లందు, నర్సంపేట శాసన సభ్యులు శంకర్‌ ‌నాయక్‌, ‌డిఎస్‌ ‌రెడ్యా నాయక్‌, ‌రేగా కాంతారావు, పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి, మాలోత్‌ ‌కవిత, పార్లమెంట్‌ ఇం‌చార్జి సత్యవతి రాథోడ్‌, ‌వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లు, జిల్లా, మండల స్థాయీ నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.