Take a fresh look at your lifestyle.

పొట్టేళ్ల బలిదానం!

పండగో, జాతరో, చావో,
సంబరమో, పందేరమో
నెగ్గిన ఆనందంతో కొన్ని!
ఓడిన ఆక్రోశంతో మరిన్ని!
కంఠాలు పగలబడి నవ్వుతూ!
కాయాలు విరగబడి గెంతుతూ!
తిర్రు తిప్పి, కర్రు పెట్టి, రెచ్చగొట్టి
ఎగ తోస్తూ, ఉసి గొలుపుతూ!
విషాదం లోంచి
వినోదం వెలికి తీస్తారు!
వికృతం నుంచి
వేడుక రంగరిస్తారు!
ఏదైనా ఇంతే వీరితో!
మౌనాన్ని వీడి నిలదీస్తే
దేవతని చేసేస్తారు!
మూగగా ఉండిపోతే
దేవతకే బలి ఇస్తారు!
ఏదైనా వింతే వీరితో!
ఆకలి తీరటం కోసం మృగం
అడవిలో వేటాడితే!
ఆహ్లాదం పొందటంకోసం
ఆటవికం వెంటాడితే!
అమానుషత్వాన్ని తట్టుకోలేకో,
అమాయకత్వాన్ని చెప్పుకోలేకో!
దేముడిని మౌనం వీడమనో,
దెయ్యాలకు జ్ఞానం ఇవ్వమనో!
టపా టపా తలలు కొట్టుకుంటూ
కపాలాలు మోదుకుంటూ!
మోక్షాన్ని వెతుక్కుంటూనో,
మొక్కులు తీర్చుకుంటూనో!
పగటీల పొట్టేళ్ల బలిదానం!
మాపటేళ పళ్లెంలో ఫలహారం!
సరిగ్గా అప్పుడే …
దూరంగా ఎక్కడో?…..
చర్మ వాద్యాల సవ్వడి
బాకబూరాల అలికిడి!
మూగజీవాలని రక్షించమని!
మానవత్వాన్ని చాటమని!

– ఉషారం, 9553875577

Leave a Reply